రెనో క్విడ్ కారు పుట్టుక........ఆసక్తికరమైన సమాచారం !

By Anil

భారతీయ ఎంట్రీలెవల్ కార్ల మార్కెట్లో గొప్ప విజయవంతమైన కారు గురించి మాట్లాడాలి అంటే ఉన్న ఏకైక మోడల్ రెనో క్విడ్. ప్రత్యేకంగా ఇదే ఎందుకంటే విడుదలయిన కేవలం ఆరు మాసాల కాలంలో రికార్డు స్థాయిలో బుకింగ్స్ నమోదు అయ్యాయి. ఇప్పటికీ కూడా వీటిని బుక్ చేసుకున్న వారు కూసంత కాలపరిమితితో దీనిని ఇంటికి తీసుకెళ్లడానికి వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Also Read: 170 సంవత్సరాల ఇండియన్ రైల్వే చరిత్రలో :49 ఆసక్తికరమైన నిజాలు
ధరకు తగ్గ విలువతో చక్కటి డిజైన్ రూపం, అత్బుతమైన ఇంజన్ ఆప్షన్లు మరియు మంచి మైలేజ్ ఇంకా బోలెడన్ని ఇంటీరియర్ ఫీచర్లతో మధ్య తరగతి మరియు సామాన్యులకు ఎంతో చేరువ అయ్యింది. ఒకప్పుడు మారుతి ఆల్టో కారుకు ఎక్కువ మంది పట్టం కట్టేవారు. కాని రెనో క్విడ్ రాక కారు కొనాలనుకునే ఎంతో మంది సమాన్యుల కల నెరవేరిందని చెప్పవచ్చు. అయితే ఈ క్విడ్ కారును అభివృద్ది చేసేదాని వెనుక దాగున్న ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా ? క్రింది కథనం ద్వారా ఆ వివరాలు తెలుసుకుందాం రండి

ప్రాజెక్ట్ లీడర్

ప్రాజెక్ట్ లీడర్

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రెనో మరియు నిస్సాన్ సంయుక్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది. రెనో నిస్సాన్ భాగస్వామ్యపు సంస్థకు కార్ల్ ఘోషన్ అధిపతిగా ఉన్నాడు. అయితే రెనో క్విడ్ కారు రూప కల్పన మరియు అభివృద్దిలో ఇతని పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే. ఈ ప్రాజెక్ట్ సాకారానికి ఇతనే మూల కారణం మరియు తన స్థానం నుండి విరామం తీసుకునే లోపు క్విడ్ కారును రూపొందించాలనే ఆశయంతో ఉండేవాడు.

లోహన్ కార్ల తయారీ కేంద్రం

లోహన్ కార్ల తయారీ కేంద్రం

ఈస్ట్రన్ యురోపియన్ మార్కెట్లో 6,000 డాలర్ల రుపాయలతో 1997 లో రెనో కార్ల తయారీని మొదలు పెట్టింది. అప్పట్లో రెనో సంస్థకు అధిపతిగా ఉన్న లూయిస్ అనే వ్యక్తి క్విడ్ కారును రూపొందించడానికి అప్పటికే ప్రతిపాదన తీసుకువచ్చాడు.అయితే గత ఏడాదిలో దీనిని విడుదల చేసిన తరువాత ఇది ఎంతో ఛాలెంజ్‌తో కూడుకున్నదని తెలిపాడు.

ఆశ్చర్యకరం

ఆశ్చర్యకరం

నేను రిటైర్ అయ్యే లోపు క్విడ్ కారును పూర్తి స్థాయిలో అభివృద్ది చేయలేనేమో అని అనుకున్నాను. కాని కేవలం 30 సెకండ్ల కాలవ్యవధిలోనే దీనికి చెందిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. తరువాత దీని మీద క్షుణ్ణగా ప్రయోగాలు జరిపి చివరికి ఇలా రూపొందంచామని చెప్పుకొచ్చాడు కార్ల్ ఘోషన్

భారీ సవాలు

భారీ సవాలు

1997 ఈ కారును తయారు చేయడానికి 6,000 డాలర్ల రుపాయలను లోహన్ ప్లాంట్ అడిగట్లు సమాచారం. అయితే దీనిని కేవలం 4,000 డాలర్లకే అందుబాటులోకి తీసుకురావాలని సవాలును ఎంచుకున్నారు. ఇది ఎంతో ఉత్తమమైన మరియు చాలా ప్రాధాన్యతను సంతరించుకుందని కార్ల్ ఘోసన్ తెలిపాడు.

