మేడిన్ ఇండియా మంత్రాన్ని జపించే మోడీగారికి విదేశీ కారెందుకు ?

Written By:

నలుగుర్ని సరైన దారిలో నడిపే నాయకుడు ముందుగా తాను సక్రమ మార్గంలా నడవాల్సి ఉంటుంది. అప్పుడే మార్పు అనేది స్పష్టంగా కనబడుతంది. అచ్చం దీనికి సంభందించిందే ఈ కథనం.

విదేశీ వస్తువుల వాడకాన్ని మరియు దిగుమతిని పూర్తిగా నిలిపేసి తద్వారా విదేశీయాలకు భారతీయ కరెన్సీ ప్రవాహాన్ని అరకట్టాలని భారత గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీగారు దేశీయంగా వస్తు ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం మేడిన్ ఇండియా మరియు మేకిన్ ఇండియా అనే రెండు గొప్ప సూత్రాల్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయించాడు. అయితే దేశీయ ఉత్పత్తుల ఉత్పత్తిని ప్రోత్సహించే మోడీ గారు ఇతర దేశానికి చెందిన బిఎమ్‌డబ్ల్యూ కారునెందుకు ఎందుకు ఉపయోగిస్తున్నాడు ? అనే ప్రశ్న "కోర" అనే ప్రశ్నోత్తరాల వేదిక మీద తీవ్ర దుమారం రేపింది.

సమాధానం విషయానికి వస్తే, ప్రముఖ ప్రశ్నోత్తరాల వేదిక
కోర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు మేకిన్ ఇండియా అంశాన్ని తీవ్రంగా ప్రచారం చేస్తున్నప్పటికీ తనకు ఎంతగానో ఇష్టమైన మహీంద్రా స్కార్పియోను కాకుండా జర్మనీకి చెందిన బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారును ఉపయోగించడం వెనుక మూడు ప్రధాన కారణాలున్నాయని తెలిపింది.

మహీంద్రా స్కార్పియో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) చేత భద్రత పరంగా ఉత్తమ వాహనం అని నిరూపించుకోలేకపోయింది. మరియు బాడీ చాలా ఎత్తుగా ఉండటం వలన ప్రధాన మంత్రిని దుండగులు సులభంగా గుర్తుపట్టే అవకాశం ఉంది. తద్వారా సరాసరిగా ప్రధాన మంత్రి మీదకు దుండగులు కాల్పులు జరిపే అవకాశం ఉంది.

ఇక స్కార్పియోను బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్‌తో పోల్చితే ఇందులో అత్యుత్తమ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఫీచర్ మరియు సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా ఉత్తమంగా ఉంటుంది. అత్యవసర సమయాల్లో అత్యధిక వేగంతో తప్పించుకోవడానికి 7-సిరీస్ కారు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కంటే ప్రదాన మంత్రి అయ్యాక ముప్పు ఎక్కువగా ఉంది. అందుకే ప్రత్యేక భద్రతా దళం మోడీ గారికి బిఎఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ను సూచించింది. అంతర్జాతీయంగా స్కార్పియోతో పోల్చుకుంటే బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ అనేక భద్రత పరీక్షలు పాసయ్యింది.

ప్రధాన మంత్రి భద్రత కోసం ఆర్మ్‌డ్ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఎంపిక ఇప్పటిది కాదు భారత దేశానికి అటల్ బిహారి వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్న కాలం నుండి ప్రభుత్వం ఈ వాహనాన్ని వినియోగిస్తోంది.

మేకిన్ ఇండియా అనే అంశం దగ్గరకు వస్తే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ దేశీయంగా తయారవుతున్నప్పటికీ ప్రత్యేకించి ఇందులో ఫీచర్ల పరంగా చూస్తే దిగుమతి చేసుకోక తప్పడం లేదు. బుల్లెట్ ప్రూఫ్ ను పరీక్షించే విఆర్7 సర్టిఫికేట్ సాధించింది. మందు పాతర్ల దాడులు, ఇంధన ట్యాంక్ లీక్ అవడం ద్వారా జరిగే పేలుడు మరియు తూటాల వర్షాన్ని తిప్పికొట్టడంలో దీనికిదే సాటి.

ఇంజన్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రధాని మంత్రిగారు వినియోగిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ లో 6.0-లీటర్ సామర్థ్యం వి12 ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 544బిహెచ్‌పి పవర్ మరియు 750ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. మరియు దీని గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లుగా ఉంది.

కోర అనే ప్రశ్నోత్తరాల వేదిక మీద ఔత్సాహికుడు అడిగిన ప్రశ్నకు కోర బృందం ఈ విధంగా సమధానం ఇచ్చింది.

Images for referance only

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Narendra Modi Does Not Use A ‘Made In India Car’ — Why?
Please Wait while comments are loading...

Latest Photos