రెండు నెలల్లో 55,000 ల బుకింగ్‌లు నమోదు చేసుకున్న వితారా బ్రిజా

By Anil

మారుతి సుజుకి ఈ ఏడాది మార్చి నెలలో తమ వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువిని మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం రెండు నెలల కాలంలోనే జపాన్ ఆధారిత కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వారి వితారా బ్రిజా కోసం సుమారుగా 55,000 ల మంది బుకింగ్‌ చేసుకున్నారు. ఊహించని రీతిలో నమోదు చేసుకున్న బుకింగ్స్ కారణంగా వినియోగదారులకు దీనిని అందివ్వడానికి సుమారుగా ఆరు నెలల వరకు వెయిటింగ్ పీరియడ్‌ను ప్రకటించనున్నట్లు తెలిసింది.

రెండు నెలల్లో 55,000 ల బుకింగ్‌లు నమోదు: వితారా బ్రిజా

మారుతి సుజుకి తాజాగా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తున్న దాదాపు అన్ని ఉత్పత్తులు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. అందులో సియాజ్ సెడాన్, బాలెనో హ్యాచ్ బ్యాక్ మరియు వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి. మారుతి మొత్తం అమ్మకాల్లో ఈ మూడింటి వాటా సగానికి పైగా ఉంది.

రెండు నెలల్లో 55,000 ల బుకింగ్‌లు నమోదు: వితారా బ్రిజా

వితారా బ్రిజా ప్రారంభ వేరియంట్ యొక్క ధర రూ. 6.99 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 9.68 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

రెండు నెలల్లో 55,000 ల బుకింగ్‌లు నమోదు: వితారా బ్రిజా

వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మహీంద్రా వారి టియువి300 వాహనాలకు పోటీగా నిలిచింది.

రెండు నెలల్లో 55,000 ల బుకింగ్‌లు నమోదు: వితారా బ్రిజా

ప్రస్తుతం మారుతి సుజుకి ఈ వితారా బ్రిజా వాహనాల ఉత్పత్తిని ఏడాదికి లక్ష యూనిట్లుగా పెంచినట్లు తెలిపింది. అయితే భవిష్యత్తులో వీటి ఉత్పత్తిని 1.2 లక్షల వరకు పెంచనుంది.

రెండు నెలల్లో 55,000 ల బుకింగ్‌లు నమోదు: వితారా బ్రిజా

ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా దీని డెలివరీల కోసం ప్రకటించిన వెయిటింగ్ పీరియడ్ ఓ రెండు నుండి మూడు నెలల వరకు తగ్గనుంది.

రెండు నెలల్లో 55,000 ల బుకింగ్‌లు నమోదు: వితారా బ్రిజా

మారుతి సుజుకి గడిచిన 2016 ఏప్రిల్ అమ్మకాల్లో సుమారుగా 7,832 యూనిట్ల వితారా బ్రిజా అమ్మకాలు జరిపింది.

రెండు నెలల్లో 55,000 ల బుకింగ్‌లు నమోదు: వితారా బ్రిజా

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎదుగుదల బాగా ఉన్న ఎస్‌యువి సెగ్మెంట్లోకి దాదాపుగా అన్ని తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను అందిస్తున్నారు.

రెండు నెలల్లో 55,000 ల బుకింగ్‌లు నమోదు: వితారా బ్రిజా

గరిష్ట మైలేజ్ ఇవ్వగల టాప్-10 డీజల్ ఎస్‌యువి వాహనాలు

Most Read Articles

English summary
Waiting Period For Maruti Vitara Brezza Goes Up By 6 Months
Story first published: Friday, May 27, 2016, 14:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X