ఇ-వెరిటో ఎలక్ట్రిక్ సెడాన్ కారును విడుదల చేసిన మహీంద్రా

By Anil

మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ మార్కెట్లోకి తమ రెండవ ఎలక్ట్రిక్ కారు ఇ-వెరిటోను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదలైన వెరిటో సెడాన్ కారు యొక్క ప్రారంభ ధర రూ. 9.50 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ప్రకటించింది. మహీంద్రా ఇ-వెరిటో సెడాన్ విడుదల వివరాలు క్రింది కథనంలో.....

ఇ-వెరియటో ను ఎలక్ట్రిక్ కారును విడుదల చేసిన మహీంద్రా

మహీంద్రా అండ్ మహీంద్రా ఇ-వెరిటో ఎలక్ట్రిక్ సెడాన్ కారును మూడు విభిన్న వేరియంట్లలో విడుదల చేసింది. అవి,

  • ఇ -వెరిటో D2
  • ఇ -వెరిటో D4
  • ఇ -వెరిటో D6
  • మహీంద్రా ఇ-వెరిటో ధరలు

    మహీంద్రా ఇ-వెరిటో ధరలు

    • ఇ -వెరిటో D2 ధర రూ. 9.50 లక్షలు
    • ఇ -వెరిటో D4 ధర రూ. 9.75 లక్షలు
    • ఇ -వెరిటో D6 ధర రూ. 10 లక్షలు
    • అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
      మహీంద్రా ఇ-వెరిటో సాంకేతిక వివరాలు

      మహీంద్రా ఇ-వెరిటో సాంకేతిక వివరాలు

      మహీంద్రా అండ్ మహీంద్రా ఈ వెరిటో ఎలక్ట్రక్ సెడాన్‌లో తమ మొదటి ఎలక్ట్రిక్ కారు రెవాలో అందించిన అదే ఇండక్షన్ మోటార్‌ను అందించారు.

      ఇ-వెరిటో లోని మోటార్

      ఇ-వెరిటో లోని మోటార్

      మహీంద్రా ఇ-వెరిటో సెడాన్ కారులో 72 వాట్ కెపాసిటి గల 3-స్టేజ్ ఆల్ట్రనేటివ్ కరెంట్ (AC) ఇండక్షన్ మోటార్ కలదు.

      పవర్ మరియు టార్క్

      పవర్ మరియు టార్క్

      మహీంద్రా ఈ ఇ-వెరిటోలో అందించిన ఎలక్ట్రిక్ మోటార్ 40 బిహెచ్‍‌‌పి పవర్ మరియు 91 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

      ట్రాన్స్‌మిషన్

      ట్రాన్స్‌మిషన్

      ఇ-వెరిటో లోని ఎలక్ట్రిక్ మోటార్‌కు 1-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు.

      వేగం

      వేగం

      మహీంద్రా ఇ-వెరిటో ఎలక్ట్రిక్ సెడాన్ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 86 కిలోమీటర్లుగా ఉంది.

      మైలేజ్

      మైలేజ్

      మహీంద్రా ఇ-వెరిటో ఎలక్ట్రిక్ సెడాన్ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జి చేస్తే సుమరుగా 110 కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తుంది.

      చార్జింగ్ సమయం

      చార్జింగ్ సమయం

      ఇ-వెరిటోలోని బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేయడానికి మొత్తం ఎనిమిది గంటల సమయం తీసుకుంటుంది. మహీంద్రా ఇ-వెరిటో టాప్ ఎండ్ వేరియంట్‌లో వేగంగా ఛార్జింగ్ అయ్యేందుకు అవకాశం కల్పించారు. దీని ద్వారా కేవలం 1 గంట 45 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది.

      మహీంద్రా ఇ-వెరిటో డిజైన్

      మహీంద్రా ఇ-వెరిటో డిజైన్

      మహీంద్రా ఇ-వెరిటో సాధారణ వెరిటో డిజైన్ పోలి ఉంటుంది. అయితే ఈ ఇ-వెరిటోలో మనం ఎగ్జాస్ట్ పైప్ (పొగ గొట్టాన్ని గుర్తించలేము.

      మహీంద్రా ఇ-వెరిటో లోని ఫీచర్లు

      మహీంద్రా ఇ-వెరిటో లోని ఫీచర్లు

      మహీంద్రా ఇ-వెరిటో లో ప్రయాణిస్తున్నపుడు లో ఛార్జింగ్ అనే అలర్ట్ గమనించినపుడు రివైవ్ అనే ఫంక్షన్‌ను వినియోగించుకుంటే అదనంగా ఎనిమిది కిలోమీటర్ల పాటు ప్రయాణించవచ్చు.

      బ్రేక్ ఫోర్స్‌ ద్వారా బ్యాటరీ ఛార్జింగ్

      బ్రేక్ ఫోర్స్‌ ద్వారా బ్యాటరీ ఛార్జింగ్

      ఇ-వెరిటో కారులో ప్రయాణిస్తున్నపుడు బ్రేకులను ఉపయోగిస్తే, బ్రేకుల ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తితో బ్యాటరీ ఛార్జింగ్ అయ్యే అవకాశాన్ని ఇందులో అందించారు.

      కిలోమీటర్‌కు 1.15 రుపాయలు మాత్రమే

      కిలోమీటర్‌కు 1.15 రుపాయలు మాత్రమే

      మహీంద్రా వారి ఇ-వెరిటో లో ప్రయాణిస్తే కిలోమీటర్‌కు అయ్యే ఖర్చు కేవలం రూపాయి 15 పైసలు మాత్రమే మరియు దీని ద్వారా ఎలాంటి వాతావరణ కాలుష్యం కూడా ఉండదు.

      అందుబాటులోకి

      అందుబాటులోకి

      ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఇ-వెరిటో ఎలక్ట్రిక్ సెడాన్ కార్లను కేవలం ఢిల్లీ నగరంలో మాత్రమే అందుబాటులోకి తీసుకు వస్తోంది. త్వరలో దేశ వ్యాప్తంగా ఉన్న ముంబాయ్, బెంగళూరు, హైద్రాబాద్, చెన్నై, పూనే, జైపూర్ మరియు నాగ్‌పూర్ వంటి నగరాలలో అందుబాటులోకి తీసుకురానుంది.

      చివరి మాట

      చివరి మాట

      పర్యావరణానికి హాని కలిగించే వాహనాల వాడకాన్ని నిలిపివేసి పర్యావరణహితమైన ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ కార్లను వినియోగిద్దాం...

      మరిన్ని కథనాల కోసం...

      ఉన్నట్లుండి గాల్లోకి ఎగిరి పడిన కార్లు: ఇది గ్రహాంతర వాసుల పనేనా

      7000 కార్లను కలిగి ఉన్న అత్యంత సంపన్నుడు

Most Read Articles

English summary
Mahindra e-Verito Launched In India, Prices Start At Rs. 9.50 Lakhs
Story first published: Thursday, June 2, 2016, 18:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X