టాటా కైట్ 5 ప్రొడక్షన్ రెడి: పూర్తి ఫీచర్లు...

By Anil

టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో ఉన్న ప్యాసింజర్ వాహనాల మీద దీర్ఘ దృష్టి పెట్టిందని ఇప్పుడిప్పుడే మార్కెట్ వర్గాలకు అవగతం అవుతోంది. టాటా మోటార్స్ తాజాగ విడుదల చేసిన టియాగో హ్యాచ్‌బ్యాక్ విజయ ఢంకా మోగిస్తూనే ఉంది. ఇదే ఊపులో మరొక ఉత్పత్తిని భారతీయ రోడ్ల మీదకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

టాటా మోటార్స్ ఎంతో కాలంగా కైట్ 5 సెడాన్ కారును అందుబాటులోకి తీసుకురావాలని ఉవ్విళ్లూరుతోంది. తాజాగా కైట్ 5 కు సంభందించి ప్రొడక్షన్ రెడి కారు ఒకటి కనిపించింది. ఇందులో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ ఫీచర్లు కొంత వరకు స్పష్టంగా ఉన్నాయి. వాటి గురించి క్రింది కథనంలో....

టాటా కైట్ 5 ప్రొడక్షన్ రెడి

కైట్ 5 డిజైన్ ఫీచర్లలో వెనుక వైపున అత్యంత పొడవైన బ్రేక్ లైట్‌ను అందించారు. మరియు బ్రేకులైట్లు వెనుక విండోలోకి చొచ్చుకుని పోయినట్లు ఉంటాయి.

టాటా కైట్ 5 ప్రొడక్షన్ రెడి

అంతే కాకుండా వెనుక వైపున ఉన్న బూట్ (డిక్కీ)కి పై భాగంలో చిన్న పెదవి వంటి ఆకారంలో ఉన్న స్పాయిలర్‌ను కూడా డిజైన్ చేశారు.

టాటా కైట్ 5 ప్రొడక్షన్ రెడి

ఇంటీరియర్ వివరాలను స్పష్టంగా తెలుపుతున్న ఈ రహస్య ఫోటోలలో ఇంటీరియర్ ఫీచర్లు పెద్దగా ఏమీ నూతనత్వాన్ని సంతరించుకోలేదు. పూర్తి స్థాయిలో టియాగో ఇంటీరియర్‌ను పోలి ఉంది.

టాటా కైట్ 5 ప్రొడక్షన్ రెడి

దీనిని రహదారి మీదకు విడుదల చేసే నాటికి కైట్ 5 లేదా మరే పేరుతో పిలుస్తారో కాని, ఇందులో టియాగో ఉన్నటువంటి మల్టీమీడియాను అందించారు. మరియు హార్మన్ ఆడియో సిస్టమ్ మీ మ్యూజిక్‌కు మరింత మజాను జోడిస్తుంది.

టాటా కైట్ 5 ప్రొడక్షన్ రెడి

డ్యాష్ బోర్డ్‌ను డ్యూయల్ టోన్ లేయర్‌తో డిజైన్ చేశారు, ఇక ఏ/సి వెంట్‌లు మరియు వాటి నియంత్రికలను టియాగోలో ఎలా తీర్చిదిద్దారో అదే తరహాలో ఉన్నాయి.

టాటా కైట్ 5 ప్రొడక్షన్ రెడి

టియాగోకు మరింత బలాన్నిచ్చిన 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను ఇందులో కూడా అందివ్వనున్నారు. అయితే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కల్పించే అంశం టాటా మోటార్స్ వారి నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది.

టాటా కైట్ 5 ప్రొడక్షన్ రెడి

సబ్ నాలుగు మీటర్ల కేటగిరీలో విడుదలకానున్న ఈ టియాగో ఆధారిత సెడాన్ ఇండిగో ఇసిఎస్ స్థానాన్ని భర్తీ చేయనుంది.

టాటా కైట్ 5 ప్రొడక్షన్ రెడి

ఈ ఏడాది చివరిలోపు టాటా మోటార్స్ ఈ కైట్ 5 సెడాన్‌ను విడుదల చేయనున్నారు.

టాటా కైట్ 5 ప్రొడక్షన్ రెడి

ఈ వాహనాలు విడుదలైతే ఇక ఎస్‌యువి సెగ్మెంట్ పూర్తిగా మహీంద్రా ఆధీనంలోకే...!!

టాటా కైట్ 5 ప్రొడక్షన్ రెడి

  • రానున్న ఏడాదిలోపు విడుదల కానున్న హ్యుందాయ్ కొత్త కార్లు

Most Read Articles

English summary
Spy Pics: Production Ready Tata Kite 5 Spotted, Reveals Interiors
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X