ఇండియన్ మెకానిక్ అద్బుత సృష్టి :ప్రపంచంలో కెల్లా అతి చిన్న జీపు

ట్రాఫిక్ జామ్‌లలో జామ్ జామ్ అంటూ దూసుకెళ్లేందుకు వీలుగా ఉండే అతి చిన్న జీపును 60 ఏళ్ల వయస్సున్న బవార్ సింగ్ రూపొందించాడు. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే అతి చిన్న జీపు.

By Anil

భారీ కాయంతో ఉన్న వాహనాలతో రోడ్డెక్కినపుడు ట్రాఫిక్‌ జామ్ లలో చిన్న చిన్న వాహనాలు కళ్ల ముందే సర్రున దూసుకుపోతుంటే చాలా అసూయగా ఉంటుంది కదూ..? అయితే ట్రాఫిక్ జామ్ జామ్ లలో ఏ మాత్రం ఇరుక్కుపోకుండా సర్రున దూసుకుపోయేవిధంగా 60 ఏళ్ల వయస్సున్న బవార్ సింగ్ అతి చిన్న జీపును సృష్టించాడు.

ప్రపంచంలో కెల్లా అతి చిన్న జీపు

పంజాబ్‌కు చెందిన బవార్ సింగ్ అనే మెకానిక్ సుమారుగా రెండేళ్ల పాటు శ్రమించి మరగుజ్జు జీపును తయారు చేశాడు. ఇది ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అతి చిన్న జీపుగా నిలిచింది.

ప్రపంచంలో కెల్లా అతి చిన్న జీపు

సింగ్‌కు వచ్చిన మరగుజ్జు జీపు ఆలోచన ఇప్పటిదికాదంట, 1975 లో అంగవైకల్యం గల వ్యక్తి కోసం తన టూవీలర్ కు మరో చక్రాన్ని జోడించినప్పుడే ఈ ఆలోచన తలుపుతట్టింది తెలిపాడు. అప్పట్లో అదే వ్యక్తి కోసం ఒక మరగుజ్జు వాహనాన్ని నిర్మించాడు.

ప్రపంచంలో కెల్లా అతి చిన్న జీపు

అప్పట్లో తానే ఏకైక మెకానిక్‌గా ఉండటం వలన కొత్త వాహనాల తయారీ సమయం ఉండేది కాదు, ఇప్పుడు వయస్సు మళ్లడం కారణంగా మెకానిక్ పనులకు దూరంగా ఉన్న బవార్ సింగ్ ఈ చిన్న జీపును నిర్మించాడు. పాత విల్లిస్ జీపును పోలి ఉండే దీని ఎత్తు ఎంతో తెలుసా కేవలం మూడు అడుగులు మాత్రమే.

ప్రపంచంలో కెల్లా అతి చిన్న జీపు

ఈ చిన్న జీపు కోసం ఉపయోగించిన ఇంజన్ మరియు చక్రాలను బైకు నుండి సేకరించినట్లు బవార్ సింగ్ తెలిపాడు. ఓపెన్ టాప్ తరహాలో ఉండే ఈ జీపు గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ప్రపంచంలో కెల్లా అతి చిన్న జీపు

ఇంత చిన్నాగా ఉండే ఏ మూలకు సరిపోతుందనుకుంటున్నారా..? ఇందులో నలుగురు సులభంగా ప్రయాణించవచ్చు. బవార్ కుటుంబ సభ్యులు తరచూ ఇందులోనే బయటకు వెళుతుంటారు

ప్రపంచంలో కెల్లా అతి చిన్న జీపు

ఎలాంటి వ్యక్తులైనా సులభంగా నడపడానికి వీలుండే ఈ చిన్న జీపును నిర్మించడానికి కేవలం రూ. 56,000 లు మాత్రమే ఖర్చ చేసినట్లు బవార్ సింగ్ తెలిపాడు. ఇప్పట్లో స్కూటర్ లేదా బైకు ఈ ధరతో అందుబాటులో ఉన్నాయి.

ప్రపంచంలో కెల్లా అతి చిన్న జీపు

రోజు వారి మెకానిక్ పనులకు దూరంగా ఉంటున్న సింగ్ ఖాళీగా ఉండకుండా ఇలాంటి చిన్న జీపులను నిర్మిస్తున్నాడు. ఇంకా ఇలాంటివి సింగ్ వద్ద ఆరు వరకూ ఉన్నాయి.

ప్రపంచంలో కెల్లా అతి చిన్న జీపు

పంజాబ్ మరియు వాటి పరిసర ప్రాంతాల్లో ఈ మరగుజ్జు జీపు ద్వారా చక్కర్లు కొట్టి, తద్వారా దీన మీద మనసుపారేసుకునే వారికి వాటిని ఒక్కొక్కటిగా విక్రయించడం మొదలుపెడుతున్నాడు మన సింగ్.

బవార్ సింగ్ నిర్మించిన ప్రపంచపు అతి చిన్న జీపు ఎలా పరుగులు పెడుతున్నాదో మీరే చూడండి.

Most Read Articles

English summary
60-Year-Old Indian Mechanic's Miniature Jeeps Are No Toys — Jugaad At its Best?
Story first published: Monday, December 5, 2016, 18:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X