భారతదేశపు నెం.1 కారు: 30 లక్షలు అమ్మకాలు జరిపిన మారుతి ఆల్టో

By Anil

భారతీయ మార్కెట్లో ఎంట్రీలెవల్ కార్లకు, ఎంట్రీలెవల్ హ్యాచ్‌బ్యాక్‌ల కార్లకు మరియు బడ్జెట్ కార్లకు ఏ మాత్రం కొదవ లేదు. కాని వీటన్నింటిని కాదని భారతీయులు ఆల్టో కారుకే పచ్చ జెండా ఊపారు. మారుతి సుజుకి అంటే ఒక సాంప్రదాయకమైన సంస్థ అనే ఆలోచన వచ్చేసింది. అందుకే కాబోలు విడుదల చేసిన కాలం నుండి నేటి వరకు 30 లక్షల ఆల్టో కార్లను కొనుగోలు చేసి దీనిని ఆగ్ర భాగాన నిలిపారు.

30 లక్షల మంది ప్రజలు ఎంపిక చేసుకున్న మారుతి సుజుకి ఆల్టో గురించి పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మొదటి పరిచయం

మొదటి పరిచయం

2000 లో మొదటి సారిగా భారతీయ మార్కెట్లోకి పరిచయం చేసింది. దాదాపుగా 16 సంవత్సరాల ప్రయాణంలో మూడు జనరేషన్లకు చెందిన కార్లను అందించింది.

మూడు తరాలకు చెందిన కార్లు

మూడు తరాలకు చెందిన కార్లు

మారుతి సుజుకి మొదటి సారిగా మొదటి తరం కారును 2000 సంవత్సరంలో, రెండవ తరం కారును 2005 లో మరియు తాజాగా మూడవ తరం కారును 2015 లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

ప్రతి ఏడాది మొదటి స్థానంలో

ప్రతి ఏడాది మొదటి స్థానంలో

అప్పటి నుండి నేటి వరకు ప్రతి ఏడాది కూడా అత్యధికంగా అమ్మకాలు సాధిస్తున్న కార్లలలో మారుతి సుజుకి ఆల్టో800 కారు మొదటి స్థానంలో నిలుస్తూనే వచ్చింది.

ప్రస్తుతం మారుతి సుజుకి

ప్రస్తుతం మారుతి సుజుకి

ప్రస్తుతం మార్కెట్లో ప్రతి ఏడాది టాప్-10 సెల్లింగ్ కార్ల జాబితాలో మొదటి స్థానంలోనే ఉంది. ప్రతి నెల కూడా సరాసరిగా 25,000 కార్ల వరకు అమ్మకాలు నమోదు చేసుకుంటోంది.

 ఎంట్రీ లెవల్‌ కార్ల మార్కెట్లో బెస్ట్ డిజైన్

ఎంట్రీ లెవల్‌ కార్ల మార్కెట్లో బెస్ట్ డిజైన్

ఇండియన్ ఎంట్రీ లెవల్ కార్ల సెగ్మెంట్లో డిజైన్ అంశం ఎంతో ముఖ్యమైనది. అందుకోసం మారుతి ఎప్పటికప్పుడు విభిన్న మార్పులతో దీనిని చేస్తూ వచ్చింది. అందులో ప్రస్తుతం ఉన్న ఆల్టో డిజైన్ ఎంట్రీలెవల్ సగ్మెంట్లోకి ఉత్తమ డిజైన్‌గా వెలుగుతోంది.

డిజైన్

డిజైన్

మారుతి సుజుకి తమ ఆల్టో రీఫ్రెష్డ్ డిజైన్ లో వేవ్ డిజైన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అంటే ముందువైపున గల బ్యానెట్ మీద నుండి క్రింది, ప్రక్కవైపునకు అలల వంటి రూపాన్ని కల్పించారు.

ఘర్షణ రహిత డిజైన్ కోసం

ఘర్షణ రహిత డిజైన్ కోసం

ఘర్షణ (Friction): కారు వేగం మరియు మైలేజ్ కారు డిజైన్ మీద ఆదారపడి ఉంటుంది. కారు వేగంగా పరుగులు పెడుతున్నప్పుడు గాలి కారు కారుకు ఎదురుగా వీస్తుంది తద్వారా కారు వేగం తగ్గిపోతుంది. అందుకోసం గాలిని కారుకు కలిగే ఘర్షణను నిరోధించడానికి ముందు మరియు ప్రక్కవైపుల గల డోర్లకు ఏరోడైనమిక్ డిజైన్‌ను కల్పించారు.

వెనుక డిజైన్

వెనుక డిజైన్

చాలా వరకు కార్ల సంస్థలు ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో వెనుక వైపున డిజైన్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. కాని మారుతి సుజుకి తమ ఆల్టో వెనుక వైపున జ్యువెల్-ఫినిష్ తో కాంబినేషన్ లైటింగ్‌ను కల్పించారు.

పెటల్ హెడ్ ల్యాంప్స్

పెటల్ హెడ్ ల్యాంప్స్

పెటల్స్ ఆకారంలో గల హెడ్ ల్యాంప్స్ మరియు సరకొత్త ఫ్రంట్ గ్రిల్ గల బంపర్‌ను అందించారు.

