మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ విడుదల

By N Kumar

భారత దేశపు ప్రముఖ ఎస్‌యువి వాహనాల తయారీ సంస్థగా మహీంద్రా అండ్ మహీంద్రా నిలవడానికి ముఖ్య కారణం బొలెరో అని చెప్పవచ్చు. విడుదలయినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే తరహా శైలిలో ఉన్నప్పటికీ నిలకడగా అమ్మకాలు సాధిస్తోంది.

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ బొలెరో ఎస్‌యువిని ఇప్పుడు పవర్ ప్లస్ వేరియంట్లో దేశీయ విపణిలోకి విడుదల చేసింది.

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ విడుదల

నాలుగు మీటర్ల పొడవున్న ఈ బొలెరో పవర్ ప్లస్ ఎస్‌యువి మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అవి ఎస్ఎల్ఇ, ఎస్ఎల్ఎక్స్ మరియు జడ్‌ఎల్ఎక్స్ గా ఉన్నాయి.

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ విడుదల

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ పవర్ ప్లస్ బొలెరో వేరియంట్‌ను 6.59 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ప్రారంభ ధరతో అందుబాటులోకి తెచ్చింది.

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ విడుదల

సాంకేతికంగా ఈ బొలెరో పవర్ ప్లస్ వేరియంట్లో 70బిహెచ్‌పి పవర్ మరియు 195ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ ఎమ్‌హాక్ డి70 డీజల్ ఇంజన్‌ను అందించారు.

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ విడుదల

ఇంతకు మునుపు అందించిన ఇంజన్‌ ఎమ్2డిఐసిఆర్ తో పోల్చితే 13 శాతం ఎక్కువ శక్తివంతమైనది మరియు 5 శాతం ఉత్తమ మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు.

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ విడుదల

డిజైన్ పరంగా మునుపటి బొలెరో తరానికి చెందిన బాక్సీ డిజైన్‌నే కలిగి ఉంది.

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ విడుదల

ఇంటీరియర్ పరంగా పవర్ ప్లస్ బొలెరో వేరియంట్లో డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (డిఐఎస్), మహీంద్రా మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ మరియు ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి వాటిని అందించారు.

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ విడుదల

భద్రత పరంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఈ బొలెరో పవర్ ప్లస్ వేరియంట్లో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ బ్యాగులు, ట్రాక్షన్ కంట్రోల్ వ్యవస్థ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ విడుదల

అయితే ఎప్పటిలాగే ఇందులో ఏ/సి, పవర్ స్టీరింగ్ మరియు ఏడు మంది కూర్చునే సీటింగ్ సామర్థ్యం అందించారు.

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ విడుదల

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ విడుదల

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ విడుదల

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ విడుదల

మహీంద్రా బొలెరో పవర్ ప్లస్ విడుదల

  • భారతదేశపు రహస్య ఆయుధం కాళీ గురించి ఆసక్తికరమైన విషయాలు
  • ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం....?
  • విమాన ప్రయాణానికి ముందు ఇలాంటి ఆహారం తీసుకుంటున్నారా ?

Most Read Articles

English summary
New Mahindra Bolero Power+ Launched In India With Better Performance And Mileage
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X