ఆటోమేటిక్ వేరియంట్లో విడుదలైన హ్యుందాయ్ క్రెటా ఎస్ ప్లస్ డీజల్ వేరియంట్

By Anil

హ్యుందాయ్ మోటార్స్ గత ఏడాది దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన క్రెటాలోని కొన్నింటిలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందివ్వలేదు. డీజల్ క్రెటాలో ఇది వరకే ఆటోమేటిక్‌ను పరిచయం చేశారు, అయితే దానికన్నా తక్కువ ధరతో క్రెటా ఎస్ ప్లస్ డీజల్ వేరియంట్లో ఆటేమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు. దీని ధర రూ. 13.56 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

ఆటోమేటిక్ వేరియంట్లో విడుదలైన క్రెటా ఎస్ ప్లస్ డీజల్ వేరియంట్

ఇంతకు మునుపు హ్యుందాయ్ మోటార్స్ టాప్ వేరియంట్లో ఉన్న ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్లో ఆటోమేటిక్‌‌ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు. దీనితో పాటు మధ్య రేంజ్‌లో ఉన్న డీజల్ క్రెటాలో కూడా వినియోగదారులు ఎంచుకునే విధంగా ఆటోమేటిక్‌‌ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు.

ఆటోమేటిక్ వేరియంట్లో విడుదలైన క్రెటా ఎస్ ప్లస్ డీజల్ వేరియంట్

ప్రస్తుతం ఆటోమేటిక్‌‌ ట్రాన్స్‌మిషన్‌‌తో అందుబాటులోకి వచ్చిన క్రెటా ఎస్ ప్లస్ డీజల్ వేరియంట్ దేశ వ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో అందుబాటులోకి వచ్చింది.

వివిధ నగరాలలో దీని ధర

వివిధ నగరాలలో దీని ధర

  • కలకత్తా ధర రూ. 13.99 లక్షలు
  • ముంబాయ్ ధర రూ. 14.27 లక్షలు
  • చెన్నై ధర రూ. 13.76 లక్షలు
  • బెంగళూరు ధర రూ. 13.76 లక్షలు
  • అన్ని ధరలు ఎక్స్ షోరూమ్‌గా ఇవ్వడం జరిగింది.
    ఆటోమేటిక్ వేరియంట్లో విడుదలైన క్రెటా ఎస్ ప్లస్ డీజల్ వేరియంట్

    క్రెటా డీజల్ వేరియంట్‌లో మిడ్ రేంజ్ క్రెటాలో కూడా ఆటేమేటిక్ వేరియంట్‌ను అందివ్వడం వలన క్రెటా మీదున్న వెయిటింగ్ పీరియడ్ రెండు నెలల సమయం అలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎస్ ప్లస్ డీజల్ వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది కాబట్టి.

    ఆటోమేటిక్ వేరియంట్లో విడుదలైన క్రెటా ఎస్ ప్లస్ డీజల్ వేరియంట్

    సాంకేతికంగా ఇందులో 1.6-లీటర్ సిఆర్‌డిఐ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్‌ను అందించారు.

    ఆటోమేటిక్ వేరియంట్లో విడుదలైన క్రెటా ఎస్ ప్లస్ డీజల్ వేరియంట్

    ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 126బిహెచ్‌పి పవర్ మరియు 256ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు.

    ఆటోమేటిక్ వేరియంట్లో విడుదలైన క్రెటా ఎస్ ప్లస్ డీజల్ వేరియంట్

    ఇందులో క్రూయిజ్ కంట్రోల్, లెథర్ సీట్లు, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు వాయిస్ కంట్రోల్డ్ న్యావిగేషన్ ప్యాకేజీలను అందివ్వలేకపోయారు.

    ఆటోమేటిక్ వేరియంట్లో విడుదలైన క్రెటా ఎస్ ప్లస్ డీజల్ వేరియంట్

    ఎస్ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్లో భద్రత పరంగా చూస్తే, డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటివి కలవు.

    ఆటోమేటిక్ వేరియంట్లో విడుదలైన క్రెటా ఎస్ ప్లస్ డీజల్ వేరియంట్

    హ్యుందాయ్ క్రెటా ఎస్ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్‌కు ప్రత్యక్ష పోటీగా రెనో డస్టర్ 110పిఎస్ ఆటోమేటిక్ వేరియంట్ కలదు. దీని ధర రూ. 13.13 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా కలదు.

    గమనిక: ఈ కథనంలో ప్రచురించిన ఫోటోలు క్రెటా మొదటి సంవత్సరం యానివర్సిరీ ఫోటోలుగా గుర్తించగలరు.

    ఆటోమేటిక్ వేరియంట్లో విడుదలైన క్రెటా ఎస్ ప్లస్ డీజల్ వేరియంట్

    • క్రెటాను ఎంచుకునే ముందు ఇవి చూసుకోండి

Most Read Articles

English summary
Hyundai Creta S+ Diesel Variant Now In AT; Priced At Rs. 13.56 Lakh
Story first published: Monday, July 25, 2016, 18:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X