ఇండియన్ మార్కెట్లో సన్‌రూఫ్‌తో అందుబాటులో ఉన్న టాప్-10 కార్లు

By Anil

ఇండియన్ కార్ల మార్కెట్ దేశీయంగా ఉన్న వాహన ప్రియులకు తగ్గ రీతిలో కార్లను అందిస్తోంది. ఆల్టో నుండి ఆడి వరకు ప్రతి కారుకు కూడా భారతీయ మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. అయితే ప్రతి కారులో కూడా సన్‌రూఫ్ అనేది ఉండదు. ఏ లగ్జరీ కార్లలో తప్ప.

కాని సన్‌రూఫ్ ఉన్న కార్లలో రూఫ్ పైన ఉన్న అద్దాన్ని తొలగించి, నిలబడుకొని తల బయటపెట్టుకుని హాయిగా వెళ్లాని చాలా మంది వినియోగదారులు కోరుకుంటారు. కాని చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే ఇపుడు సాదారణ కార్లలో సన్‌ రూఫ్‌‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి కొన్ని కార్ల తయారీ సంస్థలు. ప్రస్తుతం దేశం వ్యాప్తంగా సన్‌రూఫ్ అందుబాటులో ఉన్న టాప్ కార్ల గురించి ప్రత్యేక కథనం.

మొదటి సారిగా

మొదటి సారిగా

ప్రపంచ వ్యాప్తంగా మొదటిసారిగా 1937 లో నాష్ మోటార్ కంపెనీ అనే సంస్థ తమ కార్లలో ఈ సన్‌ రూఫ్‌ను పరిచయం చేసింది. ఆ తరువాత ఫోర్డ్ సంస్థ తమ కార్లలో ఈ సన్‌ రూఫ్‌ను పరిచయం చేసింది.

సన్‌ రూఫ్ కొనసాగింపుగా

సన్‌ రూఫ్ కొనసాగింపుగా

సన్ రూఫ్ ప్రపంచానికి కొనసాగింపుగా డిజైన్, ఫీచర్ల ఆదారంగా పాప్-అప్, స్పాయిలర్, ఇన్‌బిల్ట్, ఫోల్డింగ్, టాప్-మౌంట్, ప్యానరోమిక్ రూఫ్ సిస్టమ్ రిమూవబుల్ రూఫ్ ప్యానెల్స్ అనే వివిధ రకాల పేర్లతో ప్రస్తుతం వాడుకలోకి వచ్చాయి.

ఆపరేట్ చేయడం

ఆపరేట్ చేయడం

సన్ రూఫ్‌లో ఉన్న అద్దాన్ని ప్రక్కకు జరపడానికి మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ సిస్టం‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. విత్యుత్ శక్తి ద్వారా ఆపరేట్ చేసే వాటిని ఆటోమేటిక్ మరియు లింక్ లేదా క్యామ్ ద్వారా ఆపరేట్ చేసే వాటిని మ్యాన్యువల్ అని అంటారు. అయితే ప్రస్తుతం అన్ని కార్లలో కూడా ఆటోమేటిక్ సన్‌ రూఫ్‌ను అందించారు. తరువాత స్లైడర్ల ద్వారా దేశీయ మార్కెట్లో సన్ రూఫ్ అందిస్తున్న టాప్-10 కార్లు గురించి తెలుసుకోగలరు.

హోండా సిటి

హోండా సిటి

హోండా మోటార్స్ తమ సిటి లోని పెట్రోల్ మరియు డీజల్‌లోని రెండు టాప్ ఎండ్ వేరియంట్లలో ఎలక్ట్రిక్ సన్ రూఫ్‌ను అందించింది. దీనిని తెరవడం మరియు మూయడం వంటివి చేయడానికి ఎలక్ట్రిక్ పవర్‌ను వినియోగించుకుంటుంది.

స్కోడా ఆక్టావియా

స్కోడా ఆక్టావియా

లగ్జరీ ఫీచర్లుతో కేవలం నాలుగు మోడల్స్‌ను మాత్రమే దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంచిన స్కోడా సంస్థ తమ ఆక్టావియా కారులో సన్ రూఫ్‌ను ప్రవేశ పెట్టింది. ఆక్టావియాలోని టాప్ ఎండ్ వేరియంట్లో ఈ సన్ రూఫ్ కలదు. ఇందులో ఉన్న దానిని ప్యానరోమిక్ సన్‌ రూన్ అని పిలుస్తారు.

