టాటా నుండి అద్బుతమైన మోడల్ విడుదలకు ముహూర్తం ఖరారు

టాటా మోటార్స్ తమ సరికొత్త ప్రీమియమ్ ఎమ్‌పివి హెక్సా ను వచ్చే ఏడాది జనవరి 18 నాటికి విడుదల చేయడానికి సిద్దమయ్యింది.

By Anil

టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తమ సరికొత్త ప్రీమియమ్ క్రాసోవర్ ఎమ్‌పివి విడుదలకు దాదాపుగా సిద్దమైంది. టాటా మోటార్స్ డీలర్ల వద్ద వీటి సంభందించిన బుకింగ్స్ ప్రారంభించిన నేపథ్యంలో అధిక డిమాండ్ పొందుతున్న తరుణంలో ఈ హెక్సా విడుదలను మరింత తొందర చేసినట్లు తెలుస్తోంది.

టాటా హెక్సా క్రాసోవర్ ఎమ్‌పివి

టాటా మోటార్స్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్యాసింజర్ వాహనాల డీలర్ల వద్ద ఇప్పటికే ఈ హెక్సా క్రాసోవర్ ఎమ్‌పివికి సంభందించి బుకింగ్స్ ప్రారంభించగా, కస్టమర్ల నుండి ఆశించిన స్థాయిలో స్పందన రావడంతో దీని విడుదలకు వడివడిగా సిద్దమవుతోంది.

టాటా హెక్సా క్రాసోవర్ ఎమ్‌పివి

టాటా మోటార్స్ ఈ క్రాసోవర్ ఎమ్‌పివి ఎమ్‌పివి వాహనాన్ని ఆరు విభిన్న వేరియంట్లలో విడుదల చేస్తోంది మరియు వినియోగదారులు ఈ హెక్సాను రియర్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ అనే ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

టాటా హెక్సా క్రాసోవర్ ఎమ్‌పివి

సాంకేతికంగా టాటా మోటార్స్ ఈ క్రాసోవర్ ఎమ్‌పివి వాహనంలో 2.2-లీటర్ సామర్థ్యం గల వారికోర్ డీజల్ ఇంజన్‌ను అందించింది. ఇది రెండు రకాల పవర్‌ను ఉత్పత్తి చేయునట్లు ట్యూనింగ్ చేయబడింది.

టాటా హెక్సా క్రాసోవర్ ఎమ్‌పివి

5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 148బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

టాటా హెక్సా క్రాసోవర్ ఎమ్‌పివి

మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల వేరియంట్ గరిష్టంగా 154బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

టాటా హెక్సా క్రాసోవర్ ఎమ్‌పివి

టాటా మోటార్స్ హెక్సా వాహనాన్ని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి మరియు రెనో లాజీ స్టెప్‌వే వాహనాలకు గట్టి పోటీనివ్వనుంది.

టాటా హెక్సా క్రాసోవర్ ఎమ్‌పివి

డిజైన్, ఇంజన్, పనితీరుతో పాటు నూతన ఫీచర్లతో రానున్న ఈ హెక్సా ఎమ్‌పివిఎంట్రీ లెవల్ వేరియంట్ రూ. 18 లక్షలతో ఎక్స్ షోరూమ్ గా విడుదలయ్యే అవకాశం ఉంది. తెలుగులో నిరంతరం ఆటోమొబైల్ వార్తలను పొందడానికి డ్రైవ్‌స్పార్క్ తెలుగు (DriveSpark Telugu)తో కలసి ఉండండి.

టాటా హెక్సా క్రాసోవర్ ఎమ్‌పివి

  • మనోరంజనకరమైన మారుతి స్విఫ్ట్ న్యూ జనరేషన్
  • ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న హైబ్రిడ్ కార్లు
  • పెద్ద SUVని విడుదలకు సిద్దమవుతున్న మారుతి సుజుకి

Most Read Articles

English summary
Tata Hexa India Launch Most Likely On January 18, 2017
Story first published: Saturday, December 10, 2016, 22:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X