ఆధిపత్యం కోసం పోరాటం: రెనో క్విడ్ ఏఎమ్‌టి వర్సెస్ మారుతి సెలెరియో ఏఎమ్‌టి

By Anil

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన గల కార్లను భారతీయులు ఇప్పుడు అధికంగా ఇష్టపడుతున్నారు. మారుతి వారు ఆటోమేటిక్ వేరియంట్లో విడుదల చేసిన 1.0 లీటర్ సెలెరియో ఏఎమ్‌టి తటస్థ అమ్మకాలను సాధిస్తోంది. ఆటోమేటిక్‌ కార్లకు మంచి భవిష్యత్తు అనడానికి గల నిదర్శనం సెలెరియో ఏఎమ్‌టి.

ప్రస్తుతం ఉన్న పోటీలో సెలెరియోకు సరితూగే ఉత్పత్తిని అభవృద్ది చేయడం అంత సులభం కాదు. కాని రెనో ఇండియా వారు తమ క్విడ్‌ను 1.0 లీటర్‌ ఆటోమేటి‌క్ వేరియంట్‌ను పూర్తి స్థాయిలో తయారు చేశారు. ఆల్టో800 ను లక్ష్యం చేసుకుని రెనో అందుబాటులోకి తీసుకువచ్చిన క్విడ్ 800 విజయం సాధించిన నేపథ్యంలో ఈ క్విడ్ 1.0 లీటర్‌ను సిద్దం చేసింది.
Also Read: నిన్న కాక మొన్న వచ్చింది, మారుతి సుజుకి డిజైర్‌ను పడగొట్టింది
రెనో క్విడ్ 1.0 లీటర్ ఆటోమేటిక్ మరియు సెలెరియో 1.0 లీటర్ ఆటోమేటిక్ మధ్య గల తేడాలను క్రింది కథనం ద్వారా స్పష్టంగా తెలుసుకుందాం రండి.

రెనో క్విడ్ ఏఎమ్‌టి డిజైన్

రెనో క్విడ్ ఏఎమ్‌టి డిజైన్

రెనో సంస్థ తమ క్విడ్‌ను బోల్డ్‌గా మరియు పూర్తిగా ఎస్‌యువి లుక్‌తో అభివృద్ది చేశారు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న ఎస్‌యువి సెగ్మెంట్ ఊహించిన అమ్మకాలను నమోదు చేసుకుంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని క్విడ్‌ను రూపొందిస్తున్నారు. 0.8 లీటర్‌ క్విడ్‌ కూడా ఇదే కారణంతో విజయం సాధించింది.

మారుతి సెలెరియో ఏఎమ్‌టి

మారుతి సెలెరియో ఏఎమ్‌టి

మారుతి వారు ఆల్టో‌ను ఆధారం చేసుకుని సెలెరియోను డిజైన్‌ చేసినప్పటికీ ఎంతో శుభ్రమైన ఫ్రంట్ లుక్ మరియు క్యాబిన్ పరంగా ఫ్యామిలీ కలెక్షన్ కారుగా నిలిచింది. భారీ విజయం సాధించిన సెలెరియో డిజైన్ గురించి పేరు పెట్టడానికి ఏమీ లేదు,. కాని కొత్త మరియు యువ వినియోగదారులకు ఇది అవుట్ డెటెడ్ డిజైన్ అనే భావనను పుట్టిస్తుంది.

క్విడ్ ఏఎమ్‌టి ఇంటీరియర్

క్విడ్ ఏఎమ్‌టి ఇంటీరియర్

రెనో క్విడ్ ఆటోమేటిక్‌లోని ఇంటీరియర్ ఎంతో అధునాతనంగా ఉంది. పెద్ద సెంటర్ కన్సోల్ , తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, రౌండ్ డిజైన్‌లో ఉన్న కంట్రోల్స్ మరియు గేర్‌బాక్స్ జాగ్రత్తగా ఉండేందుకు ఆర్-షిఫ్ట్ డయల్ గేర్ నాబ్ కలదు.

