క్విడ్ 1.0-లీటర్ ను విడుదల చేసిన రెనో: ధర మరియు ఇతర వివరాలు

By Anil

రెనో క్విడ్ సంభరాలు మొదలయ్యాయి అని చెప్పాలి. డస్టర్ మరియు క్విడ్ ఉత్పత్తులు భారీ విజయం సాధించిన తరువాత రెనో నుండి విడుదలైన తరువాత వచ్చిన ఉత్పత్తి క్విడ్ 1.0-లీటర్ (1000సీసీ). అవును దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న క్విడ్ 1.0-లీటర్ కారును రెనో నేడు (22 ఆగష్టు 2016) విడుదల చేసింది.

క్విడ్ 1.0-లీటర్ ధర మరియు ఇతర విడుదల వివరాలు వివరంగా క్రింది కథనంలో.....

విడుదల

విడుదల

ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ భారతీయ వినియోగదారులకు ఏవిధమైన ఉత్పత్తులు కావాలో అనే విషయాన్ని సరిగ్గా పసిగట్టిందని తమ క్విడ్ 1.0-లీటర్ కారు విడుదలతో స్పష్టం చేసింది.

వేరియంట్లు

వేరియంట్లు

రెనో ఇండియా తమ క్విడ్ 1.0-లీటర్ ను ఆర్ఎక్స్‌టి మరియు ఆర్ఎక్స్‌టి (ఒ) అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది.

ధరలు

ధరలు

  • క్విడ్ 1.0-లీటర్ ఆర్ఎక్స్‌టి ధర రూ. 3,82,776 లు
  • క్విడ్ 1.0-లీటర్ ఆర్ఎక్స్‌టి(ఒ) ధర రూ. 3,95,776 లు
  • రెండు ధరలు ఎక్స్ షోరూమ్‌గా ఉన్నాయి.
    మార్పులు

    మార్పులు

    మునుపటి క్విడ్ (800సీసీ) తో పోల్చుకుంటే డిజైన్ పరంగా మరియు బాడీ స్ట్రక్చర్ పరంగా ఏ విధమైన మార్పులు చోటు చేసుకోలేదు అయితే. డ్యూయల్ టోన్ రంగుల్లో గల ఓఆర్‌విఎమ్స్ మరియు సైడ్ డోర్ల మీద ప్రత్యేకమైన డీకాల్స్ కలవు.

     ఇంజన్

    ఇంజన్

    రెనో ఇండియా తమ క్విడ్ 1.0-లీటర్ లో 993సీసీ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను అందించారు.

    పవర్ మరియు టార్క్

    పవర్ మరియు టార్క్

    క్విడ్ 1.0-లీటర్ లోని ఇంజన్ సుమారుగా 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

    ట్రాన్స్‌మిషన్

    ట్రాన్స్‌మిషన్

    ఇందులోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. మరియు త్వరలో ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను పరిచయం చేయనున్నారు.

    మైలేజ్

    మైలేజ్

    మైలేజ్ పరంగా చూస్తే క్విడ్ 1.0-లీటర్ సుమారుగా 23.01 కిమీ/లీ మైలేజ్ ఇవ్వగలదు.

    టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే

    టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే

    రెనో ఈ 1000సీసీ ఇంజన్ ను క్విడ్ లోని కేవలం ఆర్ఎక్స్‌టి మరియు ఆర్ఎక్స్‌టి(ఒ) వేరియంట్లలో మాత్రమే పరిచయం చేసారు. కారణం ఈ రెండు వేరియంట్లలో మీడియానవ్, టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, న్యావిగేషన్, గేర్ షిప్ట్ ఇండికేటర్, ఫెండర్ క్లాడింగ్ మరియు సెంటర్ లాకింగ్ వంటి ఫీచర్లు కలవు.

    క్విడ్ 1.0-లీటర్ ను విడుదల చేసిన రెనో

    క్విడ్ 1.0-లీటర్ లో 300 లీటర్ల సామర్థ్యం ఉన్న బూట్ స్పేస్ కలదు మరియు 180ఎమ్ఎమ్ గరిష్ట గ్రౌండ్ క్లియరెన్స్ కలదు.

    భద్రత

    భద్రత

    భద్రత పరంగా ఇందులో ఆప్షనల్ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ప్రిటెన్షనర్లు గల సీట్ బెల్ట్ మరియు లోడ్ లిమిట్ ఇండికేటర్ కలదు. అయితే ఇందులో యాంటి లాక్ బ్రేకిగ్ సిస్టమ్ రాలేకపోయింది.

    పోటీ

    పోటీ

    ఈ రెనో క్విడ్ 1.0-లీటర్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న ఆల్టో కె10, హ్యుందాయ్ ఇయాన్, వ్యాగన్ ఆర్ మరియు సెలెరియో వంటి ఉత్పత్తులకు పోటీగా నిలవనుంది.

    క్విడ్ 1.0-లీటర్ ను విడుదల చేసిన రెనో

    • పెట్రోల్ కార్లు మైలేజ్ రావు అనే వారికి సరైన సమధానం...!!
    • క్విడ్ 1.0-లీటర్ ను విడుదల చేసిన రెనో

      • డాట్సన్ రెడి గో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ...!!

Most Read Articles

English summary
Renault Launches The 1-Litre Kwid Model In India
Story first published: Monday, August 22, 2016, 18:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X