రెండు కొత్త వాహనాలను విడుదల చేయనున్న మహీంద్రా

మహీంద్రా అండ్ మహీంద్రా రెండు కొత్త ప్యాసింజర్ వాహనాలను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఏడాది నాటికి ఎమ్‌పివిని మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.

By Anil

భారత దేశపు అతి పెద్ద యుటిలిటి వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఒకటి కాదు రెండు కొత్త ఉత్పత్తుల విడుదలకు సిద్దమవుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా నిర్వహించిన పత్రికా సమావేశంలో ఈ విషయం వెల్లడైంది.

మహీంద్రా నుండి మరో రెండు వాహనాలు

మహీంద్రా వారి మొదటి వాహనం ఎమ్‌పివి అని స్పష్టమవుతోంది. దీనికి యు231 అనే కోడ్ పేరును కూడా ఖరారు చేసినట్లు తెలిసింది. గతంలో కొన్ని సందర్భాల్లో మహీంద్రా ఈ ఎమ్‌పివిని వివిధ దశలలో రహస్యంగా పరీక్షించింది.

మహీంద్రా నుండి మరో రెండు వాహనాలు

రహస్యంగా పరీక్షించిన ఫోటోలను గమనిస్తే ఎమ్‌పివి సెగ్మెంట్లో లీడర్ పొజిషన్‌లో ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టాకు సరాసరి పోటీని సృష్టించనుంది.

మహీంద్రా నుండి మరో రెండు వాహనాలు

మహీంద్రా అప్ కమింగ్ ఎమ్‌పివి వాహనానికి టియువి500 అనే పేరును కూడా ఖరారు చేసినట్లు ఆధారం లేని వార్తలు వెలువడుతున్నాయి. అయితే మహీంద్రా మాత్రం తమ మొదటి వాహనాన్ని 2017 లో విడుదల చేయనున్నామని స్పష్టం చేసింది.

మహీంద్రా నుండి మరో రెండు వాహనాలు

సాంకేతికంగా మహీంద్రా ఈ ఎమ్‌పివిలో జైలో వాహనంలో వినియోగించిన లేదా స్కార్పియోలో వినియోగించిన అవే డీజల్ ఇంజన్‌లను పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ అప్‌కమింగ్ ఎమ్‌పివి కేవలం డీజల్ వేరియంట్లో మాత్రమే పరిచయం కానుంది.

మహీంద్రా నుండి మరో రెండు వాహనాలు

త్వరలో విడుదల చేయబోయే ఎమ్‌పివిలో క్యాబిన్ స్పేస్ మీద మహీంద్రా ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముందు వైపు తక్కువ డిజైన్ లక్షణాలతో వెనుక వైపున భారీ పరిమాణం ఉండేట్లు జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో తమ ఎక్స్‌యూవీ500 లోని మూడవ వరుస అంత విశాలంగా ఉండేదు కాదు, దానికి భిన్నంగా ఈ సరికొత్త ఎమ్‌పివిలో మూడవ వరుసలోని సీటింగ్‌ను కూడా జాగ్రత్తగా డిజైన్ చేస్తోంది.

మహీంద్రా రెండవ వాహనం

మహీంద్రా రెండవ వాహనం

రాబోయే కాలంలో మహీంద్రా విడుదల చేయనున్న రెండవ ఉత్పత్తి విషయానికి వస్తే శాంగ్‌యాంగ్ అభివృద్ది చేసిన టివోలి వేదిక ఆధారంగా మహీంద్రా తమ మరో నూతన ఎస్‌యువిని అభివృద్ది చేస్తోంది.

మహీంద్రా నుండి మరో రెండు వాహనాలు

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న రెనో డస్టర్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి వాహనాలకు సరాసరి పోటీని ఇవ్వనుంది. ఇంజన్ పరంగా పెట్రోల్ మరియు డీజల్ ఆప్షన్‌లలో వచ్చే అవకాశం ఉంది. అయితే కెయువి100 లోని ఇంజన్‌లను రీట్యూన్ చేసి కూడా పరిచయం చేసే అవకాశం లేకపోలేదు.

మహీంద్రా నుండి మరో రెండు వాహనాలు

నువోస్పోర్ట్ లోని ఇంజన్‌లను కూడా టివోలి ఆధారిత మహీంద్రా ఎస్‌యువిలో వచ్చే అవకాశం ఉంది. మహీంద్రా ఈ టివోలి ఆధారిత ఎస్‌యువి వాహనాన్ని 2018 లో జరిగే 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించనుంది. మరిన్ని ఆటోమొబైల్ వార్తలను తెలుగులో పొందుటకు మాతో కలిసి ఉండండి.

మహీంద్రా నుండి మరో రెండు వాహనాలు

  • రెనో క్విడ్ ఏఎమ్‌టి విడుదల: ప్రారంభ ధర రూ. 4.25 లక్షలు
  • విభిన్న శైలిలో సుజుకి ఇగ్నిస్: విడుదల కంటే ముందుగా డెలివరీ
  • అమెరికా అధ్యక్ష పీటమెక్కిన డొనాల్డ్ ట్రంప్ "కార్ కలెక్షన్"

Most Read Articles

English summary
Exclusive: Mahindra To Launch Two 'New' Vehicles For The Indian Market
Story first published: Saturday, November 12, 2016, 12:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X