హ్యుందాయ్ నుండి 402 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల ఎలక్ట్రిక్ కారు

Written By:

అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయడంలో బాగా పేరు గడించిన సంస్థ టెస్లా. ఈ సంస్థ ఈ మద్యనే మోడల్ 3 కారు ఉత్పత్తిని ప్రారంభించింది. టెస్లాకు చెందిన మోడల్ 3 కారు కోసం సుమారుగా లక్షల్లోనే బుకింగ్స్‌ జరిగాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ మొత్తం ఎలక్ట్రిక్ కార్లదే సందేహం ఖచ్చితంగా కలుగుతుంది.

అందుకోసమే ప్రస్తుతం డీజల్ మరియు పెట్రోల్ ఇంధనంతో నడిచే కార్లను తయారు చేసే సంస్థలు తమ భవిష్యత్‌ మనుగడ కోసం ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నాయి. అందులో కొరియాకు చెందిన సంస్థ హ్యందాయ్ మోటార్స్ ఏకంగా టెస్లా వారి మోడల్ 3 కారుకు పోటీగా ఎలక్ట్రిక్ కారును తయారుచేస్తున్నట్లు ప్రకటించింది.

మైలేజ్ పరంగా ఎక్కువ కిలోమీటర్లు నడిచే ఎలక్ట్రిక్ కారు ఏది అంటే టెస్లా మోడల్ 3 అని టక్కున చెప్పవచ్చు ఎందుకంటే ఇది సుమారుగా 350 కిలోమీటర్లు పాటు మైలేజ్‌నిస్తుంది. అయితే హ్యుందాయ్ మోటార్స్ 402 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేస్తున్నట్లు ప్రకటించింది.

2018 నాటికి సుమరుగా 322 కిలోమీటర్ల మైలేజ్‌నిచ్చే ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

అతి త్వరలో అమెరికాలో ఐయానిక్ ఎలక్ట్రిక్ కారును అందుబాటలోకి తీసుకురానున్నట్లు కూడా ప్రకటించింది. ఇది సుమారుగా 177 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇవ్వగలదు అని సమాచారం.

హ్యుందాయ్ మోటార్స్ అందుబాటులోకి తీసుకురానున్న ఐయానిక్ కారు మూడు రకాల మోడళ్లలో లభించనుంది. అవి ప్లగ్-ఇన్ హైబ్రిడ్, స్టాండర్డ్ హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్‌

ప్రపంచ దేశాలకు అత్యంత వేగంగా ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేయడంలో టెస్లా సంస్థ ఎంతో ముందుంది. టెస్లా అభివృద్ది చేస్తున్న మోడల్ 3 కారు ధర సుమారుగా 35,000 అమెరికన్ డాలర్లుగా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ మోడల్ 3 టెస్లా కారును సుమారుగా 1,30,000 మంది బుక్ చేసుకున్నారు.

బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు టెస్లా ఈ మోడల్ 3 ఉత్పత్తిని 2017 నుండి డెలివరీ ఇవ్వనుంది.

మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు కేవలం 6 సెకండ్ల వ్యవధిలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుటుంది. మరియు ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 346 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

టెస్లాకు తోడుగా హ్యుందాయ్ సంస్థ ఇపుడు ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది. 2020 నాటికి హ్యుందాయ్ వారి ఎలక్ట్రిక్ కార్లు రోడ్డెక్కనున్నాయి.

ప్రస్తుతం ఉన్న అన్ని కార్ల తయారీ సంస్థ హైబ్రిడ్ కార్ల తయారీ వైపు మొగ్గు చూపితే గ్రీన్ కారు విప్లవం ప్రపంచం మొత్తం మొదలవుతుంది. తద్వారా వాహన కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది.

  

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Hyundai Planning 402 Km Electric Car
Please Wait while comments are loading...

Latest Photos