ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు

By Anil

కొత్తగా కారు కొనే ప్రతి ఒక్కరూ ధర మరియు ఇంజన్ వివరాలు చూసిన తరువాత గమనించే అంశం మైలేజే కదా ? మన సహద్యోగులు కారును కొంటే అడిగే ముఖ్యమైన విషయాలు, ధర ఎంత, ఇంజన్ ఏది మరియు మైలేజ్ ఎంత అని అడుగుతుంటాం సాధారణంగా ప్రతి ఒక్క ఇండియన్ కూడా అడిగే ప్రశ్నలు ఇవే. ఇండియన్స్ మెంటాలిటీ ఇదే కాబట్టి. మైలేజ్‌ను ఎక్కువగా ఇష్టపడే భారతీయులకు ఇండియన్ మార్కెట్లో ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు గురించి క్రింది కథనంలో......

11. షెవర్లే బీట్

11. షెవర్లే బీట్

చిన్న పిల్లు ఆడుకునే టాయ్ కారు రూపంలో ఉన్నా ఇందులో ఉన్న 936 సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 58 బిహెచ్‌పి పవర్ మరియు 150 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) వారు ప్రకారం ఇది లీటర్‌కు 25.44 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.

షెవర్లే బీట్ డీజల్ ప్రారంభ ధర రూ. 5.05 లక్షలు ఎక్స్‌షోరూమ్ (ఢిల్లీ)

10. హోండా అమేజ్

10. హోండా అమేజ్

హోండా మోటార్స్ వారి అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌లో వినియోగించిన 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌ ఈ కారు ఈ జాబితాలో చోటు సాధించడానికిన కారణమయ్యింది. ఇది సుమారుగా 98 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

 ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు

ఇందులోని సింగల్ ఓవర్ హెడ్ క్యామ్ గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ ఏఆర్ఏఐ ప్రకారం లీటర్‌కు 25.8 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.

అమేజ్ డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 6.42 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)

09. ఫోర్డ్ ఫిగో

09. ఫోర్డ్ ఫిగో

మారుతి సుజుకి వారి స్విఫ్ట్ కు అన్ని అంశాల పరంగా గట్టిగా సమాధానం చెప్పగల ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లో 1.5-లీటర్ సామర్థ్యం గల 99 బిహెచ్‌పి పవర్ మరియు 215 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల డీజల్ ఇంజన్ కలదు.

 ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు

ఏఆర్ఏఐ వారి ప్రకారం ఈ ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ కారు లీటర్‌కు 25.83 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

ఫిగో హ్యాచ్‌బ్యాక్ డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 6.26 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)

08. ఫోర్డ్ ఫిగో ఆస్పైర్

08. ఫోర్డ్ ఫిగో ఆస్పైర్

ఫోర్డ్ వారి సబ్ నాలుగు మీటర్ల సెడాన్ వెర్షన్‌లో ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లో వినియోగించిన 1.5-లీటర్ల సామర్థ్యం గల అదే నాలుగు సిలిండర్ల ఇంజన్ కలదు. ఇది సుమారుగా 99 బిహెచ్‌పి పవర్ మరియు 215 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

 ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు

ARAI వారి ప్రకారం ఈ ఫోర్ట్ ఫిగో ఆస్పైర్ సెడాన్ కారు లీటర్‌కు 25.83 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.

ఆస్పైర్ డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 6.31 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది

07. హోండా సిటి

07. హోండా సిటి

హోండా మోటార్స్ వారి సిటి సెడాన్ కారులో ఉన్న నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ ఈ స్థానంలో చోటు సాధించింది. ఇందులో ఉన్న నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ 98 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు

హోండా మోటార్స్ ఈ సిటి డీజల్ సెడాన్ కారులో వినియోగించిన ఐ-డిటిఇసి సాంకేతికత ద్వారా ఫోర్ట్ ఫిగో ను వెనక్కు నెట్టి 26 కిలోమీటర్లు మైలేజ్‌తో ఏడవ స్థానంలో నిలిచింది.

హోండా సిటి డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 9.22 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

06.మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

06.మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి వారి స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారులో 1.3-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కలదు. దీనిని ఫియట్ మోటార్స్ నుండి సేకరించారు. ఇందులోని మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ 74 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు

ప్రస్తుతం ఇండియన్ ట్యాక్సీల ప్రపంచంలో ఈ కారు ఎక్కువగా కనిపించడానికి కారణం ఏంటో తెలుసా ? ఇది లీటర్‌కు 26.59 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వడమే.

