ఇండియాలో ఉన్న టాప్-10 ట్రాక్టర్ తయారీ సంస్థలు

By Anil

ఆటో మొబైల్ ప్రపంచం మొదలైన తరువాత స్కూటర్లు, బైకులు మరియు కార్ల వరకు మాత్రమే ఆగిపోలేదు. విభిన్ని ఆవసరాల కోసం వివిధ రూపాలలో వాహనాలను అభివృద్ది చేసుకున్నాం. వినియోగాన్ని బట్టి బస్సు, లారీ, ట్రక్కు, వ్యవసాయ వాహనాలు, కట్టడాలు మరియు తవ్వకాలలో వినియోగించే వాహనాలతో పాటు రైలు, విమానం వంటి ఎన్నో వాటిలో వాహనాలలో వినియోగించే ఇంజన్‌లను ఉపయోగించుకుంటున్నారు.

వ్యవసాయధారిత వాహనాలలో ముఖ్యమైనది ట్రాక్టర్. వ్యవసాయంలో అన్ని అవసరాలకు ట్రాక్టర్ ఎంతో ముఖ్యమైనది. ఒక విధంగా చెప్పాలంటే దేశ ఆర్థికాభివృద్దిలో ట్రాక్టర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి అని చెప్పవచ్చు. ఇంతటి ప్రాముఖ్యమున్న ట్రాక్టర్లను ఇండియాలో తయారు చేస్తున్న పది సంస్థల గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

10. స్టాండర్డ్ ట్రాక్టర్స్

10. స్టాండర్డ్ ట్రాక్టర్స్

పదవ స్ఠానంలో ఉన్న ఈ స్టాండర్డ్ ట్రాక్టర్ల తయాకీ సంస్థ 1975 లో ప్రారంభమైంది. ఢిల్లీ ఆధారంగా ప్రారంభమైన ఈ సంస్థ ట్రాక్టర్లను పంజాబ్‌లో తయారు చేస్తోంది. ట్రాక్టర్లతో పాటు వ్యవసాయంలో ఉపయోగపడే విసృత స్థాయి ఉత్పత్తులను తయారు చేస్తోంది.

09. ప్రీత్ ట్రాక్టర్స్

09. ప్రీత్ ట్రాక్టర్స్

ప్రీత్ ట్రాక్టర్స్ సంస్థ 1980 లో ప్రారంభమైంది. ఈ సంస్థ ప్రత్యేకించి వ్యవసాయానికి సంభందించి విసృత ఉత్పత్తులను తయారు చేస్తోంది. ట్రాక్టర్ల విషయానికి వస్తే 30 నుండి 90 హార్స్ పవర్ వరకు సామర్థ్యమున్న ట్రాక్టర్లను తయారు చేస్తోంది.

08. బల్వాన్ ట్రాక్టర్స్

08. బల్వాన్ ట్రాక్టర్స్

బల్వాన్ ట్రాక్టర్స్ అంటే చాలా మందికి వెంటనే గుర్తుకురాకపోవచ్చు. కాని ఫోర్స్ సంస్థ వారి ట్రాక్టర్లు అంటే టక్కున గుర్తొస్తాయి. బల్వాన్ సంస్థ ఫోర్స్ మోటార్స్ ఆధ్వర్యంలో 1957 లో దేశీయంగా ట్రాక్టర్ల తయారీని ప్రారంభించింది. ఫోర్స్ సంస్థ ట్రాక్టర్లనే కాదు వాణిజ్య మరియు ప్రయాణికుల వాహనాలను కూడా తయారు చేస్తోంది.

07. హిందుస్తాన్ మెషీన్ టూల్స్

07. హిందుస్తాన్ మెషీన్ టూల్స్

హెచ్‌ఎమ్‌టి లిమిటెడ్ 1953 లో ప్రారంభమైంది. ఆ తరువాత 1971 నుండి ట్రాక్టర్ల తయారీ వైపు అడుగులు వేసిం. ప్రభుత్వరంగం సంస్థలో హెచ్‌ఎమ్‌టి లిమిటెడ్ ఒక సంస్థగా ఉంది.

