ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ట్రక్కు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో

By Anil

భారీ బరువులను మోయగల ప్రపంచంలోనే అతి పెద్ద ట్రక్కుగా పేరుగాంచిన ట్రక్కును ఆంధ్రప్రదేశ్‌లో త్రివేణి ఎర్త్ మూవర్స్ సంస్థ కొనుగోలు చేసింది. పోలవరం పనుల కోసం దీనిని కొనుగోలు చేసారు. ఈ ట్రక్కును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌ,, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు.

సాధారణంగా ఇలాంటివి ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదుగా ఉన్నాయి. దేశీయంగా అతి పెద్ద ట్రక్కుగా ఇది నిలిచింది. దీనిని జాతీయ రహదారుల నిర్మాణం, మైనింగ్ మరియు భారీ ఉపకరణాలను తరలించడానికి వినియోగిస్తారు.

ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ట్రక్కు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు జాతీయం చేయబడింది. ఇందులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న త్రివేణి ఎర్త్ మూవర్స్ ఏజెన్సీ వారు ఈ ట్రక్కును వినియోగిస్తున్నట్లు తెలిపారు.

ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ట్రక్కు

బెలాజ్-7530 అనే పేరు గల ఈ ట్రక్కును కొలతల పరంగా చూస్తే భారీ పరిమాణంలో ఉంది. దీని పొడవు 13.39 మీటర్లు, వెడల్పు 7.82 మీటర్లు మరియు ఎత్తు 6.65 మీటర్లుగా ఉంది.

ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ట్రక్కు

బెలాజ్ సంస్థ ఈ ట్రక్కులో 60-లీటర్ సామర్థ్యం ఉన్న వి12 డీజల్ ఇంజన్‌ను అందించింది. ఇది సుమారుగా 2,300హార్స్‌పవర్ మరియు 9,054ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ట్రక్కు

ఈ బెలాజ్ ట్రక్కు ద్వారా గరిష్టంగా 220 నుండి 240 టన్నుల వరుకు బరువులను తరలించవచ్చని త్రివేణి ఎర్త్ మూవర్స్ సంస్థ తెలిపింది.

ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ట్రక్కు

ఈ ట్రక్కు గరిష్టం వేగం గంటకు 60 కిలోమీటర్లుగా ఉంది. దీని టర్నింగ్ రేడియస్ 15 మీటర్లుగా ఉంది.

ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ట్రక్కు

బెలాజ్ సంస్థ ఈ ట్రక్కుకు సంభందించిన విడి భాగాలను ఇక్కడకు తరలించి ఇదే ప్రదేశంలో అసెంబుల్ చేసింది. భారీ పరిమాణంలో ఉన్న ఈ ట్రక్కును విదేశాలను ఒకే సారి దిగుమతి చేసుకోవడం సాధ్యపడదు కాబట్టి. పోలవరం పరిసర ప్రాంతాల్లోని దీనిని అసెంబుల్ చేసినట్లు తెలిసింది.

ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ట్రక్కు

ఇండియాలో అతి పెద్ద ట్రక్కు ఇది ఒక్కటేనా ? ఇదే కాదు, రాజస్థాన్‌లోని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌ లోని మైనింగ్‌లో సుమారుగా 240 టన్నుల బరువులను మోయగల ట్రక్కులను వినియోగించారు. వీటిని లార్సెన్ అండ్ టుర్బో (L&T) సంస్థ ఉత్పత్తి చేసింది.

ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ట్రక్కు

అయితే ప్రపంచ వ్యాప్తంగా అత్యదిక బరువులను మోసే ట్రక్కులను మాత్రమే బెలాజ్ సంస్థే నిర్మిస్తోంది. బెలాజ్ లైనప్‌లోని 75710 అనే ట్రక్కు గరిష్ట బరువులను మోయగలదు.

ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ట్రక్కు

బెలాజ్ 75710 ట్రక్కు 450 టన్నుల బరువులను తరలించడానికి వినియోగించుకోవచ్చని తెలిపింది. అయితే ఈ ట్రక్కును పరిశీలించినప్పుడు మాత్రం సుమారుగా 503 టన్నుల బరువులను మోయగలిగింది.

ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ట్రక్కు
  • ప్రపంచంలో కెల్లా అతిపెద్ద వాహనాలు [మీరు ఆశ్చర్యపోతారు]
  • ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మైనింగ్ డంప్ ట్రక్కు 'బెలాజ్ 75710'
  • ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన ట్రక్కును కొనుగోలు చేసిన మలేషియా సుల్తాన్

Most Read Articles

English summary
Read In Telugu: Gigantic 240 ton Belaz truck in South India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X