18 ఏళ్ల తర్వాత మారుతి జిమ్నీ మళ్లీ మనముందుకు

By Anil

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థకు ఇండియాలో పేరెంట్ సంస్థగా వ్యవహరిస్తున్న మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త జిమ్నీ సబ్ కాంపాక్ట్ ఎస్‌యువిని విడుదల చేయనుంది. దేశీయ మరియు అంతర్జాతీయ అవసరాల కోసం దీనిని ఇండియాలోనే ఉత్పత్తి చేయనున్నట్లు తెలిసింది.

మారుతి సుజుకి లోని జిమ్నీని ఎంతగానో ఇష్టపడే జిమ్నీ ప్రేమికుల కోసం దీని గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో....

మారుతి సుజుకి జిమ్నీ

మూడవ తరానికి చెందిన జిమ్నీని 1998 నుండి అమ్మకాల్లో ఉంచారు. అయితే 18 ఏళ్ల నుండి ఒకే విధంగా అందుబాటులో ఉంచడం వలన దీనిని అప్‌డేటెడ్ మోడల్‌లో తీసుకురావాలని యురోపియన్ డీలర్లు కోరారు. వారి అభీష్టం మేరకు నాలుగవ తరానికి చెందిన జిమ్నీని అభివృద్ది చేస్తున్నారు.

మారుతి సుజుకి జిమ్నీ

మారుతి సుజుకి సంస్థ ఈ జిన్నీ సబ్ కాంపాక్ట్ ఎస్‌యువి వాహనాన్ని తమ గుజరాత్ తయారీ ప్లాంటులో 2017 నుండి ఉత్పత్తి చేయనున్నారు.

మారుతి సుజుకి జిమ్నీ

మారుతి సుజుకి ఈ జిన్నీని ఇండియన్ మార్కెట్‌తో పాటు యూరోపియన్, ఆగ్నేయ ఆసియా మరియు బ్రెజిల్ దేశాలకు ఎగుమతి చేయనుంది.

మారుతి సుజుకి జిమ్నీ

బాలెనొ మరియు ఇగ్నిస్‌లను అభివృద్ది చేసిన ప్లాట్‌ఫామ్‌లనే ఈ జిమ్నీ రూపకల్పనకు వినియోగించుకుంటునట్లు తెలిసింది.

మారుతి సుజుకి జిమ్నీ

మారుతి సుజుకి ఈ జిమ్నీ సబ్ కాంపాక్ట్ ఎస్‌యువిని హ్యాచ్‌బ్యాక్, ఎస్‌యువి మరియు కూపే వంటి మూడు లక్షణాల మేళవింపుతో రూపొందిస్తోంది.

మారుతి సుజుకి జిమ్నీ

మారుతి సుజుకి నుండి ఇది నాలుగవ తరం జిమ్నీగా మన ముందుకు రానుంది. ఈ నాలుగు జనరేషన్ల లైనప్‌లో ఉన్న రెండవ తరం వాహనం జిప్సీగా మనందరికి బాగా తెలుసు.

మారుతి సుజుకి జిమ్నీ

మారుతి సుజుకి ఈ నయా జిమ్నీ వాహనంలో 4X4 డ్రైవింగ్ సిస్టమ్‌(ఆల్ వీల్ డ్రైవ్) ను స్టాండర్డ్‌గా అందివ్వనుంది.

మారుతి సుజుకి జిమ్నీ

సాంకేతికంగా ఇందులో మారుతి సుజుకి 1.0-లీటర్ బూస్టర్ జెట్ టర్బో ఛార్జ్‌డ్, మూడు సిలిండర్ల ఇంజన్‌ను అందివ్వనుంది. ఈ ఇంజన్ మారుతి సుజుకి అతి త్వరలో విడుదల చేయనున్న బాలెనొ ఆర్ఎస్ మరియు ఇగ్నిస్ కార్లలో కలదు.

మారుతి సుజుకి జిమ్నీ

మరింత శక్తివంతమైన ఇంజన్‌ కోరుకునే వారికి ఇందులో 1.4-లీటర్ టర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను అందివ్వనున్నారు. అంతే కాకుండా ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌తో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

మారుతి సుజుకి జిమ్నీ

మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ ఉద్గారాలను వెదజల్లే విధంగా ఇందులోని ఇంజన్‌లను అభివృద్ది చేస్తున్నారు. రెండు ఇంజన్‌లు కూడా బిఎస్-4 ఉద్గార నియమాలను కూడా ఇవి పాటించనున్నాయి.

మారుతి సుజుకి జిమ్నీ

ఇంతకు మునుపు రెండు డోర్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న దీనిని పొడవు పెంచి నాలుగు డోర్ల వేరియంట్‌గా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌తో సబ్ కాంపాక్ట్ ఎస్‌యువిగా విడుదల కానుంది.

మారుతి సుజుకి జిమ్నీ

ఇక దీని పేరు విషయానికి వస్తే జిమ్నీకి బదులుగుగా సమురాయ్ లేదా జిమ్నీని జిప్సీ ట్యాగ్ లైన్‌తో అందించే ఆలోచనలో మారుతి సుజుకి తర్జనభర్జన పడుతోంది.

మారుతి సుజుకి జిమ్నీ

ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ మారుతి సుజుకి వారి జిప్సీలనే వినియోగిస్తోంది. కారణాలు ఇవే...!!

Most Read Articles

English summary
Next-Gen Jimny SUV Might Be Made In India
Story first published: Thursday, July 28, 2016, 11:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X