ఆరు లక్షలకే బెంజ్ కారా ఇదెలా సాధ్యం

ఒక రూపంలో ఉన్న కారును మరో రూపంలోకి మార్చాలంటే తగిన నైపుణ్యం ఖచ్చితంగా అవసరం. లేదంటే ఇదిగో ఈ మోడఫైడ్ మారుతి బాలెనొ తరహాలో ఉంటుంది.

By Anil

కస్టమైజేషన్ మానియా ఔత్సాహికులపై తీవ్రంగానే ఉంది. తమ వద్ద ఒక బైకు లేదంటే కారు ఉందంటే చాలు మిగతా వారి కన్నా తమ వాహనాలు భిన్నంగా ఉండాలని భావిస్తారు. చాలా వరకు లగ్జరీ కార్ల డిజైన్‌ను కాపీ కొడితే కొందరు కొత్తగా ట్రై చేస్తారు. అందులో చాలా వరకు ఫెయిల్యూర్ కూడా అవుతున్నాయి. మొత్తానికి తమ వ్యక్తిత్వాన్ని తెలిపేలా వాహనాల మోడిఫికేషన్‌కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.

మోడిఫైడ్ మారుతి సుజుకి బాలెనొ

ఓ మారుతి బాలెనొ ఓనరుకు మెర్సిడెస్ బెంజ్ కు చెందిన ఏ-క్లాస్ కారంటే పిచ్చిష్టం కాబోలు. అందుకే తన ఎర్రటి బాలెనొను ఎ-క్లాస్ స్టైల్లో మోడిఫైచేయించాడు.

మోడిఫైడ్ మారుతి సుజుకి బాలెనొ

అయితే దీని మోడిఫికేషన్‌లో నైపుణ్యతా లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. పూర్తి స్థాయిలో దీని మోడిఫికేషన్ పనులు పూర్తయితే అప్పుడు ఎ-క్లాస్ రూపం ఇందులో ప్రతిబింబించే అవకాశం ఉంది.

మోడిఫైడ్ మారుతి సుజుకి బాలెనొ

ముందువైపు డిజైన్‌కు మోడిఫికేషన్ సమయంలో అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఇది మెర్సిడెస్ బెంజ్ అని గుర్తించడానికన్నట్లు మెర్సిడెస్ లోగో అందించారు. మరియు ఎ-క్లాస్ కారు నుండి సేకరించిన ఫ్రంట్ గ్రిల్‌ను ఇందులో ఇముడింపచేశారు.

మోడిఫైడ్ మారుతి సుజుకి బాలెనొ

ఎ-క్లాస్ సెడాన్‌ మరియు బాలెనొ లలో ఉపయోగించిన లైట్ల మేళవింపు మరియు సరికొత్త 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌తో మెర్సిడెస్ తరహాలోనే ఉంది.

మోడిఫైడ్ మారుతి సుజుకి బాలెనొ

మోడిఫైడ్ బాలెనొ వెనుక వైపు డిజైన్ విషయానికి వస్తే అసంపూర్ణంగా వదిలేశారనే భావన కలుగుతుంది. రియర్ బంపర్‌కు క్రింది వైపున పెయింటింగ్ చేయకుండా వదిలేసిన నాలుగు పళ్లను మరియు బంపర్‌లో కుడి మరియు ఎడమ వైపున రెండు చొప్పున ఉన్న మొత్తం నాలుగు ఎగ్జాస్ట్ పైపులను గుర్తించవచ్చు.

మోడిఫైడ్ మారుతి సుజుకి బాలెనొ

ఎక్ట్సీరియర్ మాత్రమే కాదు ఇంటీరియర్ కూడా చాలా వరకు మార్పులకు గురైంది. మారుతి ఇచ్చిన ఫీచర్లు మరియు ఇంటీరియర్‌ డిజైన్‌కు తమ మోడిఫికేషన్ స్కిల్స్‌తో మరిన్ని హంగులు జోడించారు.

మారుతి సుజుకి

మారుతి సుజుకి బాలెనొ ఎంట్రీ లెవల్ వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ. 6.30 లక్షలుగా ఉంది మరియు మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ ధర రూ. 27 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

.
  • 2,50,000 లక్షల రుపాయల వరకు తగ్గింపు ప్రకటించిన హ్యుందాయ్ మోటార్స్
  • వితారా బ్రిజా: ఎనిమిది నెలల్లో 1,72,000 బుకింగ్స్
  • కాలేజ్ స్టూడెంట్స్ కోసం బెస్ట్ కార్లు

Most Read Articles

English summary
This Modified Maruti Baleno Is A Colossal Mess — Get Your Barf Bags Out
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X