టియాగో కన్నా కైట్ 5 పెద్ద విజయాన్ని సాధిస్తుందనడానికి గల ముఖ్య కారణాలు

By Anil

ఇండియన్ మార్కెట్లోకి టాటా మోటార్స్ 2002 లో ఇండిగో ను విడుదల చేసేంత వరకు కాంపాక్ట్ సెడాన్ అంటే పెద్దగా మీనింగ్ తెలియలేదు. సుమారుగా 14 ఏళ్ల తరువాత మళ్లీ ఇదే సెగ్మెంట్లోకి కైట్ 5 కాంపాక్ట్ సెడాన్‌ విడుదల చేయడానికి సిద్దమైంది. అయితే తమ కైట్ 5 విడుదలతో టియాగో తరహా విజయాన్ని రెట్టింపు స్థాయిలో సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

టాటా మోటార్స్ వారి కైట్ 5 కాంపాక్ట్ సెడాన్ టియాగో కన్నా రెట్టింపు స్థాయిలో విజయాన్ని సాధిస్తుంది అనడానికి గల ముఖ్య కారణాలు...

టాటా కైట్ 5

టాటా వారి కైట్ 5 కాంపాక్ట్ సెడాన్ భారీ విజయాన్ని సాధిస్తుందనడానికి గల కారణాలను పరిశీలిస్తే ఈ మధ్యనే మంచి విజయాన్ని అందుకున్న టియాగో నుండి ఎక్కువ లక్షణాలను గ్రహిచింది. డిజైన్ మరియు ఫీచర్లు రెండింటిలో దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి.

టాటా కైట్ 5

కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల సెగ్మెంట్లో కొత్త డిజైన్ తీరుతెన్నులతో విడుదలైన టియాగో మంచి విజయాన్ని సాధించింది. దీనికి ముందు వైపున ఉన్న అదే డిజైన్‌నే ఈ కైట్ 5 కాంపాక్ట్ సెడాన్‌లో కూడా అందిస్తున్నారు. కాబట్టి టియాగో తరహా విజయం ఖాయం.

టాటా కైట్ 5

సుమారుగా 40,000 వేలకు పైబడి బుకింగ్స్ నమోదు చేసుకున్న టియాగో నుండి చాలా వరకు సానుకూల అంశాలను తీసుకుని మరియు మరిన్ని కొత్త ఫీచర్లను జోడించారు.

టాటా కైట్ 5

టాటా మోటార్స్ అందిస్తున్న ఇన్ఫోటైన్‌మెంట్ కూడా మంచి విజయానికి కారణం అయ్యింది. ప్రస్తుతం కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన వాటిలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఒకటి. ఇవి ఉన్న కార్లు దాదాపు విజయాన్ని అందుకున్నాయి. అందులో టియాగో మరియు రెనో క్విడ్ ముఖ్య ఉదాహరణ.

టాటా కైట్ 5

ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ఎనిమిది స్పీకర్లు గల హార్మాన్ ఆడియో సిస్టమ్ కలదు. ఇందులోని ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌కు జూకీ కార్ యాప్‌ను కూడా అందించారు. దీని ద్వారా ఒకే సారి 10 స్మార్ట్ ఫోన్‌లను కనెక్ట్ చేయవచ్చు.

టాటా కైట్ 5

ధర పరంగా చూస్తే ధరకు తగ్గ విలువతో టాటా మోటార్స్ ప్రస్తుతం తమ ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నారు. టాటా తమ టియాగోను కేవలం 3.39 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇదే సెగ్మెంట్లో ఉన్న మరే ఇతర కార్లలో కూడా లేని ఫీచర్లను అందించారు. టియాగోను దృష్టిలో ఉంచుకుని కైట్ 5 ను అదే తరహాలో అభివృద్ది చేస్తున్నారు.

టాటా కైట్ 5

టాటా కైట్‌ 5 లో అందించిస్తున్న ఫీచర్లు, విశాలమైన ఇంటీరియర్ అందమైన ఎక్ట్సీయర్, పోటీ దారులను ఎదుర్కొనే విధంగా ధరను నిర్ణయించడం మరియు డీజల్ ఇంజన్‌లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందివ్వడం వంటి విషయాల పరంగా కూడా కైట్ 5 మంచి విజయాన్ని సాధించనుంది.

బ్రాండింగ్

బ్రాండింగ్

అన్నింటి కన్నా ముఖ్యం బ్రాండ్. దేశీయ వినియోగదారుల్లో టాటా మోటార్స్ తెలియని వారుండరు. సరికొత్త డిజైన్ పరిచయం చేయడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు, సరైన ఫినిషింగ్‌తో మునుపటి మరే ఇతర ఉత్పత్తులతో పోల్చుకున్నా కూడా టాటా వారి నూతన ఉత్పత్తుల శైలి పూర్తిగా మారిపోయింది.

టాటా కైట్ 5

  • ఆశ్చరపరిచే ధరతో విడుదలైన ఆరవ తరానికి చెందిన హ్యుందాయ్ ఎలంట్రా

Most Read Articles

English summary
Tata Kite 5: Five Reasons Why It Could Be Bigger Than The Tiago
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X