ప్రీమియమ్ ఎస్‍‌యువిల ప్రపంచంలోకి హ్యుందాయ్ నుండి టుసాన్

By Anil

ఢిల్లీలో గత వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద హ్యుందాయ్ మోటార్స్ వారు మొటి సారిగా తమ టుసాన్ ప్రీమియమ్ ఎస్‌యువిని ప్రదర్శించారు. దీనికి చెందిన మరిన్ని ఫోటోలకు క్రింద గల ఇమేజ్ మీద క్లిక్ చేయండి.

హ్యుందాయ్ టుసాన్


హ్యుందాయ్ టుసాన్ ఎస్‌యువి సాంకేతిక వివరాలు:
  • ఇంజన్ కెపాసిటి: 2-లీటర్
  • ఇంధన రకము: డీజల్
  • పవర్: 135 బిహెచ్‌పి
  • టార్క్: 373 ఎన్ఎమ్

హ్యుందాయ్ టుసాన్‌లోని ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది.
Also Read: హ్యుందాయ్ నుండి హెచ్‌ఎన్‌డి-14 ఎస్‌యువి
డిజైన్:
హ్యుందాయ్ మోటార్స్ వారు తమ టుసాన్ వాహనాన్ని ఫీచర్ల పరంగా హ్యుందాయ్ ఫ్లూయిడిక్ ఫిలాసఫీ డిజైన్‌ ఆధారంతో రూపొందించారు. ముందు వైపున గల గ్రిల్ హెక్సాగోనల్ ఆకారంలో తయారు చేశారు వీటికి మధ్యలో క్రోమ్ ప్లేట్లను తగిలించారు. మరియు రెండు భాగాలుగా వేరు చేయబడి డిజైన్ చేయబడిన హెడ్ లైట్లు ఎంతో ఆకర్షణగా నిలిచాయి.
Also Read: కన్నుల నిండా కనువిందు చేసిన కత్రినా కైఫ్
ఫీచర్లు:

తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ
వెనుకవైపును గమనించే కెమెరా
పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్ మరియు స్టాప్
హిల్ అసిస్ట్ కంట్రోల్
డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్
ఆరు ఎయిర్ బ్యాగులు
Also Read: బెస్ట్ సెడాన్ కారు: ఫియట్ లీనియా 125 ఎస్
ధర, పోటి మరియు అందుబాటులోకి:
హ్యుందాయ్ మోటార్స్ వారు ఈ టుసాన్ ప్రీమియమ్ కాంపాక్ట్ ఎస్‌యువి ధరను 18 నుండి 23 లక్షల మధ్య నిర్ణయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మార్కెట్లోకి విడుదల అయితే హోండా సి‌ఆర్-వి, షెవర్లే ట్రయల్ బ్లేజర్ మరియు వోక్స్‍‌‌‌వ్యాగన్ వారి టైగున్ వంటి ఎస్‌యువి లకు పోటిగా నిలవనుంది. హ్యుందాయ్ మోటార్స్ దీనిని ఈ ఏడాది చివరిలో మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

Most Read Articles

English summary
Hyundai Thunders Into Premium SUV Wars With All New Tuscon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X