జీప్ వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ విడుదల: ప్రారంభ ధర రూ. 71.59 లక్షలు

Written By:

అమెరికన్ ఎస్‌యువి వాహనల తయారీ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి గ్రాండ్ చిరోకీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దానితో పాటు నాలుగు డోర్లు గల వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ ఎస్‌యువిని కూడా విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 71,59,104 లు ఎక్స్ షోరూమ్‌గా ప్రకటించింది.

జోధ్‌పూర్‌లోని చారిత్రాత్మక ప్రదేశం ఉమైద్ భవన్ ప్యాలెస్ వద్ద తమ గ్రాండ్ చిరోకీతో పాటుగానే ఈ వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్‌ ఎస్‌యువిని విడుదల చేసింది జీప్ సంస్థ. 75 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఇండియన్ మార్కెట్లోకి తమ ఉత్పత్తులను విడుదల చేయడం ఇదే మొదటి సారి అని జీప్ సంస్థ తెలిపింది.

జీప్ సంస్థ ఈ వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ ఎస్‌యువిలో 2.8-లీటర్ సామర్థ్యం గల కామన్ రైల్ డీజల్ ఇంజన్‌ను అందించింది. ఈ శక్తివంతమైన డీజల్ ఇంజన్ 3,600ఆర్‌పిఎమ్ వద్ద 197బిహెచ్‌పి పవర్ మరియు 1,600-2,000ఆర్‌పిఎమ్ మధ్య 460ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్‌లోని ఇంజన్‌కు 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్ మరియు టార్క్‌ను నాలుగు చక్రాలకు సరఫరా చేస్తుంది.

కొలతల పరంగా ఈ వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ 4,583ఎమ్ఎమ్ పొడవు, 1,877ఎమ్ఎమ్ వెడల్పు మరియు 1,860ఎమ్ఎమ్ ఎత్తు కలదు. ఇందులో వీల్ బేస్ 2,947ఎమ్ఎమ్ మరియు 238.2ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ కలదు. మరియు ఇది నీటిలో 508ఎమ్ఎమ్ ముంపు వరకు నడుస్తుంది.

డిజైన్ పరంగా ఇది చూడటానికి రెండవ ప్రపంచ యుద్దంలో వినియోగించిన విల్లీస్ జీప్‌ను పోలి ఉంటుంది. అప్పటి విల్లీస్ జీపును కొనుగోలు చేయాలనుకునే వారికి వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ ఎంచుకోవచ్చు. పెద్దగా గుండ్రంగా ఉన్న హెడ్ లైట్లు మరియు భారీ పరిమాణంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్ రెండవ ప్రపంచ యుద్దం కాలానికి చెందిన జీపును వెనక్కి తెచ్చినట్లు ఉంటుంది.

ఈ జీపులో ముందు వైపున అద్దాన్ని (విండ్‌ షీల్డ్‌) క్రిందకు వంపేసే అవకాశం ఉంటుంది మరియు వెనక వైపున టాప్‌ను ఒపెన్ మరియు క్లోజ్ చేసే అవకాశం కలదు.

వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ కు ఉన్న నాలుగు డోర్లను కూడా తొలగించే అవకాశం కలదు మరియు ఇరువైపులా ఉన్న అల్లాయ్ చక్రాలు పెద్ద పరిమాణంలో ఉన్నాయి.

వెనుక వైపు డిజైన్‌లో ఇరువైపులా చతుర్భుజాకారంలో ఉండే టెయిల్ లైట్లు కలవు మరియు అదనపు చక్రాన్ని వెనుక వైపున ఉన్న డోర్ మీద అందించారు.

వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్‌ ఇంటీరియర్‌లో ఆధునిక టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇందులోనే వాయిస్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఆల్పైన్ సంస్థకు చెందిన ప్రీమియమ్ సౌండ్ సిస్టామ్‌ని అందిచారు కాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్ కు ఏ మాత్రం కొదవలేదని చెప్పవచ్చు.

టాప్ మొత్తం తొలగించి అడ్వెంచర్స్‌కు వెళ్లినపుడు ఇందులోని ఇంటీరియర్‌ మరియు ఎక్ట్సీరియర్‌ను నీటితో కడిగేయవచ్చు. మరియు తేమను నిర్మూలించడానికి గాలిని వెదజల్లే డ్రెయిన్ ప్లగ్స్‌ను అందించారు.

  

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #జీప్ #jeep
English summary
Jeep Wrangler Unlimited Launched In India, Priced At Rs. 71.59 Lakh
Please Wait while comments are loading...

Latest Photos