మహీంద్రా నుండి మరో కాంపాక్ట్ ఎస్‌యువి

శాంగ్‌యాంగ్ ఇండియా తమ టివోలి ఎస్‌యువిని దేశీయంగా మరో మారు రహస్యంగా పరీక్షించింది. ఫోటోలు మరియు ఇతర వివరాల కోసం

By Anil

దక్షిణ కొరియాకు చెందిన శాంగ్‌యాంగ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా వారి ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. మహీంద్రా గొడుగు క్రింద శాంగ్‌యాంగ్ మరో ఎస్‌యువిని దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టనుంది. టివోలి అనే పేరుతో రానున్న కాంపాక్ట్ ఎస్‌యువి దేశీయంగా మళ్లీ పరీక్షలకు గురయ్యింది. ఈ నూతన టివోలి ఫోటోలు మరియు పూర్తి వివరాల కోసం...

శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్ ఎస్‌యువి

మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయంగా ఉన్న శాంగ్‌‌యాంగ్ సంస్థలో 70 శాతం వాటాను సుమారుగా 470 మిలియన్లకు కొనుగోలు చేసింది. 2011లో జరిగిన ఉత్పత్తి తరువాత శాంగ్‌యాంగ్ నుండి రానున్న రెండవ ఉత్పత్తి ఈ టివోలి. కాగా మొదటి ఉత్పత్తి రెక్ట్సాన్ ప్రస్తుతం అమ్మకాల్లో ఉంది.

శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్ ఎస్‌యువి

శాంగ్‌యాంగ్ రహస్యంగా పరీక్షలు నిర్వహించిన టివోలి కొలతలు ఈ విధంగా ఉన్నాయి. పొడవు 4,202ఎమ్ఎమ్, వెడల్పు 1,798ఎమ్ఎమ్, ఎత్తు 1,590ఎమ్ఎమ్ లతో పాటు దీని వీల్ బేస్ 2,600ఎమ్ఎమ్‌గా ఉంది.

శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్ ఎస్‌యువి

సాంకేతికంగా ఈ టివోలి కాంపాక్ట్ ఎస్‌యువిలో శాంగ్‌యాంగ్ తమ రెండు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను పరిచయం చేస్తోంది. రెండు ఇంజన్‌ వేరియంట్లు కూడా 1.6-లీటర్ సామర్థ్యంతో ఉన్నాయి.

శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్ ఎస్‌యువి

ఈ రెండు ఇంజన్‌లను మహీంద్రా అండ్ మహీంద్రా ప్రత్యేకంగా శాంగ్‌యాంగ్ సంస్థ కోసం అభివృద్ది చేయించింది. టివోలి కాంపాక్ట్ ఎస్‌యువిలో రానున్న రెండు ఇంజన్‌లకు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ లను అనుసంధానం చేయనున్నారు.

శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్ ఎస్‌యువి

శాంగ్‌యాంగ్ నూతన టివోలి కాంపాక్ట్ ఎస్‌యువిలో పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా 126బిహెచ్‌పి పవర్ మరియు 160ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును అదే విధంగా డీజల్ వేరియంట్ 113బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్ ఎస్‌యువి

ఫీచర్ల పరంగా శాంగ్‌యాంగ్ టివోలి ఎస్‌యువిలో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, టెయిల్ లైట్లు మరియు ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్ కలవు.

శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్ ఎస్‌యువి

టివోలి ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ ఇంటీరియర్, తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లతో పాటు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రలో వ్యవస్థ కలదు.

శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్ ఎస్‌యువి

ఈ టివోలి భద్రత పరంగా మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ లతో పాటు స్టెబిలిటి కంట్రోల్ వంటి ఫీచర్లతో రానుంది.

శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్ ఎస్‌యువి

అయితే మహీంద్రా ఆధ్వర్యంలో పరీక్షలకు గురైన ఈ టివోలి కాంపాక్ట్ ఎస్‌యువి ఇండియా విడుదల గురించి ఎలాంటి స్పష్టమైన సమాచారం వెల్లడించలేదు.

శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్ ఎస్‌యువి

మహీంద్రా అండ్ మహీంద్రా శాంగ్‌యాంగ్ వారి టివోలి కాంపాక్ట్ ఎస్‌యువిని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు రెనో డస్టర్ వంటి వాటికి గట్టి పోటీగా నిలవనుంది.

శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్ ఎస్‌యువి
  • ఇన్నోవా క్రిస్టాకు సరైన పోటీ జనవరి 18 న విడుదల కానుంది...!!
  • పాత వాటి స్థానంలో కొత్త కార్లకు ఎంట్రీ...!!
  • మారుతి నుండి మరో శుభవార్త

Most Read Articles

English summary
Ssangyong Tivoli Spy Pics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X