2017 మధ్య భాగానికి విడుదల కానున్న హోండా క్రాసోవర్ ఎస్‌యువి

హోండా సరికొత్త క్రాసోవర్ ఎస్‌యువి డబ్ల్యూఆర్-వి ఇండియన్ మార్కెట్లోకి 2017 మధ్య భాగానికి విడుదల కానుంది.

By Anil

జపాన్‌కు చెందిన హోండా మోటార్స్ తమ క్రాసోవర్ ఎస్‌యువి డబ్ల్యూఆర్-వి ని 2016 Sao Paulo వాహన ప్రదర్శన వేదిక మీద తొలి సారిగా ప్రదర్శించింది. హోండా మోటార్స్ ఈ క్రాసోవర్ ఎస్‌యువిని 2017 ఏడాది మధ్య భాగానికి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.

హోండా క్రాసోవర్ ఎస్‌యువి డబ్ల్యూఆర్-వి గురించి పూర్తి వివరాలు....

హోండా క్రాసోవర్ ఎస్‌యువి డబ్ల్యూఆర్-వి

సమాచార వర్గాల కథనం మేరకు హోండా మోటార్స్ ఇప్పటికే ఈ డబ్ల్యూఆర్-వి కు దేశీయంగా ఉన్న తమ ప్రొడక్షన్ ప్లాంటులో పరీక్షలు నిర్వహిస్తోన్నట్లు తెలిసింది. మరియు దీనిని 2017 మధ్య భాగానికి మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

హోండా క్రాసోవర్ ఎస్‌యువి డబ్ల్యూఆర్-వి

డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యువిని తమ జాజ్ వాహనాన్ని రూపొందించిన ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేశారు. డిజైన్ పరంగా దాదాపు ఇది తన తోబుట్టువుగా ఉన్నటువంటి జాజ్ హ్యాచ్‌బ్యాక్‌ను పోలి ఉంది. అయితే అగ్రిసివ్‌గా కనబడటానికి మిని ఎస్‌యువి స్టైల్లో వచ్చిందని చెప్పవచ్చు.

హోండా క్రాసోవర్ ఎస్‌యువి డబ్ల్యూఆర్-వి

క్రాసోవర్ ఎస్‌యువి ముందు వైపున దప్పమైన క్రోమ్ కలదు, అచ్చం ఇలాంటి దానినే హోండా సిటి సెడాన్‌లో గమనించవచ్చు. ఫ్రంట్ బంపర్ పూర్తిగా ఎస్‌యువి తరహాలో ఉంది. వీల్ ఆర్చ్ మరియు బాడీ క్లాడింగ్స్ గల డోర్లను గమనించవచ్చు.

హోండా క్రాసోవర్ ఎస్‌యువి డబ్ల్యూఆర్-వి

హోండా డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యువిని బ్రెజిల్‌కు చెందిన హోండా ఇంజనీర్ల బృందం అభివృద్ది చేసింది. డబ్ల్యూఆర్-వి అనగా విన్‌సమ్ రన్‌అబౌట్ వెహికల్ అని అర్థం. గరిష్టంగా ఉన్న గ్రౌండ్ క్లియరెన్స్ ద్వారా ఎలాంటి తలాలనైనా ఎదుర్కుంటుంది.

హోండా క్రాసోవర్ ఎస్‌యువి డబ్ల్యూఆర్-వి

దేశీయంగా రానున్న డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ వాహనంలో జాజ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉన్న అదే ఇంజన్‌ను పరిచయం చేయనున్నారు. ఇందులోని 1.2-లీటర్ సామర్థ్యం గల ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 90బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

హోండా క్రాసోవర్ ఎస్‌యువి డబ్ల్యూఆర్-వి

డబ్ల్యూఆర్-వి లో రానున్న డీజల్ వేరియంట్ 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న ఐ-డిటిఇసి ఇంజన్‌ను కలిగి ఉండనుంది. ఇది గరిష్టంగా 100బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

హోండా క్రాసోవర్ ఎస్‌యువి డబ్ల్యూఆర్-వి

అంతర్జాతీయ మార్కెట్లోకి ఈ డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యువి 1.5-లీటర్ ఫ్లెక్స్ ఇంజన్‌తో రానుంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్ (ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్) అనుసంధానం రానుంది.

హోండా క్రాసోవర్ ఎస్‌యువి డబ్ల్యూఆర్-వి

హోండా మోటార్స్ ఈ డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యువిని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే దీని ప్రారంభ ధర సుమారుగా రూ. 7.5 నుండి 10.5 లక్షల ఆన్ రోడ్ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

హోండా క్రాసోవర్ ఎస్‌యువి డబ్ల్యూఆర్-వి

హోండా మోటార్స్ ఈ డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యువిని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మారుతి సుజుకి వితారా బ్రిజాలకు గట్టి పోటీనివ్వనుంది.

హోండా క్రాసోవర్ ఎస్‌యువి డబ్ల్యూఆర్-వి

  • మనోరంజనకరమైన మారుతి స్విఫ్ట్ న్యూ జనరేషన్
  • ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న హైబ్రిడ్ కార్లు
  • గంటకు 12,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపర్ లూప్: ముంబాయ్ మరియు పూనేల మధ్య

Most Read Articles

English summary
Honda WR-V Crossover SUV India Launch Slated For Mid-2017
Story first published: Friday, December 9, 2016, 20:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X