మారుతి సమ్రాజ్యంలో

మారుతి సమ్రాజ్యంలో

మారుతి సామ్రాజ్యం అప్పటికే చిన్న కార్ల తయారీలో విపరీతమైన పేరును గడించింది. అయితే ఇది కార్ల యొక్క ధరకు సంభందించినది మాత్రమే కాదు. కంపెనీ ఉత్పత్తులలో నాణ్యత ఉండాలని అనుకుంది. దీనిని సవాలుగా తీసుకుంది. కాని సంస్థకు ఉన్న ప్రత్యేక అనుభవం ద్వారా కారు సృష్టించింది.

స్పష్టమైన లక్ష్యం

స్పష్టమైన లక్ష్యం

రెనో తయారు చేయాలనుకున్న బడ్జెట్ కారులో నూతన శైలిలో కారు డిజైన్, గొప్ప స్పేస్, ఎక్కువ మైలేజ్ ఇవ్వగలిగే విధంగా దీనిని నిర్మించాలని లక్ష్యంగా చేసుకుంది.

సరైన సమయంలో

సరైన సమయంలో

రెనో వారు క్విడ్ కారు డిజైన్ పనులు 2012 లో పట్టాలెక్కాయి. ఆ తరువాత నాలుగు సంవత్సరాల సుధీర్ఘ సమయం తరువాత క్విడ్ కారు ఉత్పత్తికి సిద్దమైంది.

నూతన వేదక మీద

నూతన వేదక మీద

రెనో వారు నూతన ఉత్పత్తులను డిజైన్, ధర వంటి విషయాల పరంగా ప్రత్యేకమైన వేదక మీద నిర్ణయించబడేవి. అయితే పరిశోధన మరియు అభివృద్దికి సంభందించిమ మరొక ఫ్లాట్‌ఫామ్ ను ఎంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. అందుకోసం రెనో నిస్సాన్ సంయుక్తంగా కొత్త బ్రాండ్‌ను సృష్టించి అక్కడ ఇంజన్, గేర్‌బాక్స్ మరియు డిజైన్‌లకు చెందిన పూర్తి పరిశోదనలు జరిగేవి.

పొదుపు

పొదుపు

అయితే అమ్మకాలలో వచ్చే దానిలో నాలుగు శాతం మేర దీని అభివృద్ది మరియు పరిశోదన కోసం వెచ్చించాలని భారతీయ పరిశోదకుడి చేసిన విన్నపాన్ని స్వీకరించారు.

 400 మంది సైన్యంతో

400 మంది సైన్యంతో

క్విడ్ కారును తయారు చేయడానికి 400 మంది వరకు ఉద్యోగులను నియమించుకుంది. మరియు కారును తక్కువ ధరకు అందించడానికి చాలా వరకు స్వదేశీ విడిభాగాలను సమకూర్చుకున్నారు.

విడి భాగాల పరఫరా

విడి భాగాల పరఫరా

కారుకు నిర్ణయించిన ధరకు లోబడి దేశీయంగా సరైన ధరకు నాణ్యమైన విడి భాగాలను సరఫరా చేసే విధంగా స్థానికులతో ఒప్పందం కుదుర్చుకుంది.

పోటి మార్కెట్

పోటి మార్కెట్

భారతీయ కార్ల మార్కెట్ ఎంతో సవాలుతో కూడుకున్నది. కాబట్టి భారత్‌లో ఈ కారు విజయం సాధించిందంటే ప్రపంచ వ్యాప్తంగా విజయం సాధించవచ్చని సంస్థ తెలిపింది. అందుకోసం పూర్తిగా భారతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించామని తెలిపారు.