షెవర్లే క్యాప్టివా

షెవర్లే క్యాప్టివా

షెవర్లే లోని క్యాప్టివా కారులోని అన్ని వేరియంట్లలో కూడా సన్ రూఫ్ అందుబాటులో కలదు. ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ వేరియంట్లలో కూడా ఈ సన్ రూఫ్‌ను ఆఫర్ చేస్తున్నారు.

హోండా సిఆర్-వి

హోండా సిఆర్-వి

హోండా మోటార్స్ వారు తమ సిఆర్-వి ప్రీమియమ్ ఎస్‌యువిలో సన్ రూఫ్‌ను అందించారు. అయితే 2.0-లీటర్ ఆటోమేటిక్ మరియు టాప్ ఎండ్ వేరియంట్ 2.4-లీటర్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గల ఎస్‌యువిలలో ఈ సన్ రూఫ్ అందుబాటులో ఉన్నట్లు గమనించగలరు. ఇది ఎలక్ట్రానిక్ పవర్ ద్వారా నియంత్రించే సన్ రూఫ్.

షెవర్లే క్రూయిజ్

షెవర్లే క్రూయిజ్

షెవర్లే సంస్థ క్రూయిజ్‌లోని టాప్ ఎండ్ వేరియంట్లో గల ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ కార్లలో ఎలక్ట్రానిక్ సన్ రూఫ్‌ను అందిస్తోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500లోని టాప్ ఎండ్ వేరియంట్ అయిన డబ్ల్యూ 10 లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. డబ్ల్యూ10 లోని మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గల రెండు ఆప్షన్లలో కూడా దీనిని ఆఫర్ చేస్తున్నారు.

ఫీచర్లు

ఫీచర్లు

మహీంద్రా అండ్ మహీంద్రా వారు తమ ఎక్స్‌యూవీ500లోని సన్ రూఫ్‌ కు ప్రతేకమైన ఫీచర్లను అందించారు. ఎలక్ట్రానిక్ పవర్‌తో పని చేసే ఇది, కదులుతున్న సమయంలో సన్‌ రూఫ్ కు దగ్గరగా ఏవైనా అడ్డంకులు వస్తే ఇందులో ఉన్న యాంటి-పించ్ టెక్నాలజీ వాటిని గుర్తించి సన్ రూఫ్ కదలికను నిలిపివేస్తుంది.

ఫోర్డ్ ఎండీవర్

ఫోర్డ్ ఎండీవర్

ఫోర్డ్ సంస్థకు చెందిన ఎండీవర్ ఎస్‌యువిలోని టాప్ ఎండ్ వేరియంట్లో ఎలక్ట్రిక్ పవర్ ద్వారా నియంత్రించగలిగే ప్యానరోమిక్ సన్ రూఫ్‌ కలదు.

ఆడి ఏ3

ఆడి ఏ3

ఆడి లోని ఏ3 మోడల్ కారులో ప్యానరోమిక్ గ్లాస్ సన్ రూఫ్ కలదు. ఇది గాలి వీచే వేగాన్ని బట్టి ఒపెన్ మరియు క్లోజ్ అవుతుంది.

మెర్సిడెస్ బెంజ్

మెర్సిడెస్ బెంజ్

అన్నింటి కన్నా చివరిలో ఉంది మెర్సిడెస్ బెంజ్ ఎందుకంటే మెర్సిడెస్ బెంజ్ చాలా వరకు తమ అన్ని సెడాన్ కార్లు మరియు ఎస్‌యువిలలో ప్యానరోమిక్ సన్ రూఫ్‌ను అందిస్తోంది.

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం.....
  • ఎయిర్‌బ్యాగ్స్: ఎలా పనిచేస్తాయి, ఎన్ని రకాలు, చరిత్ర
  • ప్రపంచంలో కెల్లా అత్యంత భయంకరమైన ఎయిర్‌పోర్ట్ రన్‌వేస్
  • 100 కు పైబడి లగ్జరీ కార్లను కలిగి ఉన్న కింగ్ బాక్సర్ ప్లాయిడ్ మేవెథర్

Most Read Articles

Read more on: #కారు #car
English summary
Top 10 Cars With Sunroof Available In India
Story first published: Thursday, March 17, 2016, 15:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X