లిమిటెడ్ ఎడిషన్ స్కార్పియోను విడుదల చేసిన మహీంద్రా

By Anil

మహీంద్రా అండ్ మహీంద్రా కూడా అంతర్జాతయ ఖరీదైన కార్ల సంస్థల్లాగా లిమిటెడ్ ఎడిషన్ ఉత్పత్తులను ప్రవేశపెడుతోంది. తాజాగా మహీంద్రా తమ బెస్ట్ సెల్లింగ్ స్కార్పియో వాహనాన్ని లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా కేవలం 1000 వాహనాలను మాత్రమే విడుదల చేసింది. మరి మీలో ఎంత మంది దీనిని కొనుగోలు చేస్తారు. కోనేముందు దీని ప్రత్యేకతలేంటో ఓ సారి చూద్దామా ? అయితే క్రింది కథనాన్ని చదివేయండి.

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ అడ్వెంచర్ స్కార్పియో లిమిటెడ్ ఎడిషన్ వాహనాలను ఫోర్ వీల్ మరియు టూ వీల్ డ్రైవ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంచింది.

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

టూ వీల్ డ్రైవ్ గల మహీంద్రా అడ్వెంచర్ స్కార్పియో వాహనం ధర రూ. 13.07 లక్షలు ఎక్స్ షోరూమ్ ముంబాయ్ మరియు ఫోర్ వీల్ డ్రైవ్ గల అడ్వెంచర్ స్కార్పియో వాహనం ధర రూ. 14.24 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్)గా ప్రకటించారు.

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

మహీంద్రా ఈ అడ్వెంచర్ స్కార్పియో వాహనంలో 2.2-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్‌న అందంచింది.

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 120 బిహెచ్‌పి పవర్ మరియు 280 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

ఈ లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో వాహనాన్ని సాధారణ స్కార్పియోలోని ఎ10 వేరియంట్ ఆధారంతో రూపొందించారు.

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియోలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‍‌బాక్స్‌మను అందించారు.

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

మహీంద్రా ఈ అడ్వెంచర్ స్కార్పియో మొత్తాన్ని వైట్ పెయింట్‌తో తీర్చిదిద్దింది. అయితే ఇందులో చుట్టువైపులా ఉన్న క్లాడింగ్, ప్రక్క వైపుల కొన్ని చోట్ల అడ్వెంచర్ మరియు లిమిటెడ్ ఎడిషన్‌ను తలపించేలా మిస్ట్ సిల్వర్‌ రంగును అద్దారు.

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

ఈ లిమిటెడ్ ఎడిషన్ స్కార్పియోలో అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, ఇంటిగ్రేడ్ టర్న్ ఇండికేటర్స్, టెయిల్ ల్యాంప్స్, 17 అంగుళాల గన్‌మెటల్ అల్లాయ్ చక్రాలు మరియు రెడ్ బ్రేక్ కాలిపర్లు కొన్ని కాస్మొటిక్ మార్పులను పొందాయి.

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

ఇంటీరియర్ లోపల నీలం రంగు తొడుగులు గల లెథర్ సీట్లు, లెథర్ తొడగులు గల స్టీరింగ్ వీల్ మరియు గేర్ లీవర్, రియర్ వ్యూవ్ కెమెరా ను డిస్ల్పే చేసే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

అదనంగా స్కార్పియో ఎస్10 వేరియంట్లో ఉన్న రెండు ఎయిర్ బ్యాగులు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, న్యావిగేషన్ సిస్టమ్ గల తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ కలదు.

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న మహీంద్రా షోరూమ్‌లలో దీనికి సంభందించిన బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

మీకు ఇలాంటి అడ్వెంచర్ స్కార్పియో కావాలనుకుంటే త్వరగా మీకు దగ్గరలోని మహీంద్రా షోరూమ్‌కి వెళ్లండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కేవలం 1,000 స్కార్పియోలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

మహీంద్రా లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

మహీంద్రా లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో లోని రియర్ వ్యూవ్ మిర్రర్

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

మహీంద్రా లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో లోని టెయిల్ ల్యాంప్

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

మహీంద్రా లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో లోని అల్లాయ్ వీల్

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో

లిమిటెడ్ ఎడిషన్ అడ్వెంచర్ స్కార్పియో
  • ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు

Most Read Articles

English summary
Limited Edition Mahindra Scorpio Adventure Launched – Get Yours Now!
Story first published: Tuesday, April 26, 2016, 16:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X