సౌకర్యవంతమైన ఇంటీరియర్

సౌకర్యవంతమైన ఇంటీరియర్

మారుతి సుజుకి తమ ఆల్టో కారులో సౌకర్యవంతమైన ఇంటీరియర్‌ను కల్పించారు. ఇది రెండు విభిన్నమైన బ్రౌన్ మరియు గ్రే రంగులలో అందుబాటులో లభించనుంది.

పనితీరు

పనితీరు

మన భాషలో చెప్పాలంటే పికప్‌ అని ఎక్కువ మంది అటుంటారు. ఈ సెగ్మెంట్లో గల అన్ని కార్లలో కెల్లా ఆల్టో అత్భుతమైన పికప్‌ని ఇస్తుంది.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

మారుతి సుజుకి ప్రస్తుతం అత్యంత శక్తవంతమైన 796 సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్లు మరియు 12 వాల్వ్‌లు గల ఇంజన్‌ను కలిగి ఉంది.

అత్యధిక పవర్

అత్యధిక పవర్

ఇందులోని ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వేగం వద్ద ఉన్నప్పుడు 47బిహెచ్‍‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

గరిష్ట టార్క్

గరిష్ట టార్క్

మరియు 3500 ఆర్‍‌పిఎమ్ వేగం వద్ద 69 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేయును.

మైలేజ్

మైలేజ్

  • పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 22.74 కిలోమీటర్లు
  • సిఎన్‌జి గ్యాస్‌తో నడిచే ఇంజన్ 30.46 కిలోమీటర్/కేజి మైలేజ్‌ను ఇవ్వగలవు.
  • గేర్‌బాక్స్

    గేర్‌బాక్స్

    5-స్పీడ్ మ్యాన్యువల్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ట్రాన్స్‌మిషన్ కలదు.

    స్టీరింగ్

    స్టీరింగ్

    మ్యాన్యువల్ స్టీరింగ్ మరియు పవర్ స్టీరింగ్ ఆప్షన్లు కలవు.

    సెంటర్ కన్సోల్

    సెంటర్ కన్సోల్

    ఆల్టో క్యాబిన్‌లోని ముందు వైపు గల సెంటర్ కన్సోల్ ద్వారా అన్ని కిటికీ అద్దాలను కంట్రోల్ చేయవచ్చు మరియు ఇతర చిన్న చిన్ని పదార్థాలను పెట్టుకోవడానికి ప్రత్యేకమైన స్థలం కేటాయించారు. గేర్ రాడ్ చూట్టూ గల వాటిని మీరు ఫోటో ద్వారా గమనించగలరు.

    మారుతి సుజుకి ఆల్టో ధర వివరాలు

    మారుతి సుజుకి ఆల్టో ధర వివరాలు

    • ఆల్టో ప్రారంభ వేరియంట్ ఎక్స్ షోరూ ధర రూ. 2,66,231
    • ఆల్టో సిఎన్‌జి వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 3,84,113
    • మారుతి ఆల్టో లభించు రంగులు

      మారుతి ఆల్టో లభించు రంగులు

      • న్యూ బ్లేజింగ్ రెడ్
      • న్యూ టార్క్ బ్లూ
      • గ్రానైట్ గ్రే
      • సిల్కి సిల్వర్
      • సుపీరియర్ వైట్
      • ఫోర్ట్స్ బ్లూ
      • మారుతి ఆల్టోలోని ఫీచర్లు

        మారుతి ఆల్టోలోని ఫీచర్లు

        • 177-లీటర్ల కెపాసిటి గల బూట్ స్పేస్
        • 160 ఎమ్ఎమ్ గల గ్రౌండ్ క్లియరెన్స్
        • పార్కింగ్ కెమెరా
        • ఎయిర్ కండీషనర్
        • పవర్ విండోలు
        • మ్యుజిక్ సిస్టమ్
        • మారుతి ఆల్టోలోని భద్రత ఫీచర్లు

          మారుతి ఆల్టోలోని భద్రత ఫీచర్లు

          • ముందు వైపున డిస్క్ బ్రేకులు
          • వెనుక వైపున డ్రమ్ బ్రేకులు
          • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
          • 35-లీటర్లు సామర్థ్యం గల ఇంధన ట్యాంకు
          • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
          • డ్రైవర్ కోసం ముందు వైపున ఎయిర్ బ్యాగును కల్పించారు.
          • ఆల్టో కొలతలు

            ఆల్టో కొలతలు

            • పొడవు 3395 ఎమ్ఎమ్
            • వెడల్పు 1490 ఎమ్ఎమ్
            • ఎత్తు 1475 ఎమ్ఎమ్
            • వీల్ బేస్ 160 ఎమ్ఎమ్
            • పోటీ దారులు

              పోటీ దారులు

              మారుతి సుజుకి ఆల్టో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ ఇయాన్, షెవర్లే స్పార్క్, రెనో క్విడ్ వంటి కార్లకు పోటిగా నిలిచింది.

              ఆల్టో 800ను 30 లక్షల మంది ఎంచుకోవడానికి గల ముఖ్య కారణాలు
              • 170 సంవత్సరాల ఇండియన్ రైల్వే చరిత్రలో :49 ఆసక్తికరమైన నిజాలు
              • భారత దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్-10 కార్లు :...టాప్-10 జాబితాలో మారుతి రాజ్యం !
              • ఇండియన్ మార్కెట్లోకి వరుసగా విడుదల కానున్న 20 కార్లు

Most Read Articles

English summary
maruti-alto-cross-3-million-mark
Story first published: Saturday, February 27, 2016, 15:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X