06. న్యూ హాలెండ్

06. న్యూ హాలెండ్

ఇటాలియన్‌కు చెందిన సంస్థ అతి కొద్ది కాలంలోనే భారతీయుల రైతులను అట్టే ఆకట్టుకుంది. న్యూ హాలెండ్ సంస్థ 1996లో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. నమ్మకదగిన ఉత్పత్తుల కారణంగా భారతీయులు దీనిని బాగా ఆదరించారు అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు సుమారుగా 2.5 లక్షల ట్రాక్టర్లను అమ్మేశారు.

05. జాన్ ఢీర్

05. జాన్ ఢీర్

అమెరికా అధారిత సంస్థ దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి అమ్మకాలను సాధిస్తోంది. ఐదవ స్థానంలో ఉండే ఈ సంస్థ 1837 లో మొదటి సారిగా అమెరికాలో పురుడుపోసుకుంది. గ్లోబల్ ఫార్చ్యూన్ 500 వారి అంతర్జాతీయ ర్యాంకిగ్ ప్రకారం ఇది 300 వ స్థానంలో నిలిచింది.

04. సోనాలిక ఇంటర్నేషనల్

04. సోనాలిక ఇంటర్నేషనల్

సోనాలిక ట్రాక్టర్స్ సంస్థ దేశీయంగా ఉన్న పురాతణ వాటిలో ఒకటి. పజాబ్ కేంద్రంగా సోనాలిక ఇంటర్నేషనల్ ఆవిర్బవించింది. 2004 ఏడాదిలో ప్యాసింజర్ కార్ల రంగంలోకి కూడా అడు పెట్టింది.

03.ఎస్కార్ట్స్ అగ్రి మెషినరీ

03.ఎస్కార్ట్స్ అగ్రి మెషినరీ

దేశీయంగా రైతులకు మరియు అంతర్జాతీయంగా ఎస్కార్ట్ ట్రక్టర్స్ ఎంతో బాగా తెలుసు. 1960 లో ఎస్కార్ట్ సంస్థ దేశీయంగా మరియు అంతర్జాతీయంగా ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇది దేశీయంగా అమ్మకాలను మాత్రమే కాకుండా ఇండియా నుండి సుమారుగా 40 కి పైగా దేశాలకు ట్రాక్టర్లన మరియు వ్యవసాయాధారితి పరికరాలను ఎగుమతి చేస్తోంది.

02. టాఫే

02. టాఫే

దేశీయంగా ఉన్న రెండవ అతి పెద్ద ట్రాక్టర్ల తయారీ సంస్థ టాఫే తమిళనాడులోని చెన్నై ఆధారిత సంస్థ. వినియోగదారులకు నమ్మకదగినమైన ఉత్పత్తులను అందిస్తున్న ఇది 1960 లో ప్రారంభమైంది. టాఫే సంస్థ చరిత్రలో మాస్సే, ఫెర్గూషన్ మరియు టాఫే అనే ట్రాక్టర్లు ఎంతో బాగా ప్రాచుర్యం పొందాయి.

01. మహీంద్రా ట్రాక్టర్స్

01. మహీంద్రా ట్రాక్టర్స్

మహీంద్రా ట్రాక్టర్స్ దేశీయంగానే కాదు అమ్మకాల పరంగా ప్రపంచ వ్యాప్తంగా నెం. 1 సంస్థ. 1964 లో ప్రారంభమైన మహీంద్రా ట్రాక్టర్స్ సంస్థ దేశీయంగా ఉన్న రైతులకు విభిన్న స్థాయి ఉత్పత్తులతో ఎంతో చేరువయింది. ట్రాక్టర్లనే కాకుండా ప్యాసింజర్ మరియు వాణిజ్య వాహనాల పరంగా అన్నింటి మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది.

ఇండియాలో ఉన్న టాప్-10 ట్రాక్టర్ తయారీ సంస్థలు

లక్షల కోట్లకు అధిపతి కాని ఆటోల్లో ప్రయాణిస్తాడు

గనులలో వినియోగించే వాహనాల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు

Most Read Articles

English summary
Top 10 Tractor Companies In India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X