రోడ్డు ప్రమాదం జరిగినపుడు భాదితులను ఆదుకునేవారికి ప్రభుత్వం నుండి రివార్డు

By Anil

ఏదైనా ప్రమాదం జరినపుడు బాధితులకు సహాయం చేయడానికి, హాస్పిటల్‌కు తరలించడానికి చాలా మంది వెనకాడుతారు. కారణం, పోలీసులు వివిధ రకాల ప్రశ్నలతో ఇబ్బందికి గురిచేస్తారని. ఇలాంటి కారణాలతోనే చాలా మంది రహదారి ప్రమాదాలకు గురైన బాధితులను రక్షించడానికి వెనకాడుతారు.

ప్రమాదంలో బాధితులను హాస్పిటల్‌కు చేర్చండి, రివార్డ్ పొందండి

కాని ఢిల్లీ ప్రభుత్వం తమ రాజ్యంలో ఇలాంటివి చోటు చేసుకోకూడదని ఒక నిర్ణయం తీసుకుంది. రహదారి ప్రమాదాల్లో బాధితులను సకాలంలో రక్షించిన వారికి రివార్డ్‌ను అందించే పథకాన్ని ప్రవేశపెట్టింది.

సత్యేందర్ జైన్, ఢిల్లీ హోం శాఖ మంత్రివర్యులు మాట్లడుతూ, ఢిల్లీ మరియు దీని పరిధిలో ఎక్కడైనా రోడ్డు యాక్సిడెంట్ జరిగినపుడు తక్షణమే స్పందించి క్షతగాత్రులను హాస్పిటల్స్‌కు చేర్చిన వారి పేరు మీద కొంత మొత్తాన్ని డ్రాఫ్ట్ తీసి కేవలం నెలలోనే గవర్నర్ నజీబ్ జంగ్ నుండి అమోదింపచేస్తారు. తరువాత వారికి ఆ మొత్తాన్ని అందజేస్తారు.

ప్రమాదంలో బాధితులను హాస్పిటల్‌కు చేర్చండి, రివార్డ్ పొందండి

ఈ పథకం ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం, ఢిల్లీలో సుమారుగా 35 ఏళ్ల వయస్సున్న సెక్యురిటీ గార్డ్‌‌ని వేగంగా వెళుతున్న వ్యాన్ డీకొనడం ద్వారా కుప్పకూలిపోయాడు. అయితే అటు వైపున్న వారు ఎవరు కూడా అతన్ని రక్షించేందుకు ముందుకు రాలేదు. అయితే ఈ తంతంగ మొత్తం అక్కడే ఉన్న సిసిటీవీలో రికార్డయ్యింది.
Also Read: ఫ్యూచర్ మొత్తం ఎస్‌యువిలదే !! వరుసగా విడుదలకు సిద్దమైన SUVలు
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని రక్షించకుండా నిర్లక్ష్యం చేయడం అమానుషం. అందుకోసమే, ప్రమాదంలో క్షతగాత్రులను కాపాడిన వారికి ఇన్సెంటివ్ మరియు రివార్డ్‌లను అందించే పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఢిల్లీ హోం మినిస్టర్ తెలిపారు. ప్రమాదంలో కాపాడటటాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు.
Most Read Articles

English summary
Reward For Taking Road Accident Victim To Hospital
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X