మారుతి సుజుకి ఇగ్నిస్ ఫస్ట్ లుక్ రివ్యూ

By Anil

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన కొన్ని కొత్త ఉత్పత్తులతో ఇతర సంస్థలకు గట్టి పోటీని సృష్టిస్తోంది. దేశీయంగా శక్తివంతమైన కార్ల తయారీ సంస్థగా ఎదుగుతున్న మారుతి ప్రతి సెగ్మెంట్లోని తమ ఉత్పత్తులను అందిస్తూ వస్తోంది. తరువాత అంతే వేగంతో విజయాన్ని అందుకుంటోంది. అందుకు నిదర్శనం వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌‌యువి మరియు బాలెనొ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్.

మహీంద్రా అండ్ మహీంద్రా వారు కొత్తగా ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన కెయువి100 కు గట్టి పోటీని ఇచ్చే విధంగా ఇగ్నిస్ క్రాసోవర్‌ను తీసుకువచ్చే నిమగ్నంలో ఉంది. మారుతి దీనిని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదికలో ప్రదర్శించింది. దీని గురించి పూర్తి వివరాలు....

డిజైన్

డిజైన్

మారుతి ఇగ్నిస్ క్రాసోవర్ ముందు వైపు డిజైన్‌ను గమనించినట్లయితే దీనిని లైట్ వెయిట్ ఫ్లాట్ ఫామ్ ఆధారంగా తయారు చేసినట్లు స్పష్టం అవుతుంది. ఇది 30 శాతం ధృడంగా మరియు 15 శాతం తక్కువ బరువుతో తయారయింది. కారుకు చుట్టు ప్రక్కల బాలెనొ, ఎస్-క్రాస్ మరియు కెయువి100 లా కొన్ని డిజైన్‌ లైన్లను కలిగి ఉంది. మరియు ఎక్కువ విశాలమైన ఇంటీరియర్‌ను కల్పించడానికి వితారా బ్రిజాను ప్రేరణగా తీసుకున్నారు.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఫస్ట్ లుక్ రివ్యూ

ముందు వైపు డిజైన్‌లో ఎంతో కీలకంగా ఉండే డిజైన్ లైట్లు ఎంతో చక్కగా ఉంటాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్‌లోనే పగటి పూట వెలిగే ఎల్‌ఇడి ల్యాంప్స్‌ను ఇముడింప చేశారు. అదే విధంగా ఫ్రంట్ గ్రిల్ కూడా కాస్త భిన్నంగా ఉంది. క్రాసోవర్ అనే సెగ్మెంట్‌ను గుర్తు చేయడానికి అన్నట్లుగా దీనికి అధిక గ్రౌండ్ క్లయరెన్స్‌ను కల్పించారు.

ఇగ్నిస్ ఇంజన్ వివరాలు

ఇగ్నిస్ ఇంజన్ వివరాలు

మారుతి సుజుకి ఆ ఇగ్నిస్ క్రాసోవర్‌లో 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ డీజల్ ఇంజన్‌లను పరిచయం చేయనుంది.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఫస్ట్ లుక్ రివ్యూ

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మారుతి అందించిన ఉత్పత్తులలో ఈ ఇంజన్ ఉన్నప్పటికీ ఇగ్నిస్ క్రాసోవర్ కోసం కొంచెం డెవలప్ చేసి మరి అందించనుంది. అయితే దాదాపుగా 1.2 మరియు 1.3 లీటర్ సామర్థ్యంతో వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఫస్ట్ లుక్ రివ్యూ

మారుతి ఇందులో 1.0 లీటర్ బూస్టర్ జెట్ ఇంజన్ తీసుకువచ్చే ఆలోచనలో కూడా ఉంది. దీనితో పాటు భారతీయ కస్టమర్లను ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ ఆప్షన్‌ను పరిచయం చేసే అంచనాలు కూడా ఉన్నాయి.

మారుతి సుజుకి ఇగ్నిస్ ఫస్ట్ లుక్ రివ్యూ

మారుతి ఇప్పటికే తమ ఎస్-క్రాస్ లో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ను పరీక్షించి చూసింది. అంతే కాకుండా ఇగ్నిస్‌లో ఒకే సారి యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా పరిచయం చేయనున్నారు.

