తెలంగాణలో ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే ఈ వింత శిక్షలు తప్పవు

Written By:

తెలంగాణ ట్రాఫిక్ అధికారులు అద్భుతమైన ఆలోచనతో ముందుకు వచ్చారు. రహదారుల మీద ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారికి వారు విధించే శిక్షలు మరియు జరిమానాలకు అదనంగా కొన్ని సామాజిక భాద్యతలను అప్పగించనున్నారు.


వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ అధికారులకు పట్టుబడితే అందుకుగాను జరిమానాను చెల్లిస్తూ, ఒక మొక్కను నాటాల్సి ఉంటుంది. తెలంగాణలో హరిత హారం కార్యక్రమం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది అని అనుకుంటే అది మీ పొరబాటే. ఎందుకంటే ఈ కొత్త పద్దతిని మహబూబ్‌నగర్ ఎస్‌పి రేమా రాజశ్వరి గారు ప్రారంభించారు. మరియు గత రెండు వారాలుగా మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా దీనిని అమలుపరుస్తున్నారు.
Also Read: మీ వెంట డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా తెలంగాణలో వాహనాలు నడపవచ్చు
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 24 శాతం ఉన్న హరిత వనాల్ని 33 శాతానికి పెంచాలి అని ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఇలాంటి పద్దతి చక్కగా ఉపయోగపడుతుందని ఎస్‌పి గారి అభిప్రాయం.
Also Read: హైదరాబాద్‌లో మద్యం సేవిస్తూ పట్టుబడితే మీ ఉగ్యోగ్యాన్ని కోల్పోతారు
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖ వారు సుమారుగా పది లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన సుమారుగా 2,765 మంది చేత మొక్కలను నాటించినట్లు తెలిపారు.
 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Violated Traffic? Now Plant A Tree – New Rule In Telangana
Please Wait while comments are loading...

Latest Photos