2019 లోపు విడుదల కానున్న శాంగ్‌యాంగ్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి

By Anil

కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయరీ సంస్థ శాంగ్‌యాంగ్ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యువి వాహనాన్ని పరిచయం చేస్తున్నట్లు విస్వనీయ వర్గాల సమాచారం.

శాంగ్‌యాంగ్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి-1

సుమారుగా ఆరు సంవత్సరాల క్రితం శాంగ్‌యాంగ్ సంస్థ దాదాపుగా దివాలా అంచు వరకు వెళ్లింది. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా వారి అండతో తిరిగి మార్కెట్లో నిలదొక్కుకుంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లోకి రెక్ట్సాన్ అనే ఎస్‌యువిని మాత్రమే అందుబాటులో ఉంచింది.
Also Read: శకుంతల రైల్వేస్: నేటికీ ఇండియన్ రైల్వేలో భాగం కాని ఏకైక రైలు సంస్థ
ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా వారి సమక్షంలో కార్యకలాపాలు సాగిస్తున్న శాంగ్‌యాంగ్, మునుపటి మోడల్ డిజైన్ కన్నా అధునాతనంగా క్రాసోవర్ రూపంలో దీనిని అభివృద్ది చేయనుంది.
శాంగ్‌యాంగ్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి-2

ఈ సరికొత్త ఎలక్ట్రిక్ క్రాసోవర్ ఎస్‌యువి సి300 అనే కోడ్‌పేరును నిర్ణయించారు. 2017 నాటికి అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రదర్శితం కానుంది. పూర్తి స్థాయి విద్యుత్ వేరియంట్‌తో ఈ వాహనాన్ని 2019 నాటికి అంతర్జాతీయంగా విడుదల చేయనున్నట్లు తెలిసింది.
శాంగ్‌యాంగ్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి-3

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న టివోలి మరియు టివోలి ఎక్స్‌ఎల్‌వి మధ్య దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో శాంగ్‌యాంగ్ మోటార్స్ టివోలి వాహనాన్ని ప్రదర్శించింది.

శాంగ్‌యాంగ్ టివోలి వాహనం ఫోటోలు.........

Most Read Articles

English summary
SsangYong To Launch Its First electric SUV By 2019
Story first published: Thursday, June 9, 2016, 16:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X