బ్రిజా ముందు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఆటలు ఇక మీదట సాగవు

By Anil

ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా గల ఎస్‌యువి మార్కెట్లో అగ్రభాగాన నిలిచి ఉంది. అమెరికా చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ కొద్ది సంవత్సరాల క్రితం ఇండియన్ ఎస్‌యువి మార్కెట్లోకి అచ్చం హ్యాచ్‌బ్యాక్‌ డిజైన్‌ను పోలి ఉండే ఎకో స్పోర్ట్ ఎస్‌‌యువిని విడుదల చేసింది. విడుదల చేసినప్పటి నుండి నేటి వరకు ఎస్‌యువిల యుగంలో ఒక ట్రెండ్ సృష్టించింది.

అయితే మారుతి సుజుకి తాజాగా ప్రదర్శించిన సరికొత్త వితారా బ్రిజా ఎకో స్పోర్ట్ దూకుడుకు కళ్లెం వేయనుంది. ప్రస్తుతం మారుతి సుజుకి వారి ముఖ్య లక్ష్యం ఎస్‌యువి మార్కెట్లో కూడా తమ ఉత్పత్తులతో మొదటి స్థానంలో నిలవడమే. అందుకోసమే అన్నింటికి పోటిగా వితారా బ్రిజాను ప్రవేశ పెట్టింది. కాని ఎస్‌యువి లలో రారాజుగా వెలిగొందుతున్న ఎకో స్పోర్ట్ మరియు వితారా బ్రిజా ల మధ్య తీవ్ర పోటి నెలకొంది.

పాఠకుల కోసం ఈ శీర్షిక ద్వారా ఈ రెండింటి మధ్య సాంకేతిక మరియు ఇతర వివరాలు క్లుప్తంగా పోల్చడం జరిగింది.
ధర వివరాలు:
మారుతి సుజుకి వితారా బ్రిజా దాదాపుగా రూ. 7.5 లక్షల నుండి ప్రారంభం కావచ్చు (ఇంకా విడుదల కాలేదు అందాసుగా మాత్రమే.
ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ధర రూ. 7.84 లక్షలు అన్ రోడ్ (ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.
డిజైన్:
ఆధునిక ఎస్‌యువిలకు ఉండాల్సిన డిజైన్ వితారా బ్రిజాకు చక్కగా కల్పించారు. మారుతి సుజుకి వారు యురోపియన్ మార్కెట్లో అమ్ముతున్న వితారా నుండి కొన్ని డిజైన్లు సేకరించి ఇందులో కల్పించారు. మారుతి వారి డిజైన్‌ శైలిలో నూతనంగా దీనికి ముందు వైపున రెండు హెడ్ లైట్ల మధ్యలో అతి పెద్ద క్రోమ్ పూత పూయబడిన ఫ్రంట్ గ్రిల్ అందించారు.

మారుతి సుజుకి వితారా బ్రిజా
ఫోర్డ్ మోటార్స్ వారు తమ ఎకో స్పోర్ట్ ఎస్‌యువిను అంతర్జాతీయ ఫియస్టా బి-సెగ్మెంట్ ఫ్లాట్ మీద డిజైన్ చేశారు. వితారా బ్రిజా తో పోల్చుకుంటే దీనికి ముందు వైపున అతి పెద్ద ఫ్రంట్ గ్రిల్ మరియు న్యారో హెడ్ లైట్లను కల్పించారు. వెనుక వైపున స్పేర్ వీల్ ‌ను అమర్చుకునేందుకు ప్రత్యేకమైన స్లాట్‌ను కల్పించారు. దీని వలన ఇది మరింత స్పోర్టివ్‌గా కనిపిస్తోంది.
ఫోర్డ్ ఎకో స్పోర్ట్

ఇంజన్ మరియు గేర్ బాక్స్ వివరాలు:
మారుతి సుజుకి వారు ఇంతకు మునుపు తమ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారులో పరీక్షించిన 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌ను ఇందులో కల్పించారు. ఈ ఇంజన్ దాదాపుగా 89 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.
మారుతి సుజుకి వితారా బ్రిజా

ఫోర్డ్ తమ ఎకో స్పోర్ట్ ఎస్‌యువిలో రెండు పెట్రోల్ మరియు ఒక్క డీజల్ ఇంజన్‌లను అందించారు. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 110 బిహెచ్‌పి పవర్, 140 ఎన్ఎమ్ టార్క్ మరియు 1.0-లీటర్ ఎకో బూస్ట్ ఇంజన్ 124 బిహెచ్‌పి పవర్, 170 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ మరియు ఇందులోని 1.5-లీటర్ డీజల్ ఇంజన్ దాదాపుగా 99 బిహెచ్‌పి పవర్ మరియు 205 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును.
ఫోర్డ్ ఎకో స్పోర్ట్

ఎకో స్పోర్ట్ ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను కూడా అందుబాటులో ఉంచింది. 1.5-లీటర్ టైటానియమ్ పెట్రోల్ వేరియంట్లో ఆటోమేటిక్ మరియు ఇతర వాటిలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ అందించారు.
ఫీచర్లు:
మారుతి సుజుకి బ్రిజాలో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, కీ లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఆపిల్ కార్ ప్లే గల ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ కలదు.
మారుతి సుజుకి వితారా బ్రిజా

ఎకో స్పోర్ట్ లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్, డ్రైవర్ సీటు ఎత్తును సరిచేసుకునే ఫీచర్లు, ఎలక్ట్రిక్ ద్వారా బాహ్యపు అద్దాలను అడ్జెస్ట్ చేసుకునే అవకాశం మరియు యుఎస్‌బి, ఎయుఎక్స్, బ్లూటూత్ కనెక్టివిటి గల 2-డిఐఎన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ కలదు.
ఫోర్డ్ ఎకో స్పోర్ట్

భద్రత :
ప్రస్తుతం కాలంలో ఎస్‌యులలో భద్రత ఎంతో అవసరం అందుకోసం నూతనంగా విడుదలయ్యే చాలా వరకు సరికొత్త భద్రత ఫీచర్లుతో వస్తున్నాయి. వితారా బ్రిజాలో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు టాప్ ఎండ్ వేరియంట్లో వీటితో పాటు ఎయిర్ బ్యాగు రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగులను అందించారు.
మారుతి సుజుకి వితారా బ్రిజా

ఎకో స్పోర్ట్‌లోని టాప్ ఎండ్ వేరియంట్లో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఫోర్డ్ ఎమర్జెన్సీ అసిస్ట్ వంటి ఫీచర్లు కలవు.
ఫోర్డ్ ఎకో స్పోర్ట్

తీర్పు:
మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యువి అనుకుంటున్నారు ? బ్రిజా తో పోల్చితే ఎకో స్పోర్ట్‌లో మంచి శక్తివంతమైన ఇంజన్ కలదు. అయితే మారుతి సుజుకి దేశ వ్యాప్తంగా విసృతమైన సేవలు అందిస్తోంది. ధర కూడా దాదాపుగా రెండు ఒకే విధంగా ఉన్నాయి. ఫీచర్ల విషయంలో వితారా బ్రిజా కన్నా ఎకో స్పోర్ట్‌లో అధికంగా ఉన్నాయి. అందుకే మా నిర్ణయం ఎకో స్పోర్ట్ ది బెస్ట్...
ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఫోటోలు.....

మారుతి సుజుకి వితారా బ్రిజా ఫోటోలు.....

Most Read Articles

English summary
Maruti Vitara Brezza vs Ford EcoSport Comparison
Story first published: Thursday, February 18, 2016, 11:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X