భారత దేశపు తొలి బయో డీజల్ బస్సులను ప్రారంభించిన KSRTC

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భారత దేశపు మొట్ట మొదటి బయో డీజల్ బస్సులను ప్రారంభించింది.

By Anil

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తమ బస్సు సర్వీసుల్లోకి బయో డీజల్ బస్సులను ప్రారంభించింది. భారత దేశంలో తొలిసారిగా బయో డీజల్ బస్సులను ప్రారంభించిన తొలి రాష్ట్రం కర్ణాటకగా నిలిచింది.

భారత దేశపు తొలి బయో డీజల్ బస్సులు

25 లగ్జరీ స్కానియా మల్టీ యాక్సిల్ బయో డీజల్ బస్సులను కెఎస్ఆర్‌టిసి డిపో నుండి కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

భారత దేశపు తొలి బయో డీజల్ బస్సులు

ఈ సంధర్భంగా రామలింగా రెడ్డి గారు మాట్లాడుతూ, ఈ బయో డీజల్ బస్సులు వినియోగించుకునే బయో డీజల్ సాధారణ డీజల్ కన్నా తక్కువ ధరకే లభిస్తుంది. మరియు ఇది ఎకో ఫ్రెండ్లీ ఇంధన. తద్వారా సాధారణ డీజల్ ద్వారా ఉద్గారమయ్యే కర్బనాలకన్నా ఈ ఇంధన తక్కువ కర్భనాలను ఉత్పత్తి చేస్తుందని ఆయన తెలిపారు.

భారత దేశపు తొలి బయో డీజల్ బస్సులు

కెఎస్ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ రాజేందర్ కుమార్ కటారియా మాట్లాడుతూ, బయో డీజల్ బస్సుల యొక్క ఎమిషన్ లెవల్స్ సాధారణ డీజల్ బస్సుల యొక్క ఉద్గారాలతో పోల్చుకుంటే 60 నుండి 70 శాతం వరకు తక్కువగా ఉంటాయి.

భారత దేశపు తొలి బయో డీజల్ బస్సులు

అయితే మైలేజ్ మరియు ఇంజన్ యొక్క పనితీరులో ఎలాంటి మార్పు ఉండదు.

భారత దేశపు తొలి బయో డీజల్ బస్సులు

రాజేందర్ గారు మాట్లాడుతూ, 25 బయో డీజల్ బస్సుల కోసం స్కానియా బస్సుల తయారీ సంస్థకు ఆర్డర్ ఇచ్చామని తెలిపాడు. అయితే అందులో ఒకటి రెట్రోఫిట్టెడ్ బయో డీజల్ బస్సును కోరినట్లు తెలిపాడు.

భారత దేశపు తొలి బయో డీజల్ బస్సులు

ఈ రెట్రోఫిట్టెడ్ బయో డీజల్ బస్సులో డీజల్, డీజల్ మరియు బయో డీజల్ మిక్స్ అదే విధంగా బయో డీజల్ ఈ విధంగా ఇంధనాలను వినియోగించుకనే అవకాశం ఉంటుంది. ఈ బస్సును ప్రయోగాత్మకంగా నడపాలని కూడా ఆయన ఈ సందర్భంగా భావించాడు.

భారత దేశపు తొలి బయో డీజల్ బస్సులు

స్కానియా ఈ బయో డీజల్ బస్సులను తెలంగాణ లో నిర్మిస్తోంది. తెలంగాణ నుండి కెఎస్ఆర్‌టిసి ఆర్డర్ ఇచ్చిన స్కానియా బయో డీజల్ బస్సులను సేకరించనున్నట్లు కటారియా వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బయో డీజల్ బస్సులను నిర్మించే సంస్థలు ఓ మోస్తారుగా ఉన్నాయి.

భారత దేశపు తొలి బయో డీజల్ బస్సులు

కెఎస్ఆర్‌టిసి ఈ 25 స్కానియా బయో డీజల్ బస్సులను బెంగళూరు-కుందాపూర్, బెంగళూరు-బీదర్, బెంగళూరు-తిరుపతి మరియు బెంగళూరు-చెన్నై మార్గాలలో నడపనుంది. టికెట్ పరంగా ఎలాంటి మార్పులు ఉండవని కెఎస్ఆర్‌టిసి తెలిపింది.

భారత దేశపు తొలి బయో డీజల్ బస్సులు

భవిష్యత్తులో కెఎస్ఆర్‌టిసి సేకరించే టాప్ ఎండ్ బస్సుల్లో కూడా బయో కిట్ ఉండే విధంగా కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతో ఉంది. మరియు ప్రస్తుతం ఉన్న సాధారణ డీజల్ బస్సుల్లో 80 శాతం డీజల్ మరియు 20 శాతం బయో డీజల్ కలిపి ఇంధనంగా వాడుతున్నారు. తద్వారా తక్కువ ఉద్గారాలను వెలువరిస్తాయని రాజేందర్ కుమార్ కటారియా వివరించాడు

భారత దేశపు తొలి బయో డీజల్ బస్సులు

2017 పికంటో హ్యాచ్ ను ఆవిష్కరించిన కియా మోటార్స్

కియా మోటార్స్ తమ మూడవ తరానికి చెందిన పికంటో హ్యాచ్‌ను ఆవిష్కరించింది. ఎరుపు రంగులతో మరియు అందమైన వీల్ ఆర్చెస్‌తో సరికొత్త రూపాన్ని సంతరించుకుంది.

భారత దేశపు తొలి బయో డీజల్ బస్సులు

ఖచ్చితంగా పాటించాల్సిన ట్రాఫిక్ నియమాలు, వాటి జరిమానా వివరాలు:

నేటి కథనంలో మనం వాహనం నడుపుతున్నపుడు పాటించాల్సిన ట్రాఫిక్ నియమాలు మరియు వాటిని పాటించకపోతే ఎలాంటి జరిమానా చెల్లించాలి అనే వివరాలను ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి

భారత దేశపు తొలి బయో డీజల్ బస్సులు

ఆరు ఎయిర్ బ్యాగులు గల అత్యంత చౌకైన కారు...

ఇండియన్ మార్కెట్లో తక్కువ ధరలో ఆరు ఎయిర్ బ్యాగులను కలిగి ఉండే కారు ఏదో తెలుసా..? దాని గురించి పూర్తి వివరాలు...

Most Read Articles

English summary
Karnataka State Road Transport Corporation Inducts India’s First Bio-Diesel Buses
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X