ఆరు రోజులు మాత్రమే సెలవులో

ఆరు రోజులు మాత్రమే సెలవులో

క్విడ్ కారు రూపకల్పనలో గెరార్డ్ అనే వ్యక్తి ఎంతో కీలకం. కారును అభివృద్ది చేయడానికి పట్టిన నాలుగు సంవత్సరాలలో కేవలం ఆరు రోజులు మాత్రమే గెరార్డ్ సెలవు తీసుకున్నట్లు తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్ కోసం

అంతర్జాతీయ మార్కెట్ కోసం

రెనో తమ క్విడ్ కారును కేవలం భారతీయ మార్కెట్ కోసమే కాకుండా అంతర్జాతీయంగా కొన్ని విభిన్నమైన దేశాలకు దీనిని అందించాలని అనుకుంది. కాని వారు విభిన్ని ప్రత్యేకతలతో దీనిని కోరుకున్నారు. అందుకోసం వారికి అనుగుణంగా క్విడ్ కారును డిజైన్ చేసినట్లు తెలిపారు.

 అనేక ఉత్పత్తులు

అనేక ఉత్పత్తులు

ప్రస్తుతం రెనో క్విడ్ కారును అభివృద్ది చేసిన ప్లాట్‌ఫామ్ నుండి ఎస్‌యువి, హ్యాచ్‌బ్యాక్, సెడాన్, 7-సీటర్ మరియు పికప్ ట్రక్కులను అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. మరియు రానునన్న ఐదేళ్ల కాలంలో కొన్ని మిలియన్ వాహనాలను తయారు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిసింది.

మారుతితో గొప్ప సవాలు

మారుతితో గొప్ప సవాలు

భారతీయ మార్కెట్లో అత్యంత శక్తివంతమైన ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి. కాబట్టి దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టే ప్రతి ఉత్పత్తి కూడా మారుతి వారి ఉత్పత్తులతో పోటి పడాల్సిందే. ఇక్కడ మారుతి వారి కార్లకు ఎదురు నిలిచిన ఉత్పత్తులు ఖచ్చితంగా అంతర్జాతీయ మార్కెట్లో రాణించగలవనే ధీమా..

గెరార్డ్ ఆధారంతో

గెరార్డ్ ఆధారంతో

రెనో వారు ఉత్పత్తి చేస్తున్న క్విడ్, డస్టర్ మరియు లాజీ వంటి ఉత్పత్తులకు మూల ఆధారం గెరార్డ్. ఎందుకంటే వీటన్నంటి అభివృద్దిలో ఇతనిదే కీలక పాత్ర

పరిశోధనలకు ముందు

పరిశోధనలకు ముందు

ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో మలుపుల తరువాత ఒక స్థిరమైన స్థానంలోకి వస్తారు. అవును గెరార్డ్ జీవితంలో కూడా ఇలాంటిదే జరిగింది. గణిత శాస్త్రంలో ప్రధాన అధ్యాపకునిగా పనిచేసిన అనుభవం ఇతనికి ఉంది. తరువాత ఆటోమొబైల్‌ రంగంలోకి అడుగుపెట్టాడు.

చెన్నైతో అనుభందం

చెన్నైతో అనుభందం

రెనో నిస్సాన్ వారి సంయుక్త పరిశోధన మరియు అభివృద్దికి చెన్నై కార్యాలయంలో పని చేశాడు. మరియు అధికారిక వెబ్‌సైట్ ద్వారా 69 సంవసత్సరాల వయస్సున్న ఫ్రాన్స్ గెరార్డ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌కు ఎంపిక అయ్యాడు.

రెనో క్విడ్ కారు పుట్టుక........ఆసక్తికరమైన సమాచారం !
  • ఆల్టో 800ను 30 లక్షల మంది ఎంచుకోవడానికి గల ముఖ్య కారణాలు
  • ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం....?

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
The Story Behind Renault Kwid
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X