టాటా మోటార్స్ ఆశాకిరణం నెక్సాన్ మిని ఎస్‌యువి

By Anil

టాటా మోటార్స్ దేశ వ్యాప్తంగా మరొసారి ఓ వెలుగు వెలగడానికి వారి నెక్సాన్ మిని ఎస్‌యువి ఎంతగానో సహకరిస్తుందని చెప్పవచ్చు. మేమే కాదు 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో దీనిని చూసిన ఎంతో మంది సందర్శకులు చెప్పిన పాఠం ఇది. టాటా మోటార్స్ వారు ప్రొడక్షన్ రెడి సబ్-4 మీటర్ల ఎస్‌యువిని ప్రదర్శించింది. ఈ కేటగిరి ద్వారా టాటా మొదటి సారి తన నెక్సాన్ ద్వారా రంగ ప్రవేశం చేసింది.

టాటా నెక్సాన్


సాంకేతిక వివరాలు:
టాటా నెక్సాన్ మిని ఎస్‌యువిలో రెండు ఇంజన్‌ ఆప్షన్‌లు కలవు, మొదటిది టర్భోఛార్జ్‌డ్ గల 1.2-లీటర్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ దీనిని మనం జికా కారులో గమనించవచ్చు. మరియు 1.5-లీటర్ రివోటార్క్ డీజల్ ఇంజన్

పెట్రోల్ ఇంజన్ విడుదల చేసే శక్తి మరియు టార్క్ వివరాలను గోప్యంగా ఉంచారు. అయితే ఇందులో ఉన్న 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 110 బిహెచ్‌పి పవర్ మరియు 260 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును.
Also Read: యమహా ఎమ్‌టి-09 స్ట్రీట్‌ ఫైటర్ ధర రూ. 10.20 లక్షలు
నెక్సాన్ డిజైన్:
టాటా మోటార్స్ వారు 2014 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన నెక్సాన్ కాన్సెప్ట్ కారుకు అచ్చులా ఉంటుంది ఈ నెక్సాన్ మిని ఎస్‌యువి. మీరు ఆ నెక్సాన్ కాన్సెప్ట్ కారుని మరియు ఈ నెక్సాన్ ప్రొడక్షన్ రెడి కారుని భూతద్దం ద్వారా వెతికినా కూడా ఎటువంటి మార్పులను గమనించలేరు.

టాటా మోటార్స్ వారు దీనిని కొంచెం కోణీయ ఆకారంలో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. స్మూత్‌గా ఉండే ముందు వైపు హెడ్ లైట్లు, మరియు టెయిల్ ల్యాంప్స్ ఎంతో చక్కగా ఉన్నాయి. ముందు వైపున తక్కువ క్రోమ్‌ పూత పూయబడిన ఫ్రంట్ గ్రిల్ మరియు కారుకు ఇరు ప్రక్కవైపులా రెండు గీతలు కల్పించారు. అయితే ఇది ఉత్పత్తికి సిద్దమైనట్లు టటా సంస్థ పేర్కొంది.
Also Read: మారుతి సుజుకి వితారా బ్రిజా ఫోటోలు
అందుబాటులోకి మరియు పోటి:
టాటా మోటార్స్ వారు ఈ నెక్సాన్ కారును ఈ ఏడాది చివరికల్లా రోడ్ల మీద పరుగులు పెట్టించనున్నారు. మరియు ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి వాటికి తీవ్ర పోటిగా పరిణమించబోతోంది.

Most Read Articles

English summary
2016 Auto Expo: Tata Nexon Unveiled, Retains Insane Concept Looks
Story first published: Monday, February 8, 2016, 12:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X