స్విఫ్ట్ డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.99 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది

05. టాటా టియాగో

05. టాటా టియాగో

ప్రపంచ ఫుట్ బాల్ ఛాంపియన్ లియోనెల్ మెస్సీ ఈ టియాగో కారుకు ప్రపంచ వ్యాప్తంగా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. గత నెలలో విడుదలైన ఈ కారు ఈ టాప్-10 మైలేజ్ కార్ల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఇందులో 1.05-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. ఇది 69 బిహెచ్‌పి పవర్ మరియు 140 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు

ఏఆర్ఏఐ వారి కథనం ప్రకారం టియాగోలోని డీజల్ వేరియంట్ 27.28 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.

టాటా టియాగో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వివరాల కోసం

టియాగో డీజల్ డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 3.94 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

04. హోండా జాజ్

04. హోండా జాజ్

ఉత్తమ మైలేజ్ ఇవ్వగల కార్ల జాబితాలోకి హోండా వారి మరొక ఉత్పత్తి జాజ్ వచ్చి చేరింది. ఇందులో 1.5-లీటర్ల సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కలదు. ఇది 98 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేయగలదు.

 ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు

ఏఆర్ఏఐ వారి కథనం ప్రకారం ఇది లీటర్‌కు 27.3 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.

హోండా జాజ్ డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.79 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

03. మారుతి సుజుకి బాలెనొ

03. మారుతి సుజుకి బాలెనొ

మారుతి సుజుకి వారి లేటెస్ట్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారు బాలెనొ లో ఫియట్ వారి1.3-లీటర్ కెపాసిటి గల డీజల్‌ ఇంజన్‌ను వినియోగించారు. ఇది సుమారుగా 74 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు.

 ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు

జాజ్‌ను ప్రక్కకు నెట్టడానికి బాలెనొ 27.39 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలిగింది.

బాలెనొ డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.16 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

02. మారుతి సుజుకి సెలెరియో

02. మారుతి సుజుకి సెలెరియో

ఎంట్రీలెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి వారి సెలెరియా ఎప్పుడూ ముందు స్థానంలోనే ఉంది. ఇందులో 793 సీసీ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు, ఇది 46 బహెచ్‌పి పవర్ మరియు 125 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు.

 ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు

ఏఆర్ఏఐ వారి ప్రకారం మారుతి సుజుకి సెలెరియో డీజల్ వేరియంట్ లీటర్‌కు 27.62 కిమీలు మైలేజ్ ఇవ్వగలదు.

సుజుకి సెలెరియో డీజల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 4.72 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

 01. మారుతి సుజుకి సియాజ్

01. మారుతి సుజుకి సియాజ్

ఇండియన్ రోడ్ల మీద అత్యధిక మైలేజ్ ఇవ్వగల కార్లలో ఎక్కువగా మరియు మొదటి స్థానంలో ఉన్నది మారుతి వారి సియాజ్ కారు. మారుతి ఇందులో మిడ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను వినియోగించింది. అలాగే ఇందులో ఉన్న 1.3-లీటర్ డీజల్ ఇంజన్ 89 బిహెచ్‌‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

 ప్రతి చుక్క లెక్కలోకే....ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 కార్లు

మారుతి సుజుకి తమ సియాజ్ కారులో వినియోగించిన ఎస్‌హెచ్‌విఎస్ మిల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ సహకారంతో 28.09 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

సుజుకి సియాజ్ డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 8.22 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

ఎక్కువ మంది చదివిన కథనాలు....

150సీసీ సెగ్మెంట్లో ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 బైకులు

మనం చెల్లించే సొమ్ముకు భారత్‌లో ఉన్న ఉత్తమ విలువైన కార్లు

ఎక్కువ మంది చదివిన కథనాలు....

రెనో క్విడ్‌కు పోటీగా హ్యందాయ్ ఎహెచ్ మోడల్ ?

హ్యుందాయ్‌ను అధిగమించిన రెనో క్విడ్ ఇప్పుడు మారుతి వంతు

Most Read Articles

English summary
Making Every Drop Count — India's Top 10 Fuel Efficient Cars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X