ఇండియాలో ఉన్న టాప్ 5 బెస్ట్ మైలేజ్ పెట్రోల్ కార్లు

By Anil

మైలేజ్ పరంగా పెట్రోల్ కన్నా డీజల్ కార్లు ఎంతో బెస్ట్; అయితే పెట్రోల్ మరియు డీజల్ మధ్య ధరలు పెద్దగా వ్యత్యాసం ఏమీ లేదు. అంతే కాకుండా డీజల్ కార్లతో పోల్చుకుంటే పెట్రోల్ కార్ల ధరలు తక్కువగా ఉంటాయి.

మీకు కారు కొనుగోలు చేయాలనే ఆలోచన ఉండి, తక్కువ ధరలో, సులభమైన నిర్వహణతో, ఉత్తమ రీ సేల్ వ్యాల్యూని కలిగి ఉంటూ మరియు మంచి మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు కావాలనుకుంటున్నారా ? ఇండియన్ మార్కెట్లోకి వీటన్నింటికి న్యాయం చేసే ఐదు ఉత్పత్తులు ఉన్నాయి. వాటి గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఈ జాబితాలో అందించిన మైలేజ్ వివరాలు ఆటోమోటివ్ రీసెర్చ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సమాచారం ప్రకారం ఇవ్వడమైనది.

 5. టాటా టియాగో (మైలేజ్ - 23.84 కిమీ/లీ)

5. టాటా టియాగో (మైలేజ్ - 23.84 కిమీ/లీ)

డిజైన్, శక్తివంతమైన ఇంజన్ మరియు ఫీచర్లు వీటన్నింటిని గమనిస్తే మనం చెల్లించే ధరకు సరైన విలువ ఈ టియాగో హ్యాచ్‌బ్యాక్. ఇందులోని అత్యంత శక్తివంతమైన 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఉత్తమ మైలేజ్ ఇవ్వగల ఈ జాబితాలో లీటర్‌కు 23.84 కిమీ/లీ ఇస్తూ ఐ

పెట్రోల్ కార్లు మైలేజ్ రావు అనే వారికి సమధానం ఇదిగో...!!

అత్యధిక మైలేజ్ ఇవ్వగల పెట్రోల్ కార్ల జాబితాలో ఐదవ స్థానంలో ఉన్న ఈ టియాగో హ్యాచ్‌బ్యాక్ అత్యంత శక్తివంతమైనది. ఇందులోని ప్రారంభ వేరియంచ్ ఎక్స్‌బి ధర రూ. 3.20 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 4.81 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

4. మారుతి ఆల్టో కె10 (మైలేజ్ - 24.07కిమీ/లీ)

4. మారుతి ఆల్టో కె10 (మైలేజ్ - 24.07కిమీ/లీ)

ఇండియా యొక్క అతి పెద్ద సెల్లింగ్ కారు మారుతి ఆల్టో, అందులోని ఆల్టో కె10 తమ 800 మోడల్‌కు తోబుట్టువుగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ కె10 లో ఫాగ్ ల్యాంప్స్, టాకో మీటర్, పెద్ద టైర్లు, యాంటి థెఫ్ట్ అలారమ్ మరియు సీట్ బెల్ట్ వార్నింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

పెట్రోల్ కార్లు మైలేజ్ రావు అనే వారికి సమధానం ఇదిగో...!!

