విపణిలోకి మిత్సుబిషి మోంటెరో విడుదల: ధర రూ. 67.88 లక్షలు

జపాన్‌ ఆధారిత ప్రముఖ వాహన తయారీ దిగ్గజం మిత్సుబిషి దేశీయ విపణిలోకి తమ మోంటెరో ఎస్‌యువిని రీలాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 67.88 లక్షలుగా ప్రకటించింది. దీని గురించి పూర్తి వివరాలు...

By Anil

జపాన్‌కు చెందిన మిత్సుబిషి మోటార్స్ ఇండియన్ మార్కెట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తమ మోంటెరో ఎస్‌యువిని మళ్లీ విడుదల చేసింది. మరో నెలలో వీటిని డెలివరీకి కూడా సిద్దం చేసినట్లు మిత్సుబిషి తెలిపింది. సరికొత్త మిత్సుబిషి మోంటెరో ఎస్‌యువి ప్రారంభ ధర రూ. 67.88 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

మిత్సుబిషి మోంటెరో ధరలు

మిత్సుబిషి మోంటెరో ధరలు

  • ఢిల్లీ ధర రూ. 67.88 లక్షలు
  • ముంబాయ్ ధర రూ. 71.06 లక్షలు
  • రెండు ధరలు ఎక్స్ షోరూమ్‌గా ఇవ్వబడ్డాయి.
    మిత్సుబిషి మోంటెరో ఎస్‌యువి

    మిత్సుబిషి మోంటెరో ఎస్‌యువిలో 3.2-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల టర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌ను అందించారు.

    మిత్సుబిషి మోంటెరో ఎస్‌యువి

    ఇందులోని శక్తివంతమైన డీజల్ ఇంజన్‌కు 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు. ఇది సుమారుగా 189బిహెచ్‌పి పవర్ మరియు 441ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

    మిత్సుబిషి మోంటెరో ఎస్‌యువి

    మిత్సుబిషి తమ ఆఫ్ రోడింగ్ వాహనాల వారసత్వాన్ని కొనసాగించడానికి సరికొత్త మోంటెరో ఎస్‌యువిలో నాలుగు రకాల డ్రైవింగ్ పద్దతులను పరిచయం చేసింది.

    • 2-వీల్ డ్రైవ్ హై (2హెచ్)
    • 4-వీల్ డ్రైవ్ హై (4హెచ్)
    • సెంటర్ డిఫరెన్షియల్ లాక్ గల 4-వీల్ డ్రైవ్ హై (4హెచ్ఎల్‌సి)
    • సెంటర్ డిఫరెన్షియల్ లాక్ గల 4-వీల్ డ్రైవ్ లో (4ఎల్ఎల్‌సి)
    • మిత్సుబిషి మోంటెరో ఎస్‌యువి

      మిత్సుబిషి ఈ సరికొత్త మోంటెరోని డిజైన్ పరంగా స్వల్ప మార్పులకు గురి చేసింది. ఇందులో రీ డిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్స్, కెమెరా ద్వారా పనిచేసే ఆటో హై బీమ్ ఫంక్షన్, సరికొత్త ఆకర్షణీయమైన పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లను బంపర్‌లో ఇముడింపజేశారు.

      మిత్సుబిషి మోంటెరో ఎస్‌యువి

      ప్రక్క వైపుల నుండి గమనిస్తే మిత్సుబిషి మోంటెరో ఎస్‌యువి కండలు తిరిగిన ఆకృతిని గుర్తించవచ్చు. సరికొత్త బాహ్య వైపు నుండి వెనుక భాగాన్ని గమనించే అద్దాలు మరియు 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

      మిత్సుబిషి మోంటెరో ఎస్‌యువి

      వెనుక వైపున సిల్వర్ రంగుల్లో ఉన్న బంపర్ ప్లేట్ కలదు. ఇందులో ఫాగ్ ల్యాంప్స్‌ను అందించారు. రాత్రి వేళ ప్రయాణానికి వీటిని ఉపయోగించవచ్చు.

      మిత్సుబిషి మోంటెరో ఎస్‌యువి

      మిత్సుబిషి మోంటెరో ఇంటీరియర్‌ డ్యూయల్ టోన్ ప్యానొరమిక్ సన్‌రూఫ్‌ని కలిగి ఉంది. బ్లూటూత్ కనెక్టివిటి గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 860-వాట్, 12-స్పీకర్లు గల రాక్‌ఫోర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

      మిత్సుబిషి మోంటెరో ఎస్‌యువి

      అధునాతన మోంటెరో ఎస్‌యువిలో భద్రత ఫీచర్లు కూడా ఉన్నాయి, అందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, సైడ్ మరియు కర్టన్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు బ్రేక్ అసిస్ట్ గల ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కలదు.

      మిత్సుబిషి మోంటెరో ఎస్‌యువి

      పూర్తి కొత్త ధరలతో మోంటెరో ఎస్‌యువి కంప్లీట్లి బిల్ట్ యూనిట్‌గా అమ్మకాలకు సిద్దం కానుంది.

      మిత్సుబిషి మోంటెరో ఎస్‌యువి

      మిత్సుబిషి మోంటెరో ఎస్‌యువి ఆడి క్యూ7 మరియు వోల్వో ఎక్స్‌సి90 వంటి ఉత్పత్తులకు దేశీయంగా పోటీ ఇవ్వనుంది.

      మిత్సుబిషి మోంటెరో ఎస్‌యువి

      • పాకిస్తాన్‌కు బుజ్జగింపు చర్యలుండవు: ఇక ప్రతిదాడులే...!!
      • బిఎమ్‌డబ్ల్యూ నుండి అత్యంత చౌకైన 125సీసీ బైకు
      • ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లో నిస్సాన్ టెర్రానో విడుదల

Most Read Articles

English summary
Read In Telugu: Mitsubishi Montero Launched In India, Prices Start At Rs. 67.88 Lakh
Story first published: Thursday, November 3, 2016, 10:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X