బాలెనొ ఆర్‌ఎస్ హ్యాచ్‌ను ప్రదర్శించిన మారుతి సుజుకి: ప్రదర్శన వివరాలు, ఫోటోలు

By Anil

మారుతి సుజుకి వారు గత ఏడాదిలో మార్కెట్లోకి విడుదల చేసిన బాలెనొ హ్యాచ్‌బ్యాక్ కారు తిరుగులేని అమ్మకాలు సాగిస్తోంది. అయితే ఈ విజయాన్ని మంరింత పెంచడానికి ఇప్పుడు బాలెనొ కారును ఆర్‌ఎస్ అనే పేరుతో మరొక కారును అందించినుంది. అందులో భాగంగానే 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ఈ బాలెనొ ఆర్‌ఎస్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది, దీనికి చెందిన ఫోటోలు మరియు ప్రదర్శన వివరాలు...

మారుతి సుజుకి బాలెనొ ఆర్‌ఎస్


డిజైన్:
మారుతి సుజుకి తమ బాలెనొ రెగ్యులర్ కారుకు కొన్నిమార్పులు చేర్పులు చేసి ఈ బాలెనొ ఆర్‌ఎస్‌ను డిజైన్ చేశారు. ముందు వైపు డిజైన్‌లో ఎటువంటి మార్పులు చేటుచేసుకోలేదు. అయితే వెనుక వైపున సరికొత్త బంపర్, న్యూ డిఫ్యూసర్, మరియు బ్లాక్ కలర్‌లో గల అల్లాయ్ వీల్స్ కలవు.

ఇంటీరియర్‌ను పూర్తిగా నలుపు రంగులో రూపొందించారు. స్పోర్ట్స్ సీట్లు, ఫ్లాట్ గా ఉండే స్టీరింగ్ వీల్, ఆపిల్ కార్ ప్లే ఆధారిత టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ వంటి ఫీచర్లు కలవు.

ఇంజన్ వివరాలు:
బాలెనొ ఆర్ఎస్ కారు 1.0-లీటర్ గల మూడు సిలిండర్ల బూస్టర్ జెట్ టర్భోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది దాదాపుగా 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 110 బిహెచ్‌పి పవర్ మరియు 2,000 ఆర్‌పిఎమ్ వద్ద 170 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బాలెనొ ఆర్‌ఎస్ లో గల ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్ బాక్స్‌ను కలిగి ఉంది. ఈ కారు కేవలం 12 సెకండ్ల కాలంలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుంది మరియు దీని అత్యధిక వేగం గంటకు 200 కిలోమీటర్లు
AUTO EXPO NEWS: భారీ ఫీచర్లతో కొలువుదీరిన యమహా వారి ఎమ్‌టి-09 స్ట్రీట్ బైక్:ధర రూ. 10.20 లక్షలు
అందుబాటులోకి మరియు పోటి:
మారుతి సుజుకి వారు ఈ బాలెనొ ఆర్ ఎస్ కారును దసరా, దీపావళి లోపు నెక్సా షోరూమ్‌లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. మరియు దీని ధర ప్రస్తుతం బాలెనొ కన్నా కొంచెం ఎక్కువగా ఉండనుంది. ఈ బాలెనొ ఆర్ఎస్ కారు ఫియట్ పుంటో అబర్త్ మరియు వోక్స్ వ్యాగన్ పోలో జిటిఐ కార్లకు పోటిగా నిలవనుంది.

Most Read Articles

English summary
Auto Expo 2016 - Maruti Suzuki Speeds Into Hot Hatch War With Baleno RS
Story first published: Monday, February 8, 2016, 14:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X