రెనో క్విడ్ ఏఎమ్‌టి వర్సెస్ మారుతి సెలెరియో ఏఎమ్‌టి

ఇంటీరియర్ లోపల వెనక వైపున ఉన్న ప్యాసింజర్ విభాగం పెద్దగా నచ్చకపోవచ్చు. తక్కువ లెగ్ రూమ్ మరియు పెద్దగా క్యాబిన్ స్పేస్ లేకపోవడం. అయితే చెల్లించే ధరకు సరైన న్యాయం చేసే ఉత్పత్తి ఇది. ఎస్‌యువి రూపంలో ఉండటం వలన దీని శ్రేణిలో ఉన్న మిగతా ఉత్పత్తుల కన్నా ఇది ఉత్తమం.

సెలెరియో ఏఎమ్‌టి ఇంటీరియర్

సెలెరియో ఏఎమ్‌టి ఇంటీరియర్

సెలెరియో ఆటోమేటిక్‌లో ఆంగ్లపు యు ఆకారంలో ఉన్న సెంటర్ కన్సోల్ కలదు. ఏ/సి నియంత్రికలు మరియు ఆడియో వ్యవస్థను ఇందులో ఇముడింప చేశారు. ప్రత్యేకమైన అనుభూతిని కలిగించే డ్యూయల్ టోన్ ఫ్యాబ్రిక్ ఇంటీరియర్ కలదు మరియు గేర్‌నాబ్ కూడా సరైన్ ఎత్తులో అందించారు.

రెనో క్విడ్ ఏఎమ్‌టి వర్సెస్ మారుతి సెలెరియో ఏఎమ్‌టి

సెలెరియోలోని క్యాబిన్ వెనుక భాగం గురించి చర్చించుకుంటే లెగ్ రూమ్ మరియు హెడ్ రూమ్ ఎంతో సౌకర్యవంతంగా విశాలంగా ఉంటుంది. మొత్తం క్యాబిన్‌లో స్పేస్ పరంగా ఎటువంటి అసౌకర్యం ఉండదు. క్యాబిన్ స్పేస్ పరంగా క్విడ్‌‌తో పోల్చుకుంటే సెలెరియో బాగానే ఉంటుంది.

క్విడ్ ఏఎమ్‌టి సాంకేతిక వివరాలు

క్విడ్ ఏఎమ్‌టి సాంకేతిక వివరాలు

రెనో సంస్థ ఈ క్విడ్‌ ఆటోమేటిక్‌లో 1.0 లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తున్నారు. ఇది సుమారుగా 65 బిహెచ్‌పి పవర్ మరియు 85ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

రెనో క్విడ్ ఏఎమ్‌టి వర్సెస్ మారుతి సెలెరియో ఏఎమ్‌టి

రెనో ఎఫ్1 బృందం ప్రత్యేకంగా రెనో క్విడ్ 1.0 లీటర్‌ వేరియంట్ కోసం ఆర్-షిఫ్ట్ రౌండ్ గేర్ నాబ్ ను అభివృద్ది చేశారు. ఇది 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌కు అనుసంధానమై ఉంటుంది.

సెలెరియో ఏఎమ్‌టి సాంకేతిక వివరాలు

సెలెరియో ఏఎమ్‌టి సాంకేతిక వివరాలు

మారుతి వారు తమ సెలెరియో ఆటోమేటిక్ వేరియంట్లో 1.0 లీటర్ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను అందించారు. ఇది సుమారుగా 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రెనో క్విడ్ ఏఎమ్‌టి వర్సెస్ మారుతి సెలెరియో ఏఎమ్‌టి

మారుతి సుజుకి తమ సెలెరియో 1.0 లీటర్ ఏఎమ్‌టి వేరియంట్లో 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు. మారుతి ఈ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ (AMT)ను ఆటో గేర్ షిప్ట్ (AGS) అని పిలుస్తుంది.

క్విడ్ ఆటోమేటిక్ లోని ముఖ్యమైన ఫీచర్లు

క్విడ్ ఆటోమేటిక్ లోని ముఖ్యమైన ఫీచర్లు

క్విడ్ ఆటోమేటిక్‌లో 7-అంగుళాల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, బ్లూటూత్ కనెక్టివిటి, హ్యాండ్స్ ఫ్రీ టెలిఫోని, యుఎస్‌బి, ఏయుఎక్స్ మరియు రేడియో వంటి వినోదాత్మకమైన ఫీచర్లతో పాటు అత్యంత ముఖ్యమైన న్యావిగేషన్ సిస్టమ్ కలదు. గుండ్రంగ తిప్పే విధంగా ఉన్న గేర్ షిఫ్టర్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

సెలెరియో ఆటోమేటిక్‌లోని ముఖ్యమైన ఫీచర్లు

సెలెరియో ఆటోమేటిక్‌లోని ముఖ్యమైన ఫీచర్లు

మారుతి తమ సెలెరియో ఏఎమ్‌టిలో 2-డిఐఎన్ ఆడియో సిస్టమ్, యుఎస్‌బి, ఏయుఎక్స్ మరియు బ్లూటూత్ కనెక్టివి, స్టీరింగ్ ఆధారిత ఆడియో నియంత్రికలు, ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు టిల్ట్ అడ్జెస్టబుల్ స్టీరింగ్ వీల్ కలదు.

