ఎకో డ్రైవింగ్ కాంటెస్ట్‌లోకి ప్రవేశించిన ఫోర్డ్ మస్టాంగ్ కన్వర్టిబుల్

By Anil

ఫోర్డ్ మోటార్స్ 5.0-లీటర్ వి8 ఇంజన్ వినియోగించిన, కండలు తిరిగిన మస్టాంగ్ ఈ ఏడాది ఎమ్‌పిజి మారథాన్‌లో పాల్గొననుంది. మస్టాంగ్ లోని కన్వర్టిబుల్ వేరియంట్ వార్షిక ఇంధన సవాలుని ఎదుర్కోనుంది.

ఫోర్డ్ మస్టాంగ్ కన్వర్టిబుల్

పనితీరు పరంగా ఇందులో 5.0-లీటర్ వి8 మోంస్టర్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 415బిహెచ్‌పి పవర్ మరియు 530ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌న ఉత్పత్తి చేయును.

ఫోర్డ్ మస్టాంగ్ కన్వర్టిబుల్

ఈ పోర్డ్ మస్టాంగ్ కేవలం 4.8 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఫోర్డ్ మస్టాంగ్ కన్వర్టిబుల్

అయితే ఈ మారథనా‌లో పాల్గొననున్న మస్టాంగ్ 20ఎమ్‌పిజి (14.1 లీటర్/100కిమీ) సగటు మైలేజ్ ఇవ్వగలదు.

ఫోర్డ్ మస్టాంగ్ కన్వర్టిబుల్

ఎమ్‌పిజి మారథాన్ నిర్వహిస్తున్న జెర్రీ రమ్సాడెల్ మాట్లాడుతూ, ఎకో వాహనాలు మరియు వాటిని నూతన డ్రైవింగ్ శైలికి ఎమ్‌పిజి మారథాన్ నిలయమని తెలిపాడు.

ఫోర్డ్ మస్టాంగ్ కన్వర్టిబుల్

మైలేజ్ కోసం ప్రత్యేకంగా నిలిచిన ఈ ఎమ్‌పిజిలో మస్టాంగ్ లాంటి ఉత్పత్తులు ఎంట్రీ ఇస్తే దీనిని బీట్ చేయడానికి ఇందులో పాల్గొనే ఇతరులు ఎలాంటి కార్లతో వస్తారో ఏమో...!!

ఫోర్డ్ మస్టాంగ్ కన్వర్టిబుల్

అయితే ఎమ్‌పిజి మారథాన్ వారి నియమాలకు అనుగుణంగా ఫోర్డ్ మస్టాంగ్ ఉత్తమ మైలేజ్ కనబరుస్తుందో లేదా వేచి చూడాలి.

ఫోర్డ్ మస్టాంగ్ కన్వర్టిబుల్

అత్యుత్తమ పనితీరు కనబరిచే మరియు శక్తివంతమైన ఈ కారును అన్ని మైలేజ్ ప్రమాణాలకు లోబడి ఎకో ఫ్రెండ్లీ పద్దతిలో డ్రైవ్ చేస్తే మస్టాంగ్ కూడా మంచి మైలేజ్ ఇవ్వగలదని నిరూపించనున్నారు.

ఫోర్డ్ మస్టాంగ్ కన్వర్టిబుల్

ఫోర్డ్ వి8 మస్టాంగ్ కారును ఎమ్‌పిజి మారథాన్ వేదిక మీద ఆండీ డాసన్ మరియు ఆండీ మారియట్ట్ నడపనున్నారు. వీరివురూ గతంలో 2021లో జరిగిన ఇదే మారథాన్‌లో ఫోర్డ్ ఫియస్టా ఎకోనెటిక్ 1.6 టిడిసిఐ వేరియంట్ ఉపయోగించి గెలుపొందారు.

ఫోర్డ్ మస్టాంగ్ కన్వర్టిబుల్

యుకె సేల్స్ విభాగాధిపతి కెవిన్ గ్రిఫ్ఫిన్ మాట్లాడుతూ, రైట్ హ్యాండ్ డ్రైవింగ్ మస్టాంగ్‌లను అందుబాటులోకి తెచ్చినప్పటి నుండి సుమారుగా 3,000 కార్లను కస్టమర్లకు డెలివరీ ఇచ్చాము మరియు మొత్తంలో 2/3 వ వంతు 5.0-లీటర్ వి8 ఇంజన్‌లను కలిగి ఉన్నాయని తెలిపారు.

ఫోర్డ్ మస్టాంగ్ కన్వర్టిబుల్

యుకెలో గరిష్ట సూపర్ కార్లను అమ్మిన జాబితాలో ఫోర్ట్ మస్టాంగ్ నిలిచింది. అయితే కేవలం ఉత్తమ పనితీరు మాత్రమే కాకుండా మంచి మైలేజ్ కూడా ఇవ్వగలవు అని నిరూపించడానికి ఎమ్‌పిజి మారథాన్ లో పాల్గొంటోంది.

ఫోర్డ్ మస్టాంగ్ కన్వర్టిబుల్

ఎమ్‌పిజి మారథాన్ పోటీలు అక్టోబర్ 18-19, 2016 లో ఇంగ్లాండ్ కేంద్రంగా జరగనున్నాయి.

ఫోర్డ్ మస్టాంగ్ కన్వర్టిబుల్

సిల్వర్ మరియు రేస్ ట్రాక్ అనే డ్రైవింగ్ మోడ్‌ల వద్ద ఈ పోటీల్లో పాల్గొనే ఉత్పత్తులు ఎమ్‌పిజి వారి ప్రమాణాలకు అనుగుణంగా ముందుగా సూచించిన మైలేజ్ మైలురాయిని చేధించాల్సి ఉంటుంది.

ఫోర్డ్ మస్టాంగ్ కన్వర్టిబుల్

సిల్వర్ మరియు రేస్ ట్రాక్ అనే డ్రైవింగ్ మోడ్‌ల వద్ద ఈ పోటీల్లో పాల్గొనే ఉత్పత్తులు ఎమ్‌పిజి వారి ప్రమాణాలకు అనుగుణంగా ముందుగా సూచించిన మైలేజ్ మైలురాయిని చేధించాల్సి ఉంటుంది.

ఫోర్డ్ మస్టాంగ్ కన్వర్టిబుల్

  • జపాన్ తొందర పాటు తనమా ? భారత్ వెనకబాటు తనమా...?
  • మోడీ ఎఫెక్ట్; భారతదేశ రక్షణ ఒప్పందంపై ప్రపంచ దేశాల పోటీ

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Read In Telugu: 5.0-litre V8 Powered Ford Mustang Enter Eco-Driving Contest
Story first published: Saturday, October 8, 2016, 15:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X