మారుతి ఆల్టో కె10 లో 1.0-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఇది సుమారుగా 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఇందులోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. ఆల్టో కె10 లోని ప్రారంభ వేరియంట్ ఎల్ఎక్స్ ధర రూ. 3.25 లక్షలు మరియు టాప్ ఎండ్ వేపియంట్ ధర రూ. 3.82 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

3. మారుతి ఆల్టో 800 (మైలేజ్ - 24.7కిమీ/లీ)

3. మారుతి ఆల్టో 800 (మైలేజ్ - 24.7కిమీ/లీ)

మారుతి వారి ఆల్టో శ్రేణిలో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన ఆల్టో 800 ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. అత్యంత సరసమైన ఉత్పత్తుల్లో ఇదీ ఒకటి. దేశ మొద్దం ఈ కార్లలో తిరుగుతోంది అంటే నమ్మశక్యం కాకపోవడానికి ఏమీ లేదని అనొచ్చు. అతి తక్కువ నిర్వహణ మరియు దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న సర్వీస్ సెంటర్లు దీనిని ఎంతో భారతీయులు ఎంచుకోవడానికి కారణం అయ్యాయి.

పెట్రోల్ కార్లు మైలేజ్ రావు అనే వారికి సమధానం ఇదిగో...!!

మారుతి ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ కారులో సుమారుగా 796సీసీ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది సుమారుగా 47బిహెచ్‌పి పవర్ మరియు 69ఎనఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ప్రారంభ వేరియంట్ ఎల్ఎక్స్ ధర రూ. 2.45 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 3.30 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

 2. డాట్సన్ రెడి గో (మైలేజ్ - 25.17కిమీ/లీ)

2. డాట్సన్ రెడి గో (మైలేజ్ - 25.17కిమీ/లీ)

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సరసమైన కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన డాట్సన్ ఇండియన్ మార్కెట్లోకి ఈ ఏడాది తొలిసగానికి చివరి అందుబాటులోకి తీసుకువచ్చిన రెడి గో సుమారుగా లీటర్‌కు 25.17 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో రెనో క్విడ్‌లో వినియోగించిన ఇంజన్‌ను అందించారు.

పెట్రోల్ కార్లు మైలేజ్ రావు అనే వారికి సమధానం ఇదిగో...!!

డాట్సన్ రెడిగో లోని 799సీసీ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ సుమారుగా 53బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. రెడి గో మొత్తం ఐదు విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ప్రార్ంభ వేరియంట్ డి ధర రూ. 2.4 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ఎస్ ధర రూ. 3.34 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఉన్నాయి.

 1. రెనో క్విడ్

1. రెనో క్విడ్

అత్యధికంగా అమ్మకాలు సాధించే ఉత్పత్తిగా దూసుకుపోవడానికి ప్రయత్నిస్తున్న రెనో క్విడ్ ఉత్తమ మైలేజ్ ఇవ్వగల పెట్రోల్ కార్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. రెనో వారి కుటుంబంలో క్విడ్ అత్యుత్తమ అమ్మకాలు సాధిస్తూ మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో మీడియానవ్ టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ ప్యానల్ వంటి విప్లవాత్మకమైన ఫీచర్లు ఉన్నాయి.

పెట్రోల్ కార్లు మైలేజ్ రావు అనే వారికి సమధానం ఇదిగో...!!

రెనో ఇండియా తమ క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌లో 799సీసీ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 53బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. రెనో క్విడ్ ప్రారంభ వేరియంట్ ఎస్‌టిడి ధర రూ. 2.6 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 3.64 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

పెట్రోల్ కార్లు మైలేజ్ రావు అనే వారికి సమధానం ఇదిగో...!!

ఎన్ని బైకులున్నా... ఈ ఆరు మాత్రమే ప్రత్యేకం !!

ఎక్కువ మైలేజ్ ఇవ్వగల 5 కాంపాక్ట్ సెడాన్ కార్లు

పెట్రోల్ కార్లు మైలేజ్ రావు అనే వారికి సమధానం ఇదిగో...!!

150సీసీ సెగ్మెంట్లో ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 బైకులు

125సీసీ సెగ్మెంట్లో ఉత్తమ మైలేజ్ ఇవ్వగల ఎనిమిది బైకులు

Most Read Articles

English summary
Top 5 Best Mileage Petrol Cars In India — Value For Money Propostion
Story first published: Monday, August 22, 2016, 17:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X