భారీగా పెరిగిన చమురు ధరలు

Written By:

గత రెండు నెలలుగా కొద్ది కొద్దిగా తగ్గతూ వచ్చిన ఇంధన ధరలు క్రితం రోజున ఏకంగా భారీ మొత్తంలో పెరిగాయి. పెట్రోల్ మీద రూ. 3.38 లు మరియు డీజల్ మీద రూ. 2.67 లు పెరిగాయి. అయితే పెరిగిన ఈ ధరలు దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 1, 2016 తెల్లవారుజాము నుండి అందుబాటులోకి వచ్చాయి.


ఇంధన ధరలు పెంపునకు గురైన తరువాత దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 63.47 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 52.94 లు గా ఉన్నాయి. అంతర్జాతీయ చమురు ధరలు 13 శాతం మేర పెరిగినందు వలన దేశీయంగా ఇంధన ధరలు పెరిగాయి.
Also Read: ఒక్క సారి ఛార్జింగ్‌తో 100 కిమీలు నడిచే ఎలక్ట్రిక్ సైకిల్
ప్రభుత్వ రంగ దేశీయ చమురు సంస్థలు ఈ ఇంధన ధరల పెరుగుదల గురించి స్పందిస్తూ అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు మీద సుమారు 13 శాతం ధర పెరిందని తద్వారా ధరలు పెరిగాయని తెలిపాయి. చివరి సారిగా సవరించబడిన ఇంధన ధరలలో పెట్రోల్ మీద రూ. 1 మరియు డీజల్ మీద రూ. 2 లు తగ్గాయి. అయితే ప్రతి 15 రోజులకు ఒక సారి ఇంధన ధరలో హెచ్చు తగ్గులు రావడాన్ని మనం గమనించవచ్చు.

Story first published: Thursday, September 1, 2016, 10:46 [IST]
English summary
Petrol & Diesel Prices Hiked By Rs. 3.38/Litre And Rs. 2.67/Litre Respectively
Please Wait while comments are loading...

Latest Photos