1,388 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 33 లీటర్ల డీజల్‌తో ఛేదించిన రెనో లాజీ

Written By:

ఎక్కువ మైలేజ్ ఇవ్వగల కార్లు ఏవంటే మార్కెట్లో ఉన్న వాటిని వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. కాని లీటర్‌కు 40 కన్నా ఎక్కువ కిలోమీటర్లు ఇవ్వగల కార్లు ఉన్నాయా అంటే ఇక అందరూ మౌనం అయిపోతారు. కాని భారతీయు రోడ్ల మీద తరచూ తిరగాడుతూ ఉండే కారు లీటర్‌కు 42 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదని నిరూపించారు. దీని కోసం రెనో లాజీ కారును వినియోగించారు. వీరు ఎలా దీనిని నడిపారో క్రింది కథనంలోఅ అందించాము వాటిని పాటించండి మీరు కూడా ఇదే తరహా మైలేజ్‌ను పొందండి.

మైలేజ్ పరీక్షకు జరిపిన వివరాలు
మొత్త దూరం: 1388 కిలోమీటర్లు
రహదారి: ఢిల్లీ-ముంబాయ్
మొత్తం ఇంధనం వినియోగం: 32.91 లీటర్లు
నిరూపించబడిన మైలేజ్: లీటర్‌కు 42 కిలోమీటర్లు

ఈ చారిత్రక యాత్ర కోసం రెనో వారి లాజీ ఎమ్‌పివి వాహనాన్ని వినియోగించుకున్నారు. ఇంతటి మైలేజ్‌ను తీసుకురావడం కోసం ఇందులోని ఇంజన్‌లో ఎటువంటి మెకానికల్ మార్పులు జరగలేదు.

ఈ లాజీ వాహనం చూడటానికి భారీగా ఉన్నట్లు కనిపించినప్పటికీ ఇందులో కేవలం డ్రైవర్‌ను మాత్రమే అనుమతించారు మరియు ఇందులో ఎటువంటి లగేజ్‌ను ఉంచలేదు.

తక్కువ ఇంధనాన్నివినియోగించుకోవడానికి ఇందులోని టైర్లకు సరైన గాలిని నింపి గాలిని నింపే నాజిల్స్‌ను సీజ్ చేశారు. అదనపు ఇందనాన్ని నింపడానికి వీలు లేకుండా ఇంధనం నింపే గొట్టాన్ని కూడా సీజ్ చేశారు మరియు ఎక్కువ మైలేజ్‌ గ్రహించడానికి డ్రైవర్‌ దీనిని ప్రత్యేక శైలిలో నడిపాడు.

ఇంజన్ యొక్క సామర్థ్యాన్ని పెంచడం కోసం ఇందులోని ఏ/సి ని కూడా ఆఫ్ చేశారు మరియు రహదారి యొక్క పరిస్థితులు రహదారి యొక్క పరిస్థితులు కూడా ఇంతటి మైలేజ్ గ్రహించడంలో ఎంతగానో సహాయపడ్డాయి.

కారు మీద గాలి వలన కలిగే ఘర్షణను తగ్గించడం కోసం కారులోని అన్ని అద్దాలను కూడా మూసి వేశారు. అయితే డ్రైవర్ మీద ఎక్కువ వాతావరణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇలాంటి పరీక్షలను ఎక్కువగా రాత్రి వేళల్లో చేస్తుంటారు. ఎందుకంటే ట్రాఫిక్ వలన కలిగే నష్టాలను నివారించడానికి. తద్వారా సమయం మరియు వాహనంలోని ఇంధనం రెండూ కూడా తగ్గుతాయి.

గరిష్టంగా మైలేజ్‌ను గ్రహించడానికి వాహనాన్ని సుమారుగా 40 నుండి 45 కిలోమీటర్ల మధ్య నడపాల్సి ఉంటుందని ఈ సుదీర్ఘ ప్రయాణంలో తేలింది.

ఇంజన్ మీద ఎక్కువ ప్రభావం పడకుండా రెనో వాహనాన్ని 1,000 ఆర్‌పిఎమ్ వేగం వద్ద ఐదవ గేరులో కారును నడిపినట్లు తెలిపారు. ఇతర వాహనాలను గమనిస్తూ ఎక్కువ యాక్సలరేట్ చేయడాన్ని పూర్తిగా
నివారించారు.

మొత్తం దూరం 1388 కిలోమీటర్లు ఢిల్లీ నుండి ముంబాయ్ వరకు సుమారుగా నాలుగు రోజుల పాటు ప్రయాణం చేశారు. వీరి మొత్తం ప్రయాణం గోల్డెన్ క్వాడ్రిల్యాటరల్ జాతీయ రహదారి మీద ఉండేట్లు చూశారు.

చారిత్రకంగా సాగిన ఈ ప్రయాణాన్ని ఏప్రిల్ 9 , 2016 న ఢిల్లీలో ప్రారంభించారు. గరిష్ట మైలేజ్‌ను తీసుకు రావడానికి ప్రత్యేక శ్రద్ద చూపారు. వీరి శ్రమకు తోడుగా రహదారి మరియు వలాతావరణ పరిస్థితులు బాగా కలిసొచ్చాయి.

వీరి మొత్తం నాలుగు రోజుల ప్రయాణ కాలంలో కేవలం మూడు ప్రదేశాలలో మాత్రమే ఈ వాహనాన్ని ఆపారు. అందులో జై పూర్, ఉదయ్ పూర్ మరియు వడోదరలు ఉన్నాయి. ఈ ప్రయాణానికి కేవలం 32.91 లీటర్ల డీజల్ మాత్రమే వినిమయం అయ్యింది.

ఈ రెనో లాజీలో 1.5-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డిసిఐ టర్బో విజిటి డీజల్ ఇంజన్‌ కలదు. ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 108.50 బిహెచ్‌పి పవర్ మరియు 245 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

  

Story first published: Tuesday, May 24, 2016, 16:05 [IST]
English summary
Renault Lodgy Travels From Delhi To Mumbai On One Full Tank
Please Wait while comments are loading...

Latest Photos