రెనో క్విడ్ కారుకు పోటీగా ఎహెచ్ మోడల్ కారును తీసుకువస్తున్న హ్యుందాయ్ మోటార్స్

By Anil

ఇండియన్ ఎంట్రీ లెవల్ కార్ల మార్కెట్లో మారుతి సుజుకి సుస్థిర స్థానం సంపాదించుకుంది. అయితే దీనికి పోటిగా గత ఏడాదిలో రెనో సంస్థ క్విడ్ కారును ప్రవేశ పెట్టింది. అయితే భారీ స్థాయిలో ఎవరూ ఊహించని రీతిలో ప్రజాదరణ పొందింది.

ఇలాంటి రెనో క్విడ్ కారుకు పోటిగా కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి ఎహెచ్ అనే క్రాసోవర్ మోడల్‌ను ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 రెనో క్విడ్‌కు పోటీగా హ్యందాయ్ ఎహెచ్ మోడల్ ?

క్విడ్‌ కారుకు పోటిగా హ్యుందాయ్ మోటార్స్ అభివృద్ది చేస్తున్న ప్రాజెక్ట్‌‌కు ఎహెచ్ అనే కోడ్ పేరును ఎంపిక చేశారు.

 రెనో క్విడ్‌కు పోటీగా హ్యందాయ్ ఎహెచ్ మోడల్ ?

హ్యుందాయ్ మోటార్స్ ఈ ఎహెచ్ మోడల్ కారును ఇండియా మరియు మరికొన్ని ఇతర అంతర్జాతీయ మార్కెట్లలోకి 2018 ప్రారంభంనాటికల్లా అందుబాటులోకి తీసుకురానున్నారు.

 రెనో క్విడ్‌కు పోటీగా హ్యందాయ్ ఎహెచ్ మోడల్ ?

దీనిని విడుదల చేసిన మొదటి ఏడాది కాలంలో సుమారుగా లక్ష వరకువ అమ్మకాల సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు స్పష్టం చేశారు.

 రెనో క్విడ్‌కు పోటీగా హ్యందాయ్ ఎహెచ్ మోడల్ ?

హ్యుందాయ్ మోటార్స్ వారి ఎంట్రీ లెవల్ కారు అయిన ఇయాన్‌లో వినియోగించిన 08-లీటర్ కెపాసిటి ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను ఈ ఎహెచ్ క్రాసోవర్ మోడల్‌లో వినియోగించనున్నట్లు తెలిసింది.

 రెనో క్విడ్‌కు పోటీగా హ్యందాయ్ ఎహెచ్ మోడల్ ?

అంతే కాకుండా ఈ ఎహెచ్ మోడల్ కారులో 1.0-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను ఆప్షనల్‌గా హ్యుందాయ్ అందివ్వనున్నట్లు సమాచారం.

 రెనో క్విడ్‌కు పోటీగా హ్యందాయ్ ఎహెచ్ మోడల్ ?

మార్కెట్లో దీనికి మరింత విలువను జోడించడానికి ఈ చిన్న కారులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందివ్వనున్నారు.

 రెనో క్విడ్‌కు పోటీగా హ్యందాయ్ ఎహెచ్ మోడల్ ?

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో భారీ అమ్మకాల దిశగా దూసుకుపోతున్న క్విడ్ కారులో ధరకు తగ్గ ఫీచర్లను అందించారు.

 రెనో క్విడ్‌కు పోటీగా హ్యందాయ్ ఎహెచ్ మోడల్ ?

క్విడ్ ప్రభావాన్ని మార్కెట్లో తుడిచిపెట్టడానికి అన్నట్లుగా హ్యుందాయ్ మోటార్స్ ఇంజనీర్లు దీనిని క్విడ్ కన్నా ఆకర్షణీయమైన డిజైన్‌లో రూపొందించడానికి క్రాసోవరల్ డిజైన్ ఫిలాసఫినీ ఈ ఎహెచ్ మోడల్‌లో వినియోగించనున్నారు.

 రెనో క్విడ్‌కు పోటీగా హ్యందాయ్ ఎహెచ్ మోడల్ ?

హ్యుందాయ్ మోటార్స్ ఈ ఎహెచ్‌ మోడల్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే రెనో క్విడ్, డాట్సన్ రెడి గో మరియు మారుతి సుజుకి వారి ఆల్టో 800 వంటి కార్లకు ఆనారోగ్యకరమైన గట్టి పోటిని సృష్టించనుంది.

 రెనో క్విడ్‌కు పోటీగా హ్యందాయ్ ఎహెచ్ మోడల్ ?

ప్రస్తుతం ఇండియన్ ఎంట్రీ లెవల్ మార్కెట్లోకి విడుదల అవుతున్న కార్లను దృష్టిలో ఉంచుకుని డిజైన్ భాషలో ఉండే క్రాసోవర్ పదాన్ని వినియోగించుకుని ఆల్టో 800 కారును తిరిగి డిజైన్ చేసే ఆలోచనలో మారుతి సుజుకి ఉంది.

 రెనో క్విడ్‌కు పోటీగా హ్యందాయ్ ఎహెచ్ మోడల్ ?

ఎంట్రీ లెవల్ మార్కెట్లో భారీ స్థాయిలో పోటి పెరుగుతోంది, ఈ నేపథ్యంలో ఏ కారు ముందు నిలుస్తోంది తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడాలి మరి. అంత వరకు డ్రైవ్‌‌స్పార్క్‌ తెలుగుతో కలిసి ఉండండి.

 రెనో క్విడ్‌కు పోటీగా హ్యందాయ్ ఎహెచ్ మోడల్ ?

రెనో క్విడ్ కారు ఆవిష్కరణ వెనుకున్న ఆసక్తికరమైన విషయాలు !

మారుతి ఆల్టో 800 ను చంపేసిన రెనో క్విడ్....!!

Most Read Articles

English summary
Hyundai Motors To Launch AH Model To Rival Renault Kwid
Story first published: Tuesday, April 19, 2016, 13:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X