ఇంజన్ పనితీరు మరియు ఇతర వివరాలు

ఇంజన్ పనితీరు మరియు ఇతర వివరాలు

  • 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ పవర్ 83 బిహెచ్‌పి
  • 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ టార్క్ 115ఎన్ఎమ్
  • మైలేజ్ 20 కిలోమీటర్/లీటర్
  • మారుతి సుజుకి ఇగ్నిస్ ఫస్ట్ లుక్ రివ్యూ

    • 1.3 లీటర్ డీజల్ ఇంజన్ పవర్ 74 బిహెచ్‌పి
    • 1.3 లీటర్ డీజల్ ఇంజన్ టార్క్ 190 ఎన్ఎమ్
    • మైలేజ్ 25 కిలోమీటర్/లీటర్
    • మారుతి సుజుకి ఇగ్నిస్ ఫస్ట్ లుక్ రివ్యూ

      ట్రాన్స్‌మిషన్ 5-స్పీడ్ మ్యాన్యువల్

      బూట్ స్పేస్ 258 లీటర్లు (415 లీటర్ల వరకు పెంచుకోవచ్చు)

      గ్రౌండ్ క్లియరెన్స్ 180 ఎమ్ఎమ్

      మారుతి సుజుకి ఇగ్నిస్ లోని ఫీచర్లు

      మారుతి సుజుకి ఇగ్నిస్ లోని ఫీచర్లు

      • ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
      • బ్లూటూత్ మరియు యుఎస్‌బి కంపాటబిలిటి
      • ప్రీమియమ్ లెథర్ అప్ హోల్ట్సే
      • స్టీరింగ్ మీద కంట్రోల్స్
      • క్లైమేట్ కంట్రోల్
      • నాలుగు పవర్ విండోలు
      • భద్రత ఫీచర్లు

        భద్రత ఫీచర్లు

        మారుతి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న ఇగ్నిస్‌లో స్టాండర్డ్ ఎయిర్ బ్యాగులు మరియు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వనుంది. అంతర్జాతీయంగా అమ్మకాలకు సిద్దమయ్యే ఇగ్నిస్‌లో హిల్ డిసెంట్ కంట్రోల్, లేన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, పార్క్ అసిస్ట్, సరికొత్త అడాప్టివ్ డ్యూయల్ కెమెరా బ్రేకింగ్ సిస్టమ్.

        మారుతి సుజుకి ఇగ్నిస్ ఫస్ట్ లుక్ రివ్యూ

        ఇక టాప్ ఎండ్ వేరియంట్లో అయితే సరికొత్త న్యావిగేషన్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా రానున్నాయి.

         ఇగ్నిస్ ధర వివరాలు...

        ఇగ్నిస్ ధర వివరాలు...

        ధర విషయంలో మారుతి సుజుకి ఎంతో జాగ్రత్తగాని నిర్ణయం తీసుకుంటుంది. దీని ధర దేశీయంగా రూ. 4.5 నుండి 7 లక్షల మధ్య వచ్చే అవకాశాలు ఉన్నాయి.

        పోటీ

        పోటీ

        మారుతి సుజుకి ఇగ్నిస్ గురించి పూర్తి అవగాహన రావాలంటే దీనికి ఉన్న సరైన పోటీ దారులను గుర్తించాలి. ఈ ఇగ్నిస్ క్రాసోవర్ మహీంద్రా అండ్ మహీంద్రా వారి కెయువి100 కు గట్టి పోటీగా నిలవనుంది.

        మారుతి సుజుకి ఇగ్నిస్ ఫస్ట్ లుక్ రివ్యూ

        ఉత్తమ రీసేల్ వ్యాల్యూ కలిగిన సెకండ్ హ్యాండ్ కార్లు

        మారుతి సుజుకి వారి భవిష్యత్తు కార్లు ఇవే....

Most Read Articles

English summary
Maruti Ignis To Be Manufactured In Sanand — Here’s Our First Look Review
Story first published: Thursday, June 23, 2016, 13:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X