అందమైన భామల నడుమ కియా రియో ప్రదర్శన

By Anil

కియా మోటార్స్ తమ సరికొత్త సూపర్ మిని హ్యాచ్‌బ్యాక్‌ను 2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద సందర్శకులకు ప్రదర్శించింది. మునుపటి రియో కన్నా ఈ కియా రియా హ్యాచ్‌బ్యాక్ రీఫ్రెష్డ్ డిజైన్‌లో ప్రదర్శించబడింది.

2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద కియా రియో ప్రదర్శన

కియా మోటార్స్ యొక్క మునుపటి రియోతో పోల్చితే ఈ సరికొత్త రియోలో పునాది నుండి మొత్తం అన్నీ మార్పులకు గురయ్యాయి అని చెప్పవచ్చు. చూడటానికి మృదువుగా మరియు పదునైన డిజైన్ లక్షణాలతో పాటు ఆంగ్లపు యు ఆకారంలో ఉన్న ఎల్‌ఇడి లైటింగ్, బాణపు గుర్తు ఆకారంలో ఉన్న రియర్ ఎల్‌ఇడి టెయిల్ లైట్లు ఇందులో ఉన్నాయి.

2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద కియా రియో ప్రదర్శన

సరికొత్త రియోలోని సాంకేతిక అంశాలను పరిశీలిస్తే ఇందులో పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద కియా రియో ప్రదర్శన

సరికొత్త కియా రియోలోని 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ 99బిహెచ్‌పి మరియు 118బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే రెండు రకాల వేరియంట్లలో కలదు.

2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద కియా రియో ప్రదర్శన

కియా మోటార్స్ ఈ సరికొత్త రియోలో సహజసిద్దమైన రెండు పెట్రోల్ ఇంజన్‌లను కూడా పరిచయం చేసింది. అవి 1.25-లీటర్ మరియు 1.4-లీటర్ సామర్థ్యంతో ఉన్నాయి.

2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద కియా రియో ప్రదర్శన

ఇందులోని 1.25-లీటర్ ఇంజన్ సుమారుగా 83బిహెచ్‌పి పవర్ మరియు 1.4-లీటర్ ఇంజన్ సుమారుగా 99బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. అంతర్జాతీయ ప్రదర్శనకు తీసుకువచ్చిన దీనిని ఉద్గార వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది.

2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద కియా రియో ప్రదర్శన

ఇక రియో లో డీజల్ ఇంజన్‌ను వేరియంట్‌ను ఎంచుకోవాలనుకునే వారికి ఇందులో 1.4లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌ను పరిచయం చేస్తోంది.

2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద కియా రియో ప్రదర్శన

సరికొత్త రియో హ్యాచ్‌లోని డీజల్ ఇంజన్ సుమారుగా 69బిహెచ్‌పి పవర్ లేదా 89బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. ప్యారిస్ వాహన ప్రదర్శన వేడుకలో కియా మాట్లాడుతూ తమ లైనప్ అతి తక్కువ ఉద్గారాలను విడుదల చేసే డీజల్ ఇంజన్ ఇదే అని తెలిపింది.

2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద కియా రియో ప్రదర్శన

మునుపటి రియో హ్యాచ్‌బ్యాక్‌లో పోల్చితే ఇందులో డ్రైవబులిటీని పెంచుతూ, ధృడమైన బాడీని అందించారు. స్మూత్ రైడింగ్ కోసం అభివృద్ది పరిచిన సస్పెన్షన్‌ను కూడా ఇందులో అందించారు.

2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద కియా రియో ప్రదర్శన

రియో ఇంటీరియర్‌లో అత్యంత నాణ్యమైన ఫీచర్లను అందించారు. ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే గల ఐదు అంగుళాల ఫ్లోటింగ్ తాకే తెర ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ అందిచారు.

2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద కియా రియో ప్రదర్శన

ఇంటీరియర్‌లోని అప్‌హోల్‌స్ట్రేని నలుపు లేదా గ్రే రంగుల్లో ఉన్న సహజసిద్దమైన లెథర్‌తో రూపొందించారు. మరియు సీట్లను ఎరుపు లేదా నలుపు రంగు లెథర్‌తో డిజైన్ చేసారు.

2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద కియా రియో ప్రదర్శన

ప్రస్తుతం కియా మోటార్స్ లైనప్‌లో ఉన్న రియో హ్యాచ్‌బ్యాక్‌లలో ప్రస్తుతం ప్రదర్శించబడిన మోడల్ అత్యంత నమ్మదగినదిగా చెప్పవచ్చు.

2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద కియా రియో ప్రదర్శన

2017 ఏడాది మొదటి త్రైమాసికంలో యుకె మార్కెట్లో దీనిని విడుదల చేయనున్నారు. అంతే కాకుండా దేశీయంగా కియా తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్దంగా ఉంది. కాబట్టి దీనిని దేశీయ మార్కెట్‌కు కూడా పరిచయం చేయనుంది.

2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద కియా రియో ప్రదర్శన

  • ప్రపంచ అద్బుతాలలో ఒకటి సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తికరమైన విషయాలు
  • ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు
  • పాక్‌తో యుద్దానికి సిద్దమైతే ఇండియన్ మిలిటరీ వద్ద ఉన్న బలం ఇదే

Most Read Articles

English summary
Read In Telugu: 2016 Paris Motor Show: Kia Rio Debuts Ahead Of 2017 Launch
Story first published: Friday, September 30, 2016, 18:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X