సిఎన్‌జి వేరియంట్ జీతో ట్రక్కు విడుదల: ప్రారంభ ధర రూ. 3.49 లక్షలు

విభిన్న ఇంధన రకాలతో వాహనాలను విడుదల చేస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా తమ జీతో ట్రక్కును సిఎన్‌జి ఇంధన వేరియంట్లో విడుదల చేసింది. అత్యధిక మైలేజ్ ఇవ్వగల సిఎన్‌జి వేరియంట్ ట్రక్కు గురించి పూర్తి వివరాలు..

By Anil

దేశీయ మార్కెట్లో విభిన్న రకాల ఉత్పత్తులను అందిస్తోన్న మహీంద్రా అండ్ మహీంద్రా తమ పాపులర్ మిని ట్రక్కును సిఎన్‌జి ఇంధన వేరియంట్లో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సిఎన్‌జి వేరియంట్‌ను జీతో లోని టాప్ ఎండ్ వేరియంట్ అయిన ఎక్స్716లో పరిచయం చేసింది.

జీతో సిఎన్‌జి వేరియంట్ గురించి పూర్తి వివరాలు....

మహీంద్రా జీతో సిఎన్‌జి ట్రక్కు

మహీంద్రా అండ్ మహీంద్రా తమ వాహన శ్రేణిలో ఉన్న అనేక ఉత్పత్తులను విభిన్న ఇంధన వేరియంట్లలో విడుదల చేస్తోంది. అందులో భాగంగానే ఈ జీతో మిని ట్రక్కును సిఎన్‌జి వేరియంట్లో విడుదల చేసింది.

మహీంద్రా జీతో సిఎన్‌జి ట్రక్కు

మహీంద్రా జీతో సిఎన్‌జి వేరియంట్ ట్రక్కు కిలో సిఎన్‌జి ఇంధనానికి 33.2కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. ఇది 700కిలోల పేలోడ్ సామర్థ్యం కలదు.

మహీంద్రా జీతో సిఎన్‌జి ట్రక్కు

ఎకో ఫ్రెండ్లీ వాహనాల మరియు గూడ్స్ వాహనాలలో అధిక మైలేజ్ అదే విధంగా చిన్న కమర్షియల్ వాహనాల కాలుష్యాన్ని అధిగమించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మహీంద్రా సిఎన్‌జి మరియు ఇతర పర్యావరణహితమైన ఇంధనాలను వినియోగించుకునే వాహనాల అభివృద్ది చేస్తోంది.

మహీంద్రా జీతో సిఎన్‌జి ట్రక్కు

చిన్న కమర్షియల్ మరియు వ్యాపార ఆధారిత వాహనాలలో అధిక మైలేజ్ ఇస్తూ మరియు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే ఇంజన్‌లను అందించడం ద్వారా మహీంద్రా మరో మైలు రాయిని సాధించిందని మహీంద్రా ప్రెసిడెంట్ మరియు ఆటోమోటివ్ ఛీఫ్ ఎక్జ్సిక్యూటివ్ ప్రవీణ్ సాహ్ వెల్లడించారు.

మహీంద్రా జీతో సిఎన్‌జి ట్రక్కు

2015 ఏడాదిలో మహీంద్రా అండ్ మహీంద్రా ఒక టన్ను బరువును మోయగల సామర్థ్యం ఉన్న శ్రేణిలో మొత్తం ఎనిమిది రకాలు ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మిని ప్యాసింజర్ వ్యాన్‌లు కూడా ఉన్నాయి.

మహీంద్రా జీతో సిఎన్‌జి ట్రక్కు

మహీంద్రా ఈ జీతో మిని సిఎన్‌జి ట్రక్కులో 625సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ సిఎన్‌జి ఇంజన్ కలదు. ఇది సుమారుగా 38ఎన్ఎమ్ గరిష్ట టార్క్ మరియు 11బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

మహీంద్రా జీతో సిఎన్‌జి ట్రక్కు

చిన్న కమర్షియల్ ట్రక్కు జీతో ను ముందు వైపున కూర్చునే డ్రైవర్ మరియు ప్యాసింజర్ కోసం అత్యంతభద్రతతో కూడిన క్యాబిన్ డిజైన్, ఇఎల్ఆర్ సీట్ బెల్ట్ సిస్టమ్, మరియు చిన్న చిన్న అదుపులు కుదుపులకు స్థిరంగా కూర్చునేందుకు బకెట్ తరహాలో ఉండే సీటు కలదు.

.

  • 2017 నాటికి హోండా నుండి క్రాసోవర్ SUV
  • మారుతి నుండి మరో శుభవార్త
  • బజాజ్ పల్సర్ 220ఎఫ్ విడుదల: ప్రారంభ ధర రూ. 91,201 లు

Most Read Articles

English summary
Mahindra Jeeto Mini-Truck CNG Variant Launched In India Priced At Rs 3.49 Lakh
Story first published: Friday, December 9, 2016, 21:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X