ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన టక్సన్: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు విడుదల వివరాలు

హ్యుందాయ్ మోటార్స్ తమ టక్సన్ ఎస్‌యువిని సరికొత్త ఇంజన్, బ్రాండ్ న్యూ ఇంటీరియర్ మరియు నూతన సేఫ్టీ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంజన్, డిజైన్, ఫీచర్లు మరియు ధర వంటి వివరాలు కోసం....

By Anil

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మోర్కెట్లోకి సరికొత్త టక్సన్ ఎస్‌యువిని విడుదల చేసింది. టక్సన్ ఎస్‌యువిల శ్రేణి యొక్క ప్రారంభ ధర రూ. 18.99 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు హ్యుందాయ్ ప్రకటించింది.

హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి ధర వివరాలు

హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి ధర వివరాలు

  • హ్యుందాయ్ టక్సన్ పెట్రోల్ టు వీల్ డ్రైవ్ మ్యాన్యువల్ ధర రూ. 18.99 లక్షలు
  • హ్యుందాయ్ టక్సన్ పెట్రోల్ టు వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ జిఎల్ ధర రూ. 21.79 లక్షలు
  • హ్యుందాయ్ టక్సన్ డీజల్ టు వీల్ డ్రైవ్ మ్యాన్యువల్ ధర రూ. 21.59 లక్షలు
  • హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి

    • హ్యుందాయ్ టక్సన్ డీజల్ టు వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ జిఎల్ ధర రూ. 23.48 లక్షలు
    • హ్యుందాయ్ టక్సన్ డీజల్ టు వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ జిఎల్ఎస్ ధర రూ. 24.99 లక్షలు
    • గమనిక: అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
      హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి

      హ్యుందాయ్ మోటార్స్ ఈ సరికొత్త టక్సన్ ఎస్‌యువి 2.0-లీటర్ సామర్థ్యంతో పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంధన ఆప్షన్‌లలో విడుదల చేసింది.

      హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి

      హ్యుందాయ్ టక్సన్ లోని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 6,200 ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 153బిహెచ్‌పి పవర్ మరియు 4,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 192ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

      హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి

      ఈ పెట్రోల్ ఇంజన్ టక్సన్ లోని 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ లీటర్‌కు 13.03 కిలోమీటర్లు మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్న వేరియంట్ లీటర్‌కు 12.95 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

      హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి

      ఇక టక్సన్ లోని 2.0-లీటర్ డీజల్ ఇంజన్ 4,000ఆర్‌పిమ్ ఇంజన్ వేగం వద్ద 182బిహెచ్‌పి పవర్ మరియు 1,750-2,750 ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద గరిష్టంగా 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

      హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి

      డీజల్ టక్సన్ ఎస్‌యువిలో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం చేసిన వేరియంట్ లీటర్‌కు 18.42 కిలోమీటర్లు మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం చేసిన వేరియంట్ లీటర్‌కు 15.38కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవు.

      హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి

      కొలతల పరంగా హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి 1,850ఎమ్ఎమ్ వెడల్పు, 4,475ఎమ్ఎమ్ పొడవు మరియు 1,660ఎమ్ఎమ్ ఎత్తు (రూఫ్ రెయిల్స్‌తో కలుపుకొని)గా ఉంది.

      హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి

      డిజైన్ పరంగా ముందువైపున హెక్సా గోనల్ ప్రంట్ గ్రిల్ కలదు, దీనికి మధ్యలో క్రోమ్ స్లాట్ ఉంది. గ్రిల్‌కు ఇరువైపులా కోణీయాకారంలో ఉన్న పగటి పూట వెలిగే లైట్ల అనుసంధానంతో ఉన్న యాంగులర్ హెడ్ లైట్లు కలవు. మలచిన ఆకారంలో ఉన్న బంపర్‌లో రెండు ఫాగ్ ల్యాంప్స్‌ను అమర్చారు.

      హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి

      ముందు వైపున ఉన్న బంపర్ నుండి వెనుక వైపున టెయిల్ ల్యాంప్స్ వరకు డోర్ల మీదుగా వెళ్లిన గీతలు చాలా అందంగా ఉన్నాయి.

      హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి

      2016 సరికొత్త హ్యుందాయ్ టక్సన్ ఇంటీరియర్‌లో 8.0-అంగుళాల పరిమాణం ఉన్న తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇందులో ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటిని సపోర్ట్ చేస్తుంది.

      హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి

      హ్యుందాయ్ టక్సన్ శ్రేణిలో ఉన్న అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ ఫీచర్‌గా 4-స్పీకర్లు మరియు2-ట్వీటర్లతో కూడి ఆడియో సిస్టమ్ కలదు. శాటిలైట్ ఆధారిత న్యావిగేషన్ వ్యవస్థ మరియు మాటలను గుర్తుపట్టే సాంకేతిక పరిజ్ఞానం ఇందులో ఉన్నాయి.

      హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి

      టక్సన్ ఇంటీరియర్ లోని అన్ని సీట్లను లెథర్ తో తీర్చిదిద్దారు. మరియు డ్రైవర్ సీటును ఎలక్ట్రిక్ పవర్ ద్వారా పది మార్గాల్లో అడ్జెస్ట్ చేసుకునే వీలును కల్పించింది హ్యుందాయ్.

      భద్రత పరంగా 2016 హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువిలో అత్యాధునిక భద్రత ఫీచర్లు ఉన్నాయి. అందులో,

      భద్రత పరంగా 2016 హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువిలో అత్యాధునిక భద్రత ఫీచర్లు ఉన్నాయి. అందులో,

      • ఆరు ఎయిర్ బ్యాగులు
      • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్,
      • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్,
      • రియర్ పార్కింగ్ కెమెరా,
      • వెహికల్ స్టెబిలిటి మేనేజ్‌మెంట్,
      • హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి

        హిల్ స్టార్ట్ అసిస్సిట్ కంట్రోల్,

        ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్,

        డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్ మరియు

        బ్రేక్ అసిస్ట్.

        హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి

        సరికొత్త హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి నాలుగు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంది. అవి,

        • తెలుపు,
        • నలుపు,
        • ఎరుపు, మరియు
        • సిల్వర్.
        • హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి

          హ్యందాయ్ మోటార్స్ ఈ అధునాతన టక్సన్ ఎస్‌యువిని తమ లైనప్‌లో ఉన్న క్రెటా కు పై స్థానంలో మరియు శాంటా ఫె మోడల్‌కు క్రింది స్థానంలో ప్రవేశపెట్టింది.

          హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి

          పోటీ పరంగా చూస్తే టక్సన్ పెట్రోల్ వేరియంట్లు హోండా సిఆర్-వి ఉత్పత్తులకు పోటీగా ఉంది. టక్సన్ డీజల్ వేరియంట్‌కు సరాసరి పోటీ లేనప్పటికీ షెవర్లే ట్రయల్‌బ్లేజర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ ధరలను తగ్గిన తరువాత టక్సన్‌ను పోటీని ఎదుర్కుంటున్నాయి.

          హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి

          • రోజులు దగ్గరపడుతున్నాయ్...!!
          • సరిగ్గా 5 లక్షల బడ్జెట్లో కారు కావాలా...?
          • జపాన్ లో మోడీ గారి మాయలు...

Most Read Articles

English summary
Read In Telugu: Hyundai Tucson Launched in India; Prices Start At Rs. 18.99 Lakh
Story first published: Monday, November 14, 2016, 15:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X