ఇండియాలో 2016 లో ఉన్న అత్యంత విశ్వసనీయమైన కార్లు: ఇందులో మీ కారు ఉందా...?

By Anil

నమ్మకం మరియు విశ్వసనీయత ఈ రెండు అంశాలు మనం కోనుగోలు చేసే ప్రతి ఉత్పత్తిలో కూడా ఎంతో ముఖ్యం. అదే ఇక కార్లు, బైకు కొంటున్నాం అంటే నలుగురిని అడిగి సక్సెస్ అయ్యిందా లేదా చూసి సవా లక్ష అంశాల గురించి ఆరా తీసి తరువాత కొంటారు. అయినప్పటికీ కొద్ది రోజుల తర్వాత ఏదో ఒక లోపాన్ని గుర్తిస్తారు.

ఇలాంటి సమస్యను అధిగమించడానికి జె.డి పవర్ ఒక సర్వే నిర్వహించింది. రెండున్నర నుండి మూడున్నర ఏళ్ల వయస్సున్న కార్లను స్వయంగా వినియోగిస్తున్న ఓనర్ల నుండి 2016 ఏడాదికి గాను సుమారుగా 9 విభాగాలకు చెందిన కార్లలో తలెత్తే సమస్యల గురించి సర్వే నిర్విహించారు.

2015 ఏడాదిలో సర్వే నిర్వహించి సుమరుగా 100 కార్లలో 206 సమస్యలను గుర్తించారు. అదే ఈ ఏడాదిలో 100 కార్లకు గాను 185 సమస్యలను గుర్తించారు. విశ్వసనీయమైన విభాగంగా చెప్పుకునే ఈ జాబితాలో ఏ కారులో ఎన్ని సమస్యలున్నాయో చూద్దాం రండి.

ఎంట్రీ కాంపాక్ట్ సెగ్మెంట్

ఎంట్రీ కాంపాక్ట్ సెగ్మెంట్

1. మారుతి సుజుకి ఆల్టో 800- భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ కారు మారుతి సుజుకి ఆల్టో 800 కి నిర్వహించిన సర్వేలో 100 ఆల్టో 800 కార్లను పరిశీలించగా అందులో 156 సమస్యలు ఉన్నాయి.

2. టాటా నానో

2. టాటా నానో

టాటా నానోకి నిర్వహించిన సర్వేలో 100 కార్లకు గాను 183 సమస్యలను గుర్తించారు.

3 .హ్యుందాయా ఇయాన్

3 .హ్యుందాయా ఇయాన్

హ్యుందాయ్ మోటార్స్ యొక్క ఎంట్రీ లెవల్ కారు ఇయాన్‌కు నిర్వహించిన సర్వేలో 100 ఇయాన్‌లలో 189 సమస్యలను గుర్తించారు.

కాంపాక్ట్ సెగ్మెంట్

కాంపాక్ట్ సెగ్మెంట్

1. మారుతి సుజుకి ఆల్టో కె10

ఆల్టో కె10 కోసం చేసిన 100 ఆల్టో కె10 కార్లలో వినియోగదారుల నుండి 135 సమస్యలను నమోదు చేసారు, గత ఏడాదిలో నిర్వహించిన సర్వేలో 100 కార్లలో 157 సమస్యలను గుర్తించారు.

2. హ్యుందాయ్ ఐ10

2. హ్యుందాయ్ ఐ10

హ్యుందాయ్ మోటార్స్ వారి బెస్ట్ సెల్లింగ్ కారు హ్యుందాయ్ ఐ10. 100 హ్యుందాయ్ ఐ10 కార్లకు నిర్వహించిన సర్వేలో 158 సమస్యలను నమోదు చేసుకున్నారు.

3. హ్యుందాయ్ శాంట్రో

3. హ్యుందాయ్ శాంట్రో

కొరియాకు చెందిన ఆటోమొబైల్ తయారీ దిగ్గజం హ్యుందాయ్ శాంట్రో కారు ద్వారా ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 100 శాంట్రో కార్లకు నిర్వహించిన సర్వేలో 187 సమస్యలను గుర్తించారు.

అప్పర్ కాంపాక్ట్ సెగ్మెంట్

అప్పర్ కాంపాక్ట్ సెగ్మెంట్

1. హోండా బ్రియో

బ్రియో సర్వే కోసం 100 కార్ల ను ఎంచుకుని వినియోగదారుల నుండి సర్వేలో భాగంగా ఫీడ్ బ్యాక్ కోరగా అందులో మొత్తం మీద 82 సమస్యలను గుర్తించారు సర్వే నిర్వాహకులు.

2. మారుతి సుజుకి రిట్జ్

2. మారుతి సుజుకి రిట్జ్

మారుతి సుజురి వారి 100 రిట్జ్ కార్లకు సర్వే నిర్వహించగా అందులో 97 సమస్యలను గుర్తించారు.

3. టయోటా ఎటియోస్ లివా

3. టయోటా ఎటియోస్ లివా

టయోటా వారి ఎటియోస్ లివా ఈ యేడు మొదటి సారిగా ఇందులో నిలిచింది. 100 ఎటియోస్ లివా కార్లకు నిర్వహించిన సర్వేలో 117 సమస్యలను గుర్తించారు.

