ఇఎస్ 300హెచ్ హైబ్రిడ్‌తో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న లెక్సస్

Written By:

టయోటాకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ బ్రాండ్ లెక్సస్ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఎకో ఫ్రెండ్లీ కారుతో ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది.

జపాన్‌కు చెందిన ఈ సంస్థ చాలా వరకు హైబ్రిడ్ ఎస్‌యువి లు మరియు సెడాన్‌లను భారతీయులకు పరిచయం చేయనుంది. 2016 ఇఎస్ 300హెచ్ హైబ్రిడ్ సెడాన్ కారును విడుదల చేసిన తరువాత మిగిలిన ఉత్పత్తులను తీసుకురానుంది. లెక్సస్ వారి 2016 ఇఎస్ సిరీస్ ఉత్పత్తులను 2016 షాంఘై మోటార్ షోలో ప్రదర్శించారు. దేశీయంగా అందుబాటులోకి రానున్న లెక్సస్ వారి మొదటి ఉత్పత్తి గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో.....

లెక్సస్ ఇఎస్ 300హెచ్ హైబ్రిడ్ కారులో 2.5 లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ కలదు. మరియు ఈ ఇంజన్‌కు ఎలక్ట్రిక్ మోటార్‌ను అనుసంధానం చేశారు.

ఇందులో 650 వి నికెల్-మెటల్ హైబ్రిడ్ (Ni-MH) బ్యాటరీని అందించారు.

ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ రెండు కూడా సంయుక్తంగా 200 బిహెచ్‌పి పవర్ మరియు 470 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని విడుదల చేసే మొత్తం పవర్ సివిటి గేర్‌బాక్స్ ద్వారా ముందు చక్రాలకు అందుతుంది.

ఇఎస్ 300హెచ్ బరువు సుమారుగా 1670 కిలోలుగా ఉంది. మరియు ఇందులో 65-లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు కలదు.

లెక్సస్ ఇఎస్ 300హెచ్ లీటర్‌కు 17 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది.

ఇఎస్ 300హెచ్ ముందు వైపున లెక్సస్ కుటుంబంలో ఉన్న కార్లన్నింటిలానే ఒకే తరహా డిజైన్ అందించారు. కాని ఇండియన్స్‌కు ఇది కొత్తగా ఉంటుంది. ముందు వైపున ఉన్న ఫ్రంట్ గ్రిల్ రెండు హెడ్ లైట్లను వేరు చేస్తూ ఉంటుంది. బంపర్‌కు క్రింది వైపున అడుగు భాగంలో ఫాగ్ ల్యాంప్స్‌ను అందించారు.

వెనుక వైపున ఉన్న డిజైన్‌లో ఆకట్టుకునే అంశాలలో షార్ప్ లుకింగ్ గల టెయిల్ ల్యాంప్స్ మరియు ఆంగ్లపు ఎల్ ఆకారంలో ఉన్నటువంటి గ్రాఫిక్స్ కలవు.

ఇఎస్ 300హెచ్ ఇంటీరియర్‌లో లెథర్ మరియు చెక్కతో చేసిన ఇంటీరియర్ సొబగులు, ఇన్ఫోటైన్‌మెంట్ మరియు భద్రత ఫీచర్లు ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్లోకి ఈ లెక్సస్ ఇఎస్ 300హెచ్ హైబ్రిడ్ లగ్జరీ సెడాన్ కారు విడుదల అయితే దీని ప్రారంభ ధర సుమారుగా రూ. 50 లక్షలుగా ఉండవచ్చు.

లెక్సస్ ఈ ఇఎస్ 300హెచ్ హైబ్రిడ్ లగ్జరీ సెడాన్ కారును 2016 సెప్టెంబర్‌లో దేశీయంగా విడుదల కానుంది.

దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న లెక్సస్ వారి ఇఎస్ 300హెచ్ హైబ్రిడ్ లగ్జరీ కారుకు చెందిన ఫోటోలు...

దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న లెక్సస్ వారి ఇఎస్ 300హెచ్ హైబ్రిడ్ లగ్జరీ కారుకు చెందిన ఫోటోలు...

దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న లెక్సస్ వారి ఇఎస్ 300హెచ్ హైబ్రిడ్ లగ్జరీ కారుకు చెందిన ఫోటోలు...

దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న లెక్సస్ వారి ఇఎస్ 300హెచ్ హైబ్రిడ్ లగ్జరీ కారుకు చెందిన ఫోటోలు...

2019 లోపు విడుదల కానున్న శాంగ్‌యాంగ్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి: మరింత చదవండి

2016 జూన్‌లో కొత్త కార్ల మీద ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు

 

Story first published: Saturday, June 11, 2016, 16:17 [IST]
English summary
Lexus To Finally Enter India With The ES 300h Hybrid
Please Wait while comments are loading...

Latest Photos