రెండింటిలోని ఫీచర్ల మధ్య గల వ్యత్యాసం

రెండింటిలోని ఫీచర్ల మధ్య గల వ్యత్యాసం

మారుతి సెలెరియోలోని అధునాతనమైన తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు న్యావిగేషన్ వ్యవస్థ లేదు. ఇలాంటి ఫీచర్లు వ్యక్తిగత ఇష్టం మీద ఆధారపడి ఉంటాయి. అదే విధంగా క్విడ్‌లో ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, స్టీరింగ్ ఆధారిత ఆడియో నియంత్రికలు మరియు టిల్ట్ అడ్జెస్టబుల్ స్టీరింగ్ వీల్ వంటి అతి ముఖ్యమైన ఫీచర్లతో రాలేకపోయింది. అయితే క్విడ్ 1.0 లీటర్ విడుదల సమయానికి వీటిని కూడా అందించే అవకాశాలు ఉన్నాయి.

క్విడ్ ఆటోమేటిక్ లోని భద్రత ఫీచర్లు

క్విడ్ ఆటోమేటిక్ లోని భద్రత ఫీచర్లు

ప్రస్తుతం క్విడ్ 800సీసీ వేరియంట్లో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ మాత్రమే కలదు. కాని 1.0 లీటర్ వేరియంట్ విడుదలయ్యేనాటికి ఫ్రంట్ సైడ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్‌ను కూడా అందించనున్నారు.

సెలెరియో ఆటోమేటిక్‌లోని భద్రత ఫీచర్లు

సెలెరియో ఆటోమేటిక్‌లోని భద్రత ఫీచర్లు

సెలరియో అన్నింటి పరంగా క్విడ్‌తో పోటి పడుతూ వచ్చినప్పటికీ ఒక్క ఎయిర్ బ్యాగు కూడా ఇందులో లేదు. కొ న్ని భద్రత పరమైన ఫీచర్లు ఉన్నప్పటికీ అవి కూడా సెలెరియోలోని టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే అందించారు.

తీర్పు

తీర్పు

ఇంటీరియర్ అంశాల పరంగా చూసుకుంటే భద్రత, క్యాబిన్ స్పేస్ మరియు ఫీచర్ల పరంగా క్విడ్ 1.0 లీటర్ ఆటోమేటిక్ ఎంతో ఉత్తమంగా ఉంటుంది మరియు ధరకు తగ్గ ఉత్పత్తి అనే తృప్తి లభిస్తుంది.

విసృత స్థాయిలో ఉన్న మారుతి సామ్రాజ్యం, ఐదు కలిసి సౌకర్యవంతంగా ప్రయాణించే వీలున్న ఫ్యామిలీ కారు మరియు మంచి రీసేల్ వ్యాల్యూ వంటి అంశాల పరంగా దీనిని ఎంచుకోవచ్చు.

రెనో క్విడ్ ఏఎమ్‌టి వర్సెస్ మారుతి సెలెరియో ఏఎమ్‌టి

గమనిక: రెనో ఇండియా క్విడ్ 1.0 లీటర్ ఏఎమ్‌టిని ఇంకా విడుదల చేయలేదు, రెనో వారు దీని గురించి వెల్లడించిన సమాచారం మేరకు ఈ కంపారిజన్ అందివ్వడం జరిగింది.

ఈ కథనం మీద మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి....

రెనో క్విడ్ ఏఎమ్‌టి వర్సెస్ మారుతి సెలెరియో ఏఎమ్‌టి

  • క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి వర్సెస్ ఆల్టో కె10 ఏఎమ్‌టి : మరింత చదవండి

Most Read Articles

English summary
Battle For Supremacy — Renault Kwid AMT vs Maruti Celerio AMT
Story first published: Friday, July 15, 2016, 13:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X