ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న టాప్ 10 బెస్ట్ స్పోర్ట్స్ కార్లు

ఇండియాలో ఉన్న స్పోర్ట్స్ కారు ప్రేమికుల కోసం ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 స్పోర్ట్స్ కార్ల గురించి ప్రత్యేక కథనం. ఇవాళ్టి స్టోరీలో టాప్ 10 స్పోర్ట్స్ కార్ల వివరాలు

By Anil

ప్యాసింజర్ కార్లు అనగా హ్యాచ్‌బ్యాక్‌, సెడాన్, ఎస్‌యువి, ఎమ్‌పివి మరియు ఈ మధ్య కాలంలో పరిచయం అయిన క్రాసోవర్లు వంటి సెగ్మెంట్లలోని ఉత్పత్తులు కళ్ల ముందు కదలాడుతాయి. అయితే వీటిలో స్పోర్ట్స్ కార్ల సెగ్మెంట్ కూడా ఉంది. అత్యంత శక్తివంతమైన ఇంజన్‌తో గరిష్ట పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తూ గరిష్ట ఫీచర్లున్న వాటిని సింపుల్‌గా స్పోర్ట్స్ కార్లు అనవచ్చు.

టాప్ 10 బెస్ట్ స్పోర్ట్స్ కార్లు

గరిష్ట వేగాన్ని కలిగి ఉండి, అత్యంత శక్తివంతమైన ఇంజన్‍‌తో భారీ ఫీచర్లున్న కార్లను ఎంచుకునే వారు ఒక విధంగా స్పోర్ట్స్ కార్ల ప్రేమికులని చెప్పవచ్చు. ఇలాంటి వారి కోసం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్పోర్ట్స్ కార్ల నుండి టాప్-10 అత్యుత్తుమ స్పోర్ట్స్ కార్ల వివరాలు ఇవాళ్టి స్టోరీలో...

10. జాగ్వార్ ఎఫ్-టైప్

10. జాగ్వార్ ఎఫ్-టైప్

జాగ్వార్ లోని కూపే శ్రేణిలో ఉన్న ప్రీమియమ్ స్పోర్ట్స్ మోడల్ ఈ ఎఫ్-టైప్. ఇందులో సుమారుగా 5000సీసీ సామర్థ్యం గల శక్తివంతమైన ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 550పిఎస్ పవర్ మరియు 680ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

టాప్ 10 బెస్ట్ స్పోర్ట్స్ కార్లు

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ ద్వారా చక్రాలకు సరఫరా అవుతుంది. లీటర్‌కు 14.3 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల ఇందులో 72 లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు కలదు. అయితే ఇందులో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు.

ధర సుమారుగా రూ. 1.88 కోట్లు

09. మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి

09. మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి

అత్యంత విలాసవంతమైన మరియు స్పోర్ట్స్ తరహా కార్లను ఉత్పత్తి చేసే మెర్సిడెస్ బెంజ్ తమ ఏఎమ్‌జి జిటి స్పోర్ట్స్ కారును దేశీయ స్పోర్ట్స్ కార్ల సెగ్మెంట్లో అందుబాటులో ఉంచింది. ఇందులో 503బిహెచ్‌పి పవర్ మరియు 650ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 3,982సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు.

టాప్ 10 బెస్ట్ స్పోర్ట్స్ కార్లు

ఇద్దరు మాత్రమే ప్రయాణించే వెసులుబాటున్న ఇందులో 75 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంకు కలదు. లీటర్‌కు 7.8 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల దీని ధర రూ. 2.40 కోట్లుగా ఉంది. శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్‌కు 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

08. ఆడి ఆర్8

08. ఆడి ఆర్8

ఆడి శ్రేణి లోని ఆర్8 లో 5204 సీసీ సామర్థ్యం గల వి10 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 602బిహెచ్‌పి పవర్ మరియు 560ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం ద్వారా నాలుగు చక్రాలకు పవర్ సరఫరా అవుతుంది.

టాప్ 10 బెస్ట్ స్పోర్ట్స్ కార్లు

ఇద్దరు మాత్రమే ప్రయాణించే వీలున్న ఇందుసో 73 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంకు కలదు. లీటర్‌కు 6.71 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. దీని ధర రూ. 2.55 కోట్లుగా ఉంది.

07. ల్యాంబోర్గిని హురాకాన్

07. ల్యాంబోర్గిని హురాకాన్

ల్యాంబోర్గిని అనే పదం ప్రపంచ వ్యాప్తంగా స్పోర్ట్స్ కార్లకు పర్యాపదంగా మారిపోయింది. అత్యంత ఖరీదైన మరియు శక్తివంతమైన ఇంజన్‌లతో కార్లను నిర్మించడంలో ల్యాంబోర్గిని ఎంతో ప్రత్యేకమైనది. తమ లైనప్‌లోని హురాకాన్ ఈ జాబితాలోకి ఎంటర్ అయ్యింది. ఇందులో 5,204సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. దీనికి 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

టాప్ 10 బెస్ట్ స్పోర్ట్స్ కార్లు

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా బిహెచ్‌పి పవర్ మరియు 540ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి వీలున్న ఇందులో 90 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంకు కలదు. లీటర్‌కు 10.6-11.24 కిలోమీటర్ల ఇవ్వగల హురాకాన్ వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలు 2.99 నుండి 3.43 కోట్లుగా ఉన్నాయి.

06. ఆస్టన్ మార్టిన్ వాంక్విష్

06. ఆస్టన్ మార్టిన్ వాంక్విష్

ఇండియన్ రోడ్ల మీద వీటిని అత్యంత అరుదుగా చూస్తుంటాం. ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ లో 5,935సీసీ సామర్థ్యం గల వి12 పెట్రోల్ ఇంజన్ కలదు. దీనికి అనుసంధానం చేసిన 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా 564బిహెచ్‌పి పవర్ మరియు 630ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను వెనుక చక్రాలకు సరఫరా అవుతుంది.

