ఏఎమ్‌టి, 1.0-లీటర్ ఇంజన్ వంటి మార్పులతో వచ్చిన సరికొత్త రెనో క్విడ్

By Anil

రెనో ఇండియా ఢిల్లీలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద 1.0-లీటర్ కెపాసిటి గల ఇంజన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్స్ లను కలిగిన సరికొత్త క్విడ్ కారును ప్రదర్శించింది.

రెనో క్విడ్

రెనో వారి నూతన క్విడ్ ఫోటోలు:

సాంకేతిక వివరాలు:
రెనో క్విడ్ కారు ఇంతకు ముందు 1.0-లీటర్ కన్నా తక్కువ కెపాసిటి గల ఇంజన్‌తో లభ్యమయ్యేది. అయితే రెనో వారు ఈ క్విడ్‌ కారులో మరొక ఇంజన్‌ను కల్పించారు. క్విడ్ కారులో సరికొత్త 1.0-లీటర్ కెపాసిటి గల స్మార్ట్ కంట్రోల్ ఎఫిషియన్సీ గల ఇంజన్‌ను అందించారు. అయితే ఈ 1.0-లీటర్ ఇంజన్ విడుదల చేసే పవర్, టార్క్ మరియు మైలేజ్ వంటి వివరాలను విడుదల చేయలేదు.

సరికొత్త ఇంజన్‌తో పాటు క్విడ్ కారు నూతన గేర్ బాక్స్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఇంజన్‌కు ఈజీ-ఆర్ గేర్ షిఫ్ట్ పేరుతో పిలవబడే 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌‌ను అందించారు. ఈ సందర్బంగా దీనిని పార్ములా వన్ లోని గేర్ బాక్స్ స్పూర్తితో రూపొందించినట్లు తెలిపారు. ఈ 1.0-లీటర్ ఇంజన్ గల క్విడ్ కారు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడా అందుబాటులో ఉండనుంది.

డిజైన్:
కారు చిన్నదైనా పెద్దదైనా వినియోగదారులు డిజైన్‌కు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. దీనికి ఉదాహరణ రెనో ఇండియా గత ఏడాదిలో విడుదల చేసిన 800సీసీ క్విడ్ కారు, దీని డిజైన్‌ క్విడ్ భారీ అమ్మకాలకు కారణం అని ఎంతో మంది వినియోగదారులు తెలిపారు. అందుకోసం రెనో ఎక్కడ కూడా పెద్ద పెద్ద మార్పులు చేయకుండా అచ్చం క్విడ్ 800 సీసీ కారు డిజైన్ కల్పించారు.

800సీసీ క్విడ్ కారును అద్దం ముందు పెడితే అద్దంలో కనబడే రెండవ రూపాన్ని క్విడ్ 1.0-లీటర్ కారు అని చెప్పవచ్చు. అయితే 1.0 లీటర్ మరియు ఈజీ-ఆర్ అనే బ్యాడ్జింగ్‌లను కారు డోర్ల మీద మరియు వెనుకవైపున ప్రింట్ చేశారు.
Also Read: బాలెనొ ఆర్‌ఎస్ తో కొత్త ప్రళయాన్ని సృష్టించనున్న మారుతి సుజుకి
కొత్త రూపం, కొత్త ఫీచర్లు:

ఏఎమ్‌టి వేరియంట్లో వచ్చిన 1.0-లీటర్ క్విడ్ కారులో కారు డ్రైవ్‌కి చెందిన డయల్ ప్యాడ్‌ను డ్యాష్‌బోర్డ్‌లో కల్పించారు. దీని ద్వారా కారుకు కావాల్సిన న్యూట్రల్, డ్రైవ్ మరియు రివర్స్ వంటి ఆప్షన్‌లను ఇవ్వవచ్చు. ఈ డ్రైవ్ డయల్ ఫీచర్‌ను 4.1-అంగుళాల పరిమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్ తాకే తెర కలదు. వీటితో పాటు ఎ/సి నియంత్రణలను ఇందులో కల్పించారు.
Also Read: టాటా మోటార్స్ ఆశాకిరణం నెక్సాన్ మిని ఎస్‌యువి
మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది?

రెనో ఇండియా 1.0-లీటర్ కెపాసిటి గల ఇంజన్ మరియు మ్యాన్యువల్, ఈజీ-ఆర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ గల క్విడ్ కార్లను ఈ ఏడాది చివరిక్లలా షోరూమ్‌లలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సరికొత్త 1.0-లీటర్ క్విడ్ కారు మారుతి సుజుకి వారి ఆల్టో కె10 కు పోటిగా నిలవనుంది.

Most Read Articles

English summary
2016 Auto Expo: Renault Kwid Gets A New 1-Litre Engine And AMT Gearbox
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X