ప్రీమియమ్ కాంపాక్ట్ సెగ్మెంట్

ప్రీమియమ్ కాంపాక్ట్ సెగ్మెంట్

1. వోక్స్‌వ్యాగన్ పోలో

2015 లో 100 పోలో కార్లకు నిర్వహించిన సర్వేలో 166 సమస్యలను గుర్తించగా ఈ యేడు 100 పోలో కార్లకు నిర్వహించిన సర్వేలో 136 సమస్యలను గుర్తించారు. మునుపటితో పోల్చితే సమస్యలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

2. హ్యుందాయ్ ఐ20

2. హ్యుందాయ్ ఐ20

ప్రీమియమ్ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌లలో బెస్ట్ సెల్లింగ్ కారు ఐ20 కోసం నిర్విహించిన సర్వేలో 100 కార్లను పరిశీలించగా ఇందులో 173 సమస్యలను గుర్తించారు.

3. మారుతి సుజుకి స్విప్ట్

3. మారుతి సుజుకి స్విప్ట్

గత ఏడాదిలో 100 స్విఫ్ట్ కార్లను సర్వే చేయగా అందులో 187 సమస్యలను గుర్తించారు. ఈ ఏడాది 100 స్విఫ్ట్ కార్లకు సర్వే నిర్వహించగా 197 సమస్యలను గుర్తించారు. మునుపటితో పోల్చుకుంటే సమస్యల సంఖ్య మరింత పెరిగాయి.

ఎంట్రీ మిడ్‌సైజ్ సెగ్మెంట్

ఎంట్రీ మిడ్‌సైజ్ సెగ్మెంట్

1. టయోటా ఎటియోస్

గత ఏడాదితో పోల్చుకుంటే 2016 లో 100 ఎటియోస్ కార్లకు నిర్వహించిన సర్వేలో 116 సమస్యలను గుర్తించారు.

2. హోండా అమేజ్

2. హోండా అమేజ్

100 హోండా అమేజ్ కార్లకు నిర్వహించిన సర్వేలో 130 సమస్యలను గుర్తించారు, దీని రాకతో స్విఫ్ట్ డిజైర్ స్థానం పడిపోయిందని చెప్పవచ్చు.

3. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

3. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి వారి 100 స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌లకు నిర్వహించిన సర్వేలో మొత్తం మీద 240 సమస్యలను గుర్తించారు.

మిడ్‌సైజ్ సెగ్మెంట్

మిడ్‌సైజ్ సెగ్మెంట్

1. స్కోడా ర్యాపిడ్

100 స్కోడా ర్యాపిడ్ కార్లకు నిర్వహించిన సర్వేలో సరిగ్గా 100 సమస్యలను గుర్తించినట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు.

2. హోండా సిటి

2. హోండా సిటి

100 హోండా సిటి కార్లకు సర్వే నిర్వహించగా అందులో 109 సమస్యలను గుర్తించారు. గత ఏడాది నిర్వహించిన సర్వేలో ఏకంగా 146 సమస్యలను గుర్తించారు.

3. వోక్స్‌వ్యాగన్ వెంటో

3. వోక్స్‌వ్యాగన్ వెంటో

వోక్స్‌వ్యాగన్ వారి 100 వెంటో కార్లకు సర్వే నిర్వహించగా 118 సమస్యలను గుర్తించారు.

ఎమ్‌యువి/ఎమ్‌పివి సెగ్మెంట్

ఎమ్‌యువి/ఎమ్‌పివి సెగ్మెంట్

1. టయోటా ఇన్నోవా

టయోటా వారి 100 ఇన్నోవా వాహనాలకు సర్వే నిర్వహించగా మొత్తం మీద 118 సమస్యలను గుర్తించారు. గత ఏడాది కూడా ఇదే తరహాలో నిర్వహించిన సర్వేలో ఈ ఇన్నోవాలో 177 సమస్యలను గుర్తించారు.

2. మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి

2. మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి

మారుతి సుజుకి వారి 100 ఎర్టిగా వాహనాలకు సర్వే నిర్వహించగా మొత్తం మీద 127 సమస్యలను గుర్తించారు.

3. మహీంద్రా జైలో

3. మహీంద్రా జైలో

100 మహీంద్రా జైలో వాహనాలకు నిర్వహించిన సర్వేలో సుమారుగా 245 సమస్యలను గుర్తించారు.

ఎస్‌యువి సెగ్మెంట్

ఎస్‌యువి సెగ్మెంట్

1. మహీంద్రా ఎక్స్‌యువీ500

మహీంద్రా వారి 100 ఎక్స్‌యువీ500 ఎస్‌యువిలకు నిర్వహించిన సర్వేలో సుమారుగా 171 సమస్యలను గుర్తించారు.

2. రెనో డస్టర్

2. రెనో డస్టర్

ఈ ర్యాంకింగ్ విభాగంలోకి కొత్త ఎంటర్ అయిన వాహనం డస్టర్ ఎస్‌యువి. రెనో వారి 100 డస్టర్ ఎస్‌యువిలకు నిర్వహించిన సర్వేలో 194 సమస్యలను గుర్తించారు.

3. మహీంద్రా స్కార్పియో

3. మహీంద్రా స్కార్పియో

మహీంద్రా వారి 100 స్కార్పియో వాహనాలకు నిర్వహించిన సర్వేలో 282 సమస్యలను గుర్తించారు.

సర్వే: 2016లో ఇండియాలో ఉన్న అత్యంత విశ్వసనీయమైన కార్లు

జె.డి పవర్ వారు నిర్వహించిన సర్వే పరంగా ప్రతి వాహనానికి సంభందించిన సమస్యలను వినియోగదారుల నుండి స్వయంగా సేకరించినవి.

Most Read Articles

English summary
Survey: Best Indian Cars With Reliability; Do You Own Any Of These Cars?
Story first published: Friday, July 29, 2016, 15:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X