టాప్ 10 బెస్ట్ స్పోర్ట్స్ కార్లు

ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ లో 78-లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంకు కలదు. ఇది లీటర్‌కు 8-9.1 కిలోమీటర్ల మద్య మైలేజ్ ఇవ్వగలదు, ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ శ్రేణిలోని ధరలు 2.04 నుండి 3.85 కోట్ల మద్య ఉన్నాయి. ఇందులో కూడా 2-సీటింగ్ సామర్థ్యమే ఉంది.

5. ఫెరారి 488 జిటిబి

5. ఫెరారి 488 జిటిబి

ప్రముఖ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఫెరారి తమ 488 జిటిబి మోడల్‌ను ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంచింది. ఇందులో 3,902సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 660బిహెచ్‌పి పవర్ మరియు 760ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

టాప్ 10 బెస్ట్ స్పోర్ట్స్ కార్లు

488 జిటిబి లోని ఇంజన్‌కు అనుసంధానం చేసిన 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ వెనుక చక్రాలకు సరఫరా అవుతుంది. కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఇందులో 78-లీటర్ ఇంధన సామర్థ్యం గల ట్యాంక్ కలదు. ఇది లీటర్‌కు 8 కిమీల మైలేజ్ ఇవవగలదు.

ఫెరారి 488 జిటిబి ధర రూ. 3.88 కోట్లుగా ఉంది.

04. ఫెరారి 458 స్పైడర్

04. ఫెరారి 458 స్పైడర్

ఫెరారికి చెందిన మరో స్పోర్ట్స్ కారు ఈ జాబితాలో చోటు సాధించింది. ఫెరారి 458 స్పైడర్ స్పోర్ట్స్ కారులో 3,902సీసీ సామర్థ్యం గల వి8 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 597బిహెచ్‌పి పవర్ మరియు 760ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

టాప్ 10 బెస్ట్ స్పోర్ట్స్ కార్లు

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రాలకు అందుతుంది. ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి వీలున్న ఇందులో 86-లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంకు కలదు. దీని మైలేజ్ లీటర్‌కు 5.5 కిలోమీటర్లుగా ఉంది.

ఫెరారి 458 స్పైడర్ ధర రూ. 4.07 కోట్లుగా ఉంది.

03. ఫెరారి ఎఫ్12 బెర్లినెట్టా

03. ఫెరారి ఎఫ్12 బెర్లినెట్టా

ఫెరారి నుండి మరో స్పోర్ట్స్ కారు ఎఫ్12 బెర్లినెట్టా. ఫెరారి లైనప్‌లో అత్యంత పవర్ ఫుల్ ఇంజన్‌ను ఇదొక్కటే కలిగి ఉంది. ఇందులో 6,262సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు. దీనికి 7-స్పీడ్ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

టాప్ 10 బెస్ట్ స్పోర్ట్స్ కార్లు

నాలుగు చక్రాలకు ఇంజన్ ఉత్పత్తి చేసే 731బిహెచ్‌పి పవర్ మరియు 690ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందుతుంది. ఇద్దరు మాత్రమే ప్రయాణించే వీలున్న ఇందులో 93-లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంకు కలదు. ఏఆర్ఏఐ వారి ప్రకారం దీని మైలేజ్ లీటర్‌కు 6.49 కిలోమీటర్లుగా ఉంది.

ఫెరారి ఎఫ్12 బెర్లినెట్టా ధర రూ. 4.72 కోట్లుగా ఉంది.

02. ల్యాంబోర్గిని అవెంతడోర్

02. ల్యాంబోర్గిని అవెంతడోర్

ల్యాంబోర్గిని అవెంతడోర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్పోర్ట్స్ కారు ప్రేమికుల్లో అవెంతడోర్ గురించి తెలియనివారుండరు. ఇందులో 6,498సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. దీనికి 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

టాప్ 10 బెస్ట్ స్పోర్ట్స్ కార్లు

ఇందులోని ఇంజన్ గరిష్టంగా 700బిహెచ్‌పి పవర్ మరియు 690ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు. అవెంతడోర్ శ్రేణిలోని వేరియంట్లు 5 నుండి 8.8 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవు. వీటిలో 90-లీటర్ సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు కలదు. వీటిలో కూడా ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు.

ల్యాంబోర్గిని అవెంతడోర్ ధర రూ. 5.05 నుండి 5.62 కోట్ల మధ్యన ఉంది.

01. బుగట్టి వేరాన్ గ్రాండ్ స్పోర్ట్

01. బుగట్టి వేరాన్ గ్రాండ్ స్పోర్ట్

ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన స్పోర్ట్స్ కారు బుగట్టి వేరాన్. అసాధారణ డిజైన్ మరియు శక్తివంతమైన ఇంజన్‌తో ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో 7,993సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 987బిహెచ్‌పి పవర్ మరియు 1250ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

టాప్ 10 బెస్ట్ స్పోర్ట్స్ కార్లు

ఇంజన్ విడుదల చేసే పవర్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ ద్వారా వీల్స్‌కు సరఫరా అవుతుంది. 100-లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు కలదు. దీని మైలేజ్ గరిష్టంగా 4 కిలోమీటర్లుగా ఉంది. అయితే ఇందులో కూడా ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు.

బుగట్టి వేరాన్ గ్రాండ్ స్పోర్ట్ ధర రూ. 12 కోట్లుగా ఉంది.

  • గమనిక ఈ కథనంలో ఇవ్వబడ్డ అన్ని ధరలు కూడా ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Top 10 Best Sports Cars Available in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X