మరింత ప్రియం అయిన హ్యుందాయ్ కార్లు: గరిష్టంగా 80,000 వరకు పెరిగిన ధరలు

By Anil

ప్రస్తుతం హ్యుందాయ్ మోటార్స్ దేశ వ్యాప్తంగా అమ్మకాలు చేపడుతున్న తమ అన్ని రకాల కార్లు మీద కూడా ధరలను పెంచాలనే ఆలోచనట్లు ఉన్నట్లు తెలిసింది. ఈ మధ్యనే టాటా మోటార్స్ వారు కూడా తమ విసృత స్థాయి వాహనాల మీద ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఇవే కాకుండా అంతర్జాతీయ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కూడా తమ అన్ని శ్రేణి వాహనాల మీద ధరలను పెంచింది.

Also Read: ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం
కొరియాకు చెందిన ఈ ఆటోమొబైల్ సంస్థ తమ అన్ని కార్ల మీద మీద కూడా 30,000 నుండి 80,000 రుపాయల వరకు ధరలను పెంచనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం హ్యుందాయ్ వారి ప్రారంభ ధర కారు ఇయాన్ నుండి గరిష్ట ధర గల శాంటా ఫి వరకు అన్నిటి మీద కూడా ధరలను పెంచనున్నట్లు తెలిపారు.
Also Read: డస్టర్ ఫేస్‌లిఫ్ట్ ఆటోమేటిక్‌ను విడుదల చేసిన రెనో: ధర మరియు ఇతర వివరాల కోసం
అయితే ఇలా ధరలను పెంచడానికి యునియన్ బడ్జెట్ కూడా ఒక కారణం అని తెలిసింది. తయారీదారుల పన్ను వంటివి ఆటోమొబైల్ ఉత్పత్తి దారుల మీద ఎక్కువ ప్రభావం చూపడం వలన వివిధ రకాల వేరియంట్ల ఆధారంగా ధరలను పెంచుతున్నట్లు తెలిపారు.
Also Read: ఎకో ఫ్రెండ్లీ కార్లను మాత్రమే కలిగి ఉన్న టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో
అంతర్జాతీయ మార్కెట్లో రుపాయి బలహీనపడటం మరియు కార్ల ఉత్పత్తి కావాల్సిన ముడి పదార్థాల ధరలను పెరగడం కూడా దీనికి మరొక కారణగా మనం భావించవచ్చు, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడళ్లతో పాటు అతి త్వరలో విడుదల కానున్న వాటి ధరలను కూడా పెంచి మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. గత నెలలో జరిగిన 2016 ఇండియన్ ఆటోఎక్స్ పో వేదిక మీద హ్యుందాయ్ టుసాన్ ఎస్‌యువిని ప్రదర్శించింది. అయితే దీన ఆ ఏడాదిలోపు మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

Most Read Articles

English summary
Hyundai India Plans To Hike Model Prices Upto Rs. 80,000
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X