విపణిలోకి విడుదలైన నిస్సాన్ జిటి-ఆర్: ధర రూ. 1.99 కోట్లు

నిస్సాన్‌ గాడ్జిల్లాగా చెప్పుకునే జిటి-ఆర్ (Nissan GT-R) సూపర్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. 2017 నిస్సాన్ జిటి-ఆర్ గురించి పూర్తి వివరాలు...

By Anil

జపాన్‌కు చెందిన ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియన్ మార్కెట్లోకి 2017 జిటి-ఆర్ సూపర్ కారును విడుదల చేసింది. ఈ నిస్సాన్ జిటి-ఆర్ సూపర్ కారు ప్రారంభ ధర రూ. 1.99 కోట్లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు సంస్థ తెలిపింది.

నిస్సాన్ జిటి-ఆర్

నిస్సాన్ జిటి-ఆర్ లో 3.8-లీటర్ సామర్థ్యం గల ట్విన్ టుర్బో చార్జ్‌డ్ వి6 ఇంజన్ కలదు, ఇది 6,800ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 562బిహెచ్‌పి పవర్ మరియు 3,600 నుండి 5,800ఆర్‌పిఎమ్ మధ్యన 637ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

నిస్సాన్ జిటి-ఆర్

నిస్సాన్ గాడ్జిల్లా ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ మొత్తం 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు అందుతుంది. పరిమాణం పరంగా చూడటానికి భారీగా ఉన్నప్పటికీ దీని బరువు 1752కిలోలుగా ఉంది.

నిస్సాన్ జిటి-ఆర్

గాడ్జిల్లా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కలిగి ఉండటం ద్వారా 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3 సెకండ్లలోనే అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 315 కిలోమీటర్లుగా ఉంది.

నిస్సాన్ జిటి-ఆర్

నిస్సాన్ దేశీయ సూపర్ కార్ల విపణలోకి విడుదల చేసిన జిటి-ఆర్ కొలతల పరంగా పొడవు 4,710ఎమ్ఎమ్, వెడల్పు 1,895ఎమ్ఎమ్, ఎత్తు 1,370ఎమ్ఎమ్ మరియు 2,780ఎమ్ఎమ్ వీల్ బేస్ ను కలిగి ఉంది.

నిస్సాన్ జిటి-ఆర్

నిస్సాన్ జిటి-ఆర్ ను ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. దానితో ఇప్పుడు విడుదలైన జిటి-ఆర్ ఫ్రంట్ డిజైన్‌‌తో పోల్చుకుంటే చాలా వరకు రీజైన్ చేయబడింది.

నిస్సాన్ జిటి-ఆర్

ఫ్రంట్ డిజైన్‌లో నిస్సాన్ ట్రేడ్‌మార్క్‌ను కలిగి ఉన్న మట్టీ బ్లాక్ వి మోషన్ గ్రిల్ కలదు. దానికి క్రిందగా పెద్ద పరిమాణం గాలిని గ్రహించే విధంగా ఉన్న ఎయిర్ ఇంటేకర్ కలదు. ఫ్రంట్ బంపర్‌కు ఇరువైపులా ఫాగ్ ల్యాంప్స్ మరియు ఎల్‌ఇడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ కలవు.

నిస్సాన్ జిటి-ఆర్

నాలుగు అల్లాయ్ వీల్స్ కూడా ఆంగ్లపు వై ఆకారంలో ఉన్న స్పోక్స్ కలవు 20-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్‌కు ముందు వైపున 255/40 ఆర్20 మరియు వెనుక వైపున 285/35 ఆర్20 టైర్లు కలవు.

నిస్సాన్ జిటి-ఆర్

వెనుక నుండి దీనిని చూడగానే గాడ్జిల్లా అని గుర్తించేందుకు నిస్సాన్ ట్రేడ్ మార్క్ మరియు గుండ్రటి ఆకారంలో ఉన్న టెయిల్ ల్యాంప్స్ ఎంతగానో సహకరిస్తాయి. బ్యాక్ సైడ్ డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా చూపేందుకు ఆధునిక స్పాయిలర్ (డిక్కీ డోర్ మీద ఉన్న నిర్మాణం) మరియు క్రింది వైపున బంపర్‌లో ఇరువైపులా రెండేసి చెప్పున మొత్తం నాలుగు సైలెన్సర్ గొట్టాలున్నాయి.

నిస్సాన్ జిటి-ఆర్

ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే బ్లాక్, రెడ్, ఇవోరీ రంగులతో పాటు టాన్ టూరింగ్ లెథర్ తో సీట్లు మరియు ఇంటీరియర్ పై కప్పు డిజైన్ చేశారు. ఇంటీరియర్ లోని అన్ని భాగాలను ప్రీమియమ్ క్వాలిటీ గల మెటీరియల్స్‌తో డిజైన్ చేశారు.

నిస్సాన్ జిటి-ఆర్

ఇంటీరియర్‌లో అత్యాధునిక ప్రమాణాలతో కూడిన ఫీచర్లున్నాయి. సెంటర్ కన్సోల్ మీద అనేక బటన్ కంట్రోల్స్ కలవు. 8-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ డిస్ల్పే కలదు. ఇందులో కారు పనితీరుకు సంభందించిన అనేక వివరాలను తెలుసుకోవచ్చు.

నిస్సాన్ జిటి-ఆర్

గాడ్జిల్లా ఇంటీరియర్ ఫ్రంట్ క్యాబిన్ విమానంలోని పైలట్ క్యాబిన్‌ను తలపిస్తుంది. 11 స్పీకర్ల అనుసంధానం గల బోస్ ఆడియో సిస్టమ్, రియర్ వీవ్యూ కెమెరా, అదనపు కంట్రోల్స్ గల గేర్‌షిప్టర్ విభాగం ఇందులో ఉన్నాయి.

నిస్సాన్ జిటి-ఆర్

స్టీరింగ్ మీద నిర్మించిన అనేక నియంత్రికలు ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో పెడల్స్ షిఫ్టర్స్ కోసం ఒక బటన్ కేటాయించారు. దీని ద్వారా వేగంగా గేర్లను మార్చవచ్చు.

నిస్సాన్ జిటి-ఆర్

నిస్సాన్ జిటి-ఆర్ సూపర్ కారు ఏడు విభిన్న రంగుల్లో లభిస్తుంది. అవి, కట్సురా ఆరేంజ్, పియర్ల్ బ్లాక్, గన్ మెటాలిక్, అల్టిమేట్ సిల్వర్, డేటోనా బ్లూ, వైబ్రెంట్ రెడ్, మరియు స్టార్మ్ వైట్.

నిస్సాన్ జిటి-ఆర్

  • మేడిన్ ఇండియా మంత్రాన్ని జపించే మోడీగారికి విదేశీ కారెందుకు?
  • ఆరు లక్షలకే బెంజ్ కారా ఇదెలా సాధ్యం ?
  • రూ. 2,50,000 ల వరకు డిస్కౌంట్లు ప్రకటించిన హ్యుందాయ్

Most Read Articles

English summary
Nissan GT-R Launched In India; Priced At Rs 1.99 Crore — Godzilla Is Here
Story first published: Saturday, December 3, 2016, 11:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X