జూన్ 2016లో దుమ్ములేపిన ఎస్‌యువి అమ్మకాలు

By Anil

ఇండియన్ మార్కెట్ గడిచిన రెండు మూడేళ్ల నుండి విపరీతమైన వాహనాల విడుదలకు పూనుకుంది. ఇందులో కార్ల కన్నా ఎక్కువగా ఎస్‌యువిలు విడుదల అవుతున్నాయి.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (SIAM) వారి గణాంకాల ప్రకారం ఇండియన్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యువి‌గా మొదటి స్థానంలో హ్యుందాయ్ క్రెటా, ద్వితీయ స్థానంలో మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు మూడవ స్థానంలో ఫోర్డ్ ఎకో స్పోర్ట్‌లు నిలిచాయి. గత జూన్ 2016 లో అమ్ముడుపోయిన టాప్-10 ఎస్‌యువిల గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

 10. మహీంద్రా టియువి300

10. మహీంద్రా టియువి300

ఇండియన్ మార్కెట్లో ఎస్‌యువి వాహనాలకు పెట్టింది పేరు మహీంద్రా అండ్ మహీంద్రా. గత ఏడాదిలో దేశీయ విపణిలోకి అందుబాటులోకి తీసుకువచ్చిన టియువి300 ఎస్‌యువి 1,722 యూనిట్ల వరకు అమ్ముడయ్యాయి.

09. రెనో డస్టర్

09. రెనో డస్టర్

ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఇండియన్ మార్కెట్లో తమదమైన ముద్ర వేసుకోవడానికి విభిన్నమైన వాహనాలను అందిస్తోంది. అందుకు నిదర్శనం ఎస్‌యువిలకు కొత్త రూపాన్ని తెలిపే డస్టర్. యువ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకున్న డస్టర్ 1,945 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

08. మహీంద్రా ఎక్స్‌యూవీ500

08. మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా వారి అతి పెద్ద ఎస్‌యువి వాహనం ఎక్స్‌యూవీ500 గడిచిన 2016 జూన్ అమ్మకాల్లో 2,288 యూనిట్ల అమ్మకాలు సాధించి ఎనిమిదవ స్థానంలో నిలిిచంది.

07. హోండా బిఆర్‌-వి

07. హోండా బిఆర్‌-వి

హోండా మోటార్స్ మే 5, 2016 న ఇండియన్ మార్కెట్లోకి తమ కాంపాక్ట్ ఎస్‌యువి బిఆర్-వి ని విడుదల చేసింది. తరువాత మాసం జూన్ నెలలో ఏకంగా 3,064 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

06. మహీంద్రా స్కార్పియో

06. మహీంద్రా స్కార్పియో

మహీంద్రా అండ్ మహీంద్రా వారికి ఒకానొక కాలంలో ఉనికిని గుర్తింపచేసిన మోడల్ స్కార్పియో ఎస్‌యువి. భద్రత పరంగా పెద్ద ర్యాంకును సాధించిలేకపోయినా అమ్మాకాల్లో ఎప్పుడూ పైచేయి సాధిస్తోంది. గడిచిన 2016 జూన్ ఎస్‌యువి అమ్మకాల్లో 3,366 యూనిట్ల స్కార్పియోలు అమ్ముడుపోయాయి.

05. మహీంద్రా కెయువి100

05. మహీంద్రా కెయువి100

మహీంద్రా వారి క్రాసోవర్ ఎస్‌యువిగా వచ్చిన కెయువి100 సుమారుగా 3,543 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది ప్రారంభంలో దేశీయంగా విడుదలైన దీని ప్రారంభ ధర స్విఫ్ట్ కన్నా తక్కువగా ఉండటంతో అమ్మకాల్లో మెరుగును సాధించిందని చెప్పవచ్చు.

04. మహీంద్రా బొలెరో

04. మహీంద్రా బొలెరో

మహీంద్రా వారు బొలెరోని దేశీయంగా అందుబాటులోకి తెచ్చిన తరువాత తమ శ్రేణిలో ఉన్న వాహనాలలో బెస్ట్ సెల్లింగ్ వాహనంగా ముద్ర వేసుకుంది. గడిచిన జూన్ 2016 ఎస్‌యువి అమ్మకాల్లో బొలెరో 3,699 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుని నాలుగవ స్థానంలో నిలిచింది.

03. ఫోర్డ్ ఎకో స్పోర్ట్

03. ఫోర్డ్ ఎకో స్పోర్ట్

మూడవ స్థానంలో నిలిచిన ఫోర్డ్ వారి ఎకో స్పోర్ట్ ఎస్‌యువి వాహనం మారుతి వారి వితారా బ్రిజా విడుదల కానంత వరకు మంచి ఫలితాలను సాధించింది. అయితే బ్రిజా రాకతో తగ్గుముఖం పట్టిన ఎకో స్పోర్ట్ అమ్మకాలు 4,609 యూనిట్లకు పడిపోయాయి.

02. మారుతి సుజుకి వితారా బ్రిజా

02. మారుతి సుజుకి వితారా బ్రిజా

ఇండియన్ కార్ల తయారీ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి ఈ యేడు దేశీయంగా వితారా బ్రిజాను అందుబాటులోకి తెచ్చింది. విడుదల చేసిన అతి తక్కువ కాలంలోనే ఊహించని ఫలితాలను నమోదు చేసుకుంది. అందుకు నిదర్శనం జూన్ 2016 ఎస్‌యువి అమ్మకాల్లో ఏకంగా 6,673 యూనిట్ల అమ్మకాలు జరిపి తొమ్మిదవ స్థానంలో నిలిచింది.

01. హ్యుందాయ్ క్రెటా

01. హ్యుందాయ్ క్రెటా

భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యువిగా హ్యుందాయ్ వారి క్రెటా ఎస్‌యువి నిలిచింది. గత ఏడాదిలో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన క్రెటా గడిచిన జూన్ 2016 అమ్మకాల్లో 7,700 యూనిట్ల అమ్మకాలు జరిపి మొదటి స్థానంలో నిలిచింది.

Most Read Articles

English summary
Top 10 Selling SUVs In June 2016 India
Story first published: Monday, July 